దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో మిషన్ సాయంతో మురుగునీటి నిర్వహణ

0

మానవరహిత మురుగునీటి నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీవరేజ్ మినీ జెట్టింగ్ వాహనాలను సీవరేజి బోర్డు అందుబాటుకి తెచ్చింది. 20 కోట్లతో కొనుగోలు చేసిన 70 వాహనాలను ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

హైదరాబాద్‌లో సుమారు 4.7లక్షల మ్యాన్ హోల్స్ ఉన్నాయి. నగరంలో అంతకంతకూ పెరుగుతున్న జనభాకు ఈ మ్యాన్‌ హోల్స్ కెపాసిటీ సరిపోవడం లేదు. వర్షమొస్తే మురుగునీరు పొంగిపొర్లుతుంది. దారి పొడవునా దుర్గంధం వెదజల్లుతుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా సిటీలో సీవరేజీ కార్మికులే నాలాలోకి దిగి మురుగుని ఎత్తిపోసేవారు. ఇది ఎంతమాత్రమూ నాగరికత కాదని భావించిన ప్రభుత్వం మురుగునీటి నిర్వహణలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా 70 జెట్టింగ్ యంత్రాలను సీవరేజీ కోసం ప్రవేశపెట్టారు. వీటిసాయంతో కార్మికులు మ్యాన్ హోల్ లో దిగకుండానే మురుగుని క్లీన్ చేయొచ్చు. ఈ యంత్రంలో నీళ్లను తోడేందుకు మోటారు, మురుగునీటి వ్యర్థాలను నిల్వచేసే స్టోర్ ట్యాంక్ , హోస్‌ పైపు ఉంటాయి. ఒక్కో మిషన్ ద్వారా రోజుకు 500 మీటర్ల డ్రైనేజీ లైన్లతో పూడిక తొలగించవచ్చు. ఇరుకు వీధుల్లో కూడా ఆపరేషన్ చేపట్టవచ్చు.

కార్మికుడికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సివరేజీ క్లినింగ్‌లో బ్యాక్టీరియా ఫ్రీ డ్రెస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. హెడ్‌లైట్‌ తో కూడిన హెల్మెట్, గమ్ బూట్లు, వాటర్ ఫ్రూప్ బట్టలు, గ్లౌజులు, బెల్టు, అక్జిజన్ మాస్క్‌ ఇచ్చారు. మ్యాన్‌హోల్స్ నిర్వహణ సమయంలో తీసుకునే జాగ్రత్తలపై కార్మికులకు శిక్షణ ఇచ్చారు.

స్వఛ్చ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో ఇప్పటికే విప్లవాత్మక మార్పులు చేపట్టిన ప్రభుత్వం సిటీలో 2500 ఆటో టిప్పర్ల సాయంతో చెత్త ఏరివేస్తోంది. గతంలో రోజుకి 3500 మెట్రిక్ టన్నులు చెత్త ఏరివేసేవారు. ట్రాలీలు పెరిగాక అదనంగా మరో వెయ్యి టన్నుల చెత్త సేకరిస్తున్నారు.  

Related Stories

Stories by team ys telugu