ఇప్పటికైనా మించిపోయింది లేదు.. మేథాశక్తికి పదును పెట్టండి !!

0

స్టార్టప్ ల విషయంలో భారత్ చాలా ఆలస్యంగా మేల్కొందనే చెప్పాలి అని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ. అందులో తన బాధ్యత కూడా ఉందన్నారు. పేదరికం, హెల్త్ కేర్ విషయంలో సమస్యలను అధిగమించాలంటే భారత్ వచ్చే పది పదిహేను ఏళ్లలో 10 శాతం వృద్ధి రేటు నమోదు చేయాలని అన్నారు. ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక విధానపరమైన వాతావరణాన్ని సృష్టించాలని అభిప్రాయపడ్డారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని తలపెట్టిన ప్రధాని మోడీని ఈ సందర్భంగా అభినందించారు. ఎంతో మంది భారతీయులు నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. మన దగ్గర టాలెంట్ కు కొరత లేదని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.

రోజుకు మూడు నాలుగు కొత్త స్టార్టప్ లు వస్తున్నాయి. జనం సవాళ్లను స్వీకరిస్తున్నారు. ఆ మేథో శక్తిని ఎలా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు.

Related Stories