స్వచ్ఛమైన గాలికోసం అద్భుతమైన మాస్క్ కనిపెట్టిన ఢిల్లీ ఐఐటీయన్లు  

0

మెట్రో నగరాల్లో విపరీతమైన కాలుష్యం పెరిగిపోయింది. ఉదాహరణకు ఢిల్లీనే చూసుకోండి. గాలి ఎంత విషతుల్యమైందో తాజా నివేదికలే అద్దం పడుతున్నాయి. ఊపిరితిత్తుల్లోకి డైరెక్టుగా విషవాయువులే పోతున్నాయి. స్వచ్ఛమైన గాలి కనుమరుగవుతోంది. శ్వాసనాళం బండి సైలెన్సర్ గొట్టాన్ని తలపిస్తోంది. తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే విషయం. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి. లక్షలాది వాహనాలు విడిచే పొగతో గాలి ఊపిరాడనీయడం లేదు. ఈ దుస్థితి గమనించిన ఇద్దరు ఐఐటీ విద్యార్ధులు అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నారు.

పొల్యూషన్ బారి నుంచి తప్పించుకోవడం కోసం రెగ్యులర్ మాస్కులు ధరిస్తాం. కానీ అవి ఎంతవరకు కార్బన్ రేణువుల్ని ఆపగలుగుతాయి? ఈ విషయం మీద రీసెర్చ్ చేసిన దేబయాన్ సాహా, శశిరంజన్ అనే ఢిల్లీ ఐఐటీ స్టూడెంట్స్.. కర్బన్ వాయువుల్ని వడగట్టే మాస్క్ ని తయారు చేశారు. ఆ ఆవిష్కరణ పేరే నోసాకిల్. సాధారణ మాస్కుల కంటే ఇది వందరెట్లు బెటర్. ఎలాంటి హానికారక రేణువుల్ని రానీయకుండా ఫిల్టర్ చేసి, ఫ్రెష్ ఎయిర్ ని శ్వాసనాళంలోకి పంపిస్తుంది.

నోసాకిల్ ఒక్కసారి వాడిపడేసేది కాదు. కాట్రిడ్జెస్ మార్చి ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు. కొందరికి నిద్రలో శ్వాస తీసకోవడం కష్టమవుతుంది. అలాంటి వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనికి అమర్చిన రెండు నాజిల్స్ నిద్రలో బ్రీథింగ్ ఈజీ చేస్తాయి. ప్రతీ 8 గంటలకోసారి కాట్రిడ్జెస్ మార్చుకుంటే సరి. దీని ధర కూడా తక్కువే. బయట దొరికే మాస్కుల కంటే మూడోవంతు చీప్. ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఫైనల్ అవగానే ఈ ఏడాది డిసెంబర్ కల్లా మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. 

Related Stories