బాధ్యత, బంధం కలగలసిన టూరిజం ‘గ్రాస్ రూట్ జర్నీ‘

గ్రాస్ రూట్ జర్నీపై స్పెషల్ ఫోకస్ఆకర్షణీయ, ప్రత్యామ్నాయ ఆదాయం వనరుగా టూరిజంపర్యాటక రంగంలో క్లారీప్రెస్ట్ మార్క్

బాధ్యత, బంధం కలగలసిన టూరిజం ‘గ్రాస్ రూట్ జర్నీ‘

Thursday April 30, 2015,

4 min Read

భారత్‌లో ఎంతమంది ధనవంతులున్నారో.. అంతకు పదిరెట్ల మంది బీదలున్నారు. మధ్యతరగతి జనాభా కూడా ఎక్కువే. అంతా కలగలిసిన ఓ గొప్ప సమూహం మనదేశం. ఇక్కడ పర్యాటక రంగం అనుకున్న స్థాయిలో ఎదగలేదనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడిప్పుడే ఈరంగం వైపు పెట్టుబడులు వస్తున్నాయి. దీనికి సామాజిక బాధ్యతను యాడ్ చేసి వ్యక్తే క్లారీ ప్రెస్ట్. ఆమె ప్రయాణంలో కొన్ని విశేషాలు యువర్ స్టోరీతో పంచుకున్నారు.

గ్రాస్ రూట్ జర్నీ చీఫ్  క్లారీ ప్రెస్ట్

గ్రాస్ రూట్ జర్నీ చీఫ్ క్లారీ ప్రెస్ట్


''నా 21 వ సంవత్సరంలో మిత్రుడితో కలిసి భారత్ పర్యటనకు వెళుతున్నప్పుడు ... కొత్త ఉత్సాహాన్ని నింపే విధంగా ..కార్పొరేట్ వ్యవస్థ , ఆ వాతావరణానికి భిన్నంగా పని చేయాలని నిర్ణయించుకున్నాను. ఓ ఏడాది తర్వాత గ్రాస్ రూట్ సంస్థను ప్రారంభించానని'' చెప్పారు క్లారీ ప్రెస్ట్. నేను జనవరి 2015 ఒడిశాలోని పూరీలో కొంత మంది మహిళలను కలిశాను. భారత ద్వీపకల్పం యొక్క తీరం వెంబడి, ప్రయాణిస్తున్నప్పుడు నా అనుభవాలను వారితో పంచుకున్నాను. కమ్యూనిటీ ఆధారిత పర్యాటకం అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు అవకాశాలు పెరగుతాయని నమ్మే క్లారీ ప్రెస్ట్ .. దీనికి అనుగణంగా పథకాలు రూపొందించారు. గ్రామాల్లో ఉన్న అభివృద్ధి సంఘాలలో కమ్యూనిటీ టూరిజంపై అవగాహన పెంచడం ద్వారా ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయ ఆదాయం వనరుగా మారుతుందని నమ్మారు. గ్రామస్థాయిలో ప్రయాణాలు ఆయా కమ్యూనిటీ యొక్క ఆర్ధిక వ్యవస్థ, పర్యావరణం మరియు సంస్కృతికి దోహదం చేస్తాయని భావించారు.

అసలు ఈ గ్రాస్ రూట్ ప్రయాణాలు ఏమిటి అంటూ... ఇంటర్వూల్లో అడిగినప్పుడు ఇలా చెప్పారు క్లారీ ప్రెస్టీ. ''నేను, నా భర్త ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు ఆఫీసు, పనే, బాధ్యతగా భావించేవాళ్లము. మేము రెండు సంవత్సరాలు పాంటో మైమ్ ( ఎవ్వరితో కలవకుండా) ఉండడమే కాకుండా ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించేవాళ్లము. మా ఉద్యోగ ప్రక్రియలో భాగంగా ప్రయాణించడంలో ఆనందం తెలిసింది. ఫీల్డ్ టూర్లలో మజా తెలిసినప్పటి నుంచీ.. ఢిల్లీ ఆఫీసులో కూర్చుని పనిచేయడం నచ్చకుండ పోయింది. అలా గ్రాస్‌రూట్ సంస్థ ప్రయాణం ఆలోచన రూపుదిద్దుకుంది. ఒడిశాలో మాకు ఉన్న పరిచయాలు, అనుబంధం ఉండడంతో ...ఒడిషా నుంచే మా గ్రాస్ రూట్ ప్రయాణం ఎన్నుకున్నాము. పర్యాటకంగా స్థానికులకు ఉపయోగపడేలా ఉండాలని నిర్ణయించుకున్నారు.

పంట పొలాల మధ్య ఆనందాన్ని అనుభవిస్తూ...

పంట పొలాల మధ్య ఆనందాన్ని అనుభవిస్తూ...


ప్రేస్ట్... గ్రాస్‌రూట్ ప్రయాణాలు భిన్నంగా రూపొందించారు. టూరిజానికి ఆఫ్ సీజన్‌లో వివిధ ప్రదేశాలకు ప్రయాణం చేసి అక్కడి స్థానికులతో మమేకమై... వారితో మాట్లాడటం ప్రారంభించారు. గ్రామాల్లోకి పర్యాటకులు వస్తున్నప్పుడు గ్రామస్థులు ఎలా భావిస్తున్నారు ? ఇంకా పర్యాటకులు రావడం ద్వారా ఆ ప్రాంతంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ? అనే విషయాలపై ఆరా తీశాము. టూరిజం అభివృద్ధి చెందాలంటే.. ఆయా ప్రాంతంలోని ప్రజల సహకారం ఎంతో అవసరం. దానికి తగినట్లుగా వాళ్లను ఉత్సాహపరచడం మా ప్రధాన లక్ష్యం. అయితే టూరిస్టులును గౌరవించడం అవసరం. మరో వైపు టూర్ ఆపరేట్లపై నియంత్రణ లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా ఉండేది. ఒక క్రమ పద్ధతిలో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే.. ఆదాయ వనరులు మారుతుందని అవగాహన కల్గించడంతో గ్రామస్థుల ఆలోచనలో మార్పు వచ్చింది. ఉదయం నుంచి గ్రామాల్లో పర్యటించి... సాయంత్రానికి వారికి అవసరమైన సలహాలు ఇచ్చేవాళ్లం. డబ్బులు సంపాదించడం ద్వారా అనుకున్నవి సాధించవచ్చనే విషయాన్ని స్థానికుల్లోకి తీసుకెళ్లగలిగామంటారు గ్రాస్ రూట్ ఫౌండర్.

టూరిజంలో ప్రత్యేకమైన స్థానం కల్గిన తాజ్ మహల్, గోవా బీచ్ ప్రాంతాల్లో పరిశీలించిన ఒడిశా వాసులకు మేము ఒక ఆశా కిరణంలా కనిపించాము. గ్రాస్ రూట్ ప్రయాణం మాకు మరింత బాధ్యత పెంచింది. అప్పటి వరకు ఇండియాలో ఉన్న టూరిజానికి కొత్త అర్ధం తీసుకువచ్చాము. విదేశీ టూరిస్టులు భారతదేశం యొక్క అందాలు చూడడమే కాకుండా గ్రామీణ భారతం, వారసత్వాన్ని తెలుసుకొనేందుకు ఆసక్తిగా ఉన్నారు. అనేక మంది ప్రజలు పట్టణాలలో ఉంటున్నప్పటికి.. గ్రామాల్లో వారి బాల్యాన్ని గడిపారు. మేము ఆ కుటుంబాలతో కలిసి ప్రయాణిస్తూ... పిల్లలకు తెలియచేసేందుకు ప్రయత్నించాము. ఇళ్లలో సాంప్రదాయ బద్దంగా వచ్చే కట్టుబాట్లు తెలుసుకుంటున్నారు. ఒడిశాలో పర్యాటకానికి తగిన ప్రాధాన్యం లేదు. స్థానికులకు మేము టూరిజంపై అవగాహన ఇవ్వడంతో, వారు వ్యవసాయ పనులును పక్కన పెట్టడం ప్రారంభించారు. టూరిజం వల్ల అవసరమైన డబ్బు వస్తుందని భావిస్తున్నారు స్థానికులు. టూరిజం అభివృధ్ది కోసం 10 సంవత్సరాలు గడిపాం అయితే అనుభవం, తగిన ప్రోత్సాహం లేకపోవడంతో..మా ప్రయత్నాలన్ని వృధాగానే మిగిలిపోయాయి.

image


అవగాహనా రాహిత్యంతో ఓ బడ్జెట్ తయారు చేసి ప్రకటనల కోసం భారీగా ఖర్చులు చేశాం. దీంతో అదంతా వృధా ఖర్చుగా మారిపోయింది. అయితే పర్యాటక రంగంలో ఒడిషా చేసిన కృషి కూడా తక్కువగా ఉండడంతో పాటు ఎటువంటి ప్రత్యక్ష సహకారం లేదు. ఓ సంస్థగా మేము ఏ భవనాలు నిర్మించలేదు. మేము ఒక చిన్న సంస్థగా రూపొంది, మెల్లిగా గ్రామాలు తిరిగి లాభాలు తీసుకొచ్చాము. గ్రామాల్లో అవసరాలైన నీటి పంపు, మరొ చోట మట్టి తాజా కోట్, మరో ప్రాంతంలో కమ్యూనిటీ హాల్.. ఇలా ఏది కావాలని భావిస్తే ట్రస్ట్ తరపున నిర్మాణానికి సాయం అందించేవాళ్లం. అలా ఒక్కో అడుగు గ్రామాల్లో మార్పునకు శ్రీ కారం చుట్టింది. తర్వాత మేము ఆ గ్రామాలకు వెళ్లినప్పుడు గ్రామస్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో ప్రతి సంవత్సరం మా పర్యటనలు పెంచుకుంటూ వచ్చాము. 

మేము చిల్కా వెళ్ళేటప్పుడు ఓర్ని పడవలను ఉపయోగించుకున్నాము. మోటర్ పడవలు వాడవద్దు. ఆ శబ్దం కాలుష్యం కట్ చేయండి అంటూ చేసిన ప్రయత్నం వారిలో ఆలోచన రేకెత్తించింది. మేము స్థానికులతో కలిసి పూరీ బీచ్ శుభ్రపరిచే పనిని కొనసాగించాము. అయితే మర్నాటికే అందమైన బీచ్ మురికిగా మారిపోయింది. మేము రాత్రికి రాత్రే ప్రజల అలవాట్లు మార్చలేమమన్న నిర్ణయానికి వచ్చాం.

ముందుగా గ్రామాల్లో బలంగా నాటుకుని ఉన్న కుల వ్యవస్థను అధిగమించడానికి ఒక ప్రణాళిక రూపొందించాలి. పర్యాటక రంగానికి గ్రామాల్లో ఉన్న పరిస్థితులే సానుకూలం, ప్రతికూలం అవుతాయి. పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వచ్చినప్పుడు స్థానికంగా లభ్యమయ్యే వస్తువులకు ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ దొరికే వాటికి శుభ్రత లేకపోతే...వారు పిజ్జా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. దాని వల్ల స్థానికులను విస్మరించవచ్చు. అప్పుడు గ్రామస్థులకు తగిన ఆదాయం దొరకదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనకు డబ్బులు పెరిగాలంటే... పర్యాటకుల ప్రాముఖ్యం చాలా ఉంటుంది. అంతే కాదు... మరోవైపు, మీరు సంస్కృతి గురించి చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ నైపుణ్యం మాత్రమే ప్లస్ పాయింట్ అవుతుందని వివరిస్తున్నారు గ్రాస్ రూట్ జర్నీ ఛీఫ్.

ఎవ్వరి సలహాలు బలవంతంగా రుద్దడం కాదు... నేర్చుకోవడానికి ప్రయత్నించండి.. ప్రయాణం ద్వారా జీవితంలో మెరిట్ పొందడంతో పాటు... మెమరీస్ గుర్తిండిపోతాయంటారు క్లారీ ప్రెస్ట్.