స్టైల్ గాఉండండి.. లక్ష్యాన్ని సాధించండి- విరాట్ కోహ్లీ

స్టైల్ గాఉండండి.. లక్ష్యాన్ని సాధించండి- విరాట్ కోహ్లీ

Friday April 29, 2016,

2 min Read


జిమ్ అండ్ ఫిట్ నెస్ రంగంలో తనదైన మార్క్ సాధించిన స్టైలిష్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాజాగా గార్మెంట్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. రాంగన్ పేరుతో హైదరాబాద్ లో ఒక స్టోర్ ని ప్రారంభించాడు. దీంతో కోహ్లీ వచ్చిన కూకట్ పల్లి ఫోరం మాల్ కాస్త క్రికెట్ స్టేడియాన్ని తలపించింది. జనం ఈలలు, చప్పట్లతో అభిమాన ఆటగాడికి స్వాగతం పలికారు.

“హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉంది, అందరికీ ధన్యవాదాలు” -కోహ్లీ

రాంగన్ స్టోర్ ప్రారంభం

కూకట్ పల్లిలోని ఫోరం మాల్ లో 1000 చదరపు అడుగుల స్థలంలో ఈ ఆఫ్ లైన్ స్టోర్ కోహ్లీ చేతుల మీదుగా ప్రారంభమైంది. అంజనా రెడ్డి దీని ఫౌండర్ కమ్ సీఈఓ కాగా.. కోహ్లీ దీనికి కో ఫౌండర్. ఇప్పటికే స్టోర్స్ లో అందుబాటులో ఉన్న ఈ బ్రాండ్ మొదటిసారి ఎక్స్ క్లూజివ్ బ్రాండ్ అవుట్ లెట్ ని ఇక్కడ ప్రారంభించింది.

image


“ప్రమోషన్ సమయంలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ కావడం నాకొక పెద్ద సవాల్”- విరాట్

ఈవెంట్ కి ఇంతమంది జనం వస్తారని ఊహించలేదని.. వీళ్ల ముందు మాట్లాడటం కొద్దిగా బెరుకుగా ఉందని అన్నాడు కోహ్లీ. అంజనారెడ్డితో కలసి రాంగన్ సింబల్ ని చూపించి స్టోర్ ను ప్రమోట్ చేశాడు. మరిన్ని షోరూంలు ప్రారంభించాలని చూస్తున్నట్లు అంజనా తెలిపారు. వచ్చే మూడేళ్లలో 100 ఎక్స్ క్లూజివ్ బ్రాండ్ ఔట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

స్టైల్ గా ఉండండి

స్టైల్ గా ఉంటే సక్సెస్ మీ సొంత అవుతుందని కోహ్లీ అన్నాడు. స్టయిల్ గా ఉండటం వల్ల మానసికంగా బలంగా తయారవుతారని, లక్ష్యాన్ని గురి పెట్టడం సింపుల్ అవుతుందని చెప్పుకొచ్చాడు. క్రీడలకు ఎవరు మద్దతిచ్చినా మంచిదే అని అన్నాడు. దేశంలో క్రీడలు మరింత డెవలప్ కావాలని అన్నాడు. ఇప్పట్లో పూర్తిగా ఆంట్రప్రెన్యూర్ గా మారే ఆలోచన లేదని తెలిపాడు. మరో పదేళ్లు క్రికెట్ పైనే లక్ష్యంగా పెట్టుకున్నానని కోహ్లీ చెప్పాడు. ఆ తర్వాత సీరియస్ గా వ్యాపారం పై కాన్సన్ ట్రేట్ చేస్తానని అన్నాడు.

“కస్టమర్లకు వన్ స్టాప్ సొల్యూషన్ మా స్టోర్,” అంజనారెడ్డి

రాంగన్ అనేది సాధారణ ధరలకే స్వంకీ స్టైల్ డిజైన్లు దొరుకుతాయని అన్నారు. ప్రస్తుతం స్టోర్లో 250 డిజైన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ షూలతో పాటు షార్ట్ లు, టీ షర్టులు కూడా దొరకుతాయి. సమ్మర్ స్పెషల్ బట్టలు తమ స్టోర్ లో ఉన్నాయని అన్నారు. 999 నుంచి ఫుట్ వేర్ లు లభిస్తాయని ముగించారు.