యువతీ యువకుల్లో స్ఫూర్తి రగిలించిన మీటప్ హైదరాబాద్

యువతీ యువకుల్లో స్ఫూర్తి రగిలించిన మీటప్ హైదరాబాద్

Monday May 15, 2017,

1 min Read

యువర్ ఆధ్వర్యంలో జరిగిన మీటప్ హైదరాబాద్ ఎంతో ఉల్లాసంగా జరిగింది. ఔత్సాహిక ఆంట్రప్రెన్యూర్లు, బడ్డింగ్ ఆంట్రప్రెన్యూర్లు హాజరై తమతమ స్టార్టప్ ఐడియాలను, అనుభవాలను, భవిష్యత్ లక్ష్యాలను పంచుకున్నారు. యువర్ స్టోరీ ఆధ్వర్యంలో జూబ్లిహిల్స్ కొల్లాబ్ హౌజ్ లో ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. యవతీ యువకులంతా తమ కాన్సెప్టులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

image


వే టు నెట్ వర్క్స్, ట్రాక్యో, సీడ్ బాస్కెట్, లింక్ డాట్ కామ్ వంటి స్టార్టప్స్ పనిచేసే తీరు పలువురిని ఆకర్షించింది. పిచింగ్ తర్వాత జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ ఉత్సాహభరితంగా సాగింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆర్కిటెక్ట్ రాజ్ సహకారం ఈవెంట్ విజయవంతం కావడానికి తోడ్పడింది.

image


నూతన ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పి, యువ ఆంట్రప్రెన్యూర్ల వెన్నుతట్టి ప్రోత్సహించే యువర్ స్టోరీ ఏటా ప్రముఖ నగరాల్లో మీటప్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో చేపట్టిన ఈ ఈవెంట్ పలువురిలో స్ఫూర్తి నింపింది. ప్రతీ కథకూ ఓ విలువ ఉంటుందని నమ్మిన యువర్ స్టోరీ, అందరి ఆలోచనలకూ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. అందుకే అందరి గమ్యంలో యువర్ స్టోరీ భాగస్వామ్యం అవుతూ, వారి ఉన్నతికి తోడ్పడుతోంది.