కొత్త స్టార్టప్‌కు టెక్ సపోర్ట్ కావాలా..?

కొత్త స్టార్టప్‌లకు టెక్‌ సపోర్ట్‌ ఇస్తాం మంటున్న హైదరాబాద్ స్టార్టప్--ఐఓఎస్,ఆండ్రాయిడ్,విండోస్ యాప్ లలో స్పెషలిస్ట్ కలిగిన టీం--వెబ్ పోర్టల్ దగ్గరి నుంచి ఈకామర్స్ దాకా అన్న రకాల సపోర్ట్  

కొత్త స్టార్టప్‌కు టెక్ సపోర్ట్ కావాలా..?

Tuesday August 18, 2015,

3 min Read

మనం జీవితంలో ఏదైనా సాధిస్తే మనల్ని చాలా మంది గుర్తిస్తారు. కానీ మన వల్ల ఎవరైనా ఏదైనా సాధిస్తే.. మనల్ని గుర్తు పెట్టుకుంటారు. గుర్తించడం కంటే గుర్తుపెట్టుకోవడంలో ఉన్న మజానే వేరు. ఏం చేసినా పదిమందికి సాయపడంలోనే అసలు జీవితానందం ఉంటుంది. వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తున్న మనదేశంలో ఇప్పటికి టాటా లాంటి బడా సంస్థలు ఎన్నో సంస్థలకు తన సహాయ సహకారాలందిస్తూ దేశాన్ని ముందుకు నడిపే ఓ గొప్ప శక్తిగా అవతరించింది. రతన్ టాటా జీవితమే ఎంతోమంది యువ ఆంధ్రపెన్యువర్లకు ఆదర్శంగా నిలుస్తోంది. అలాంటి వారిలో కుసమ్ నాగశేషానందరెడ్డి ఒకరు. తాను స్టార్టప్ రన్ చేస్తూనే ఎన్నో స్టార్టప్ లకు టెక్ సపోర్టు ఇస్తున్నారు. స్టార్టప్ రిచ్ ల్యాబ్స్ (richlabz.com) సాధారణ స్టార్టప్ మాత్రమే కాదు. మరికొన్ని స్టార్టప్ లకు అండగా నిలవడానికై ప్రారంభించిన సంస్థ. ప్రస్తుతానికి హైదరాబాద్ స్టార్టప్ లు, ఈకామర్స్ కంపెనీల వెబ్ పోర్టల్ లను డిజైన్ చేయడంతోపాటు వాటిని తమ సైట్ లో ప్రమోట్ చేస్తోంది. పర్ఫెక్ట్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్ ని బిల్డ్ చేయడమే తమ లక్ష్యమంటారు ఫౌండర్ శేషు.

“ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం సంపాదించడం చాలా సులువైనది. అదే ఉద్యోగం ఇవ్వడమనేది చాలా కష్టమైన పని. ఎక్కడైనా ఉపాధి వెతుక్కోవడం కంటే ఉపాధి కల్పించడానికే నా ఓటు” అంటారు శేషు. ఇదే సిద్ధాంతంతో తాను వ్యాపారం చేస్తున్నానని చెప్పుకొచ్చారాయ.

రిచ్ ల్యాబ్స్ ఏం చేస్తుంది ?

టెక్నికల్ గా వెల్ ట్రెయిన్డ్ టీం ఉంది. ఐఓఎస్ అప్లికేషన్ పై క్షుణ్ణంగా పనిచేసి స్టార్టప్ అప్లికేషన్ ను డెవలప్ చేస్తారు. వీరు చేపట్టిన ప్రాజక్టుల్లో దేనికదే యునిక్ ఫీచర్లను కలిగి ఉంది. అది స్టార్టప్ , చిన్న తరహా పరిశ్రమ, లేదా భారీ పరిశ్రమ కానీ వారికి కావల్సిన అన్ని రకాల సాఫ్ట్ వేర్ ని అందించడానికి సిద్ధంగా ఉంటుంది రిచ్ ల్యాబ్స్. యునిక్ కాన్సెప్ట్ తో వచ్చిన వారికి ఎలాంటి పెట్టుబడి లేకపోయినా ఫర్వాలేదు. సాఫ్ట్ వేర్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీ అంటారు శేషు. ఆండ్రాయిడ్ యాప్ పై అనుభవం కలిగిన టీం రిచ్ ల్యాబ్ సొంతం. స్టార్టప్ దగ్గర కాన్సెప్ట్ ఉండాలే కానీ దాన్ని డెవలప్ చేయడానికి రిచ్ ల్యాబ్స్ రెడీగా ఉంటుంది. ఈ-కామర్స్ డెవలప్ మెంట్ పై కూడా బాగా పట్టున్న టీం రిచ్ ల్యాబ్స్ లో ఉంది. ఇదొక ల్యాబరేటరీ. ఇక్కడ నిరంతరం ప్రయోగాలు జరుగుతునే ఉంటాయి. విండోస్ ఫ్లాట్ ఫాం లోకూడా యాప్ డెవలప్ చేయడానికి క్రియేటివ్ టీం ఉంది. ఈ ప్రయోగశాలలో సక్సెస్ అయిన ఫార్ములాలను అందిస్తుంది. అందుకే మా కంపెనీ పేరు రిచ్ ల్యాబ్స్ గా పెట్టామంటున్నారు శేషానందరెడ్డి.

image


ఫౌండర్ అండ్ టీం

కుసమ్ నాగ శేషానందరెడ్డి రిచ్ ల్యాబ్స్ ఫౌండర్ సీఈవో. అతని విజన్ తోనే సంస్థ నడుస్తోంది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి 2011లో ఎంసీయే పూర్తి చేశారు. అనంతరం మూడు స్టార్టప్ కంపెనీలకు పనిచేశారు. కిందటేడాది చివర్లో రిచ్ ల్యాబ్స్ మొదలు పెట్టారు. గతంలో పనిచేసిన కంపెనీల్లో జరిగిన తప్పిదాలు మరో సారి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని మందుకు పోతున్నారు. తాను ఇంటర్ చదువుతున్న రోజుల నుంచే కంప్యూటర్ పై ఆసక్తి పెంచుకొన్నారు. అందుకే ఇప్పటికీ కంప్యూటర్ పాఠాలు చెప్పడం అతని హాబీ. ఇక టీం విషయానికొస్తే వెంకటేశ్వర చారీ కంపెనీ సిటీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయనకు టెక్ అనలిస్ట్ , టెక్నికల్ ఆఫీసర్ గా ఎమ్మెన్సీ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది. కోర్ టీం లో మరో వ్యక్తి మౌళాటు. ఈయన డిజైనింగ్ తోపాటు ఆపరేషన్స్ చూస్తారు. వీరితో కలుపుకొని మొత్తం 20మంది రిచ్ ల్యాబ్స్ కు ఆన్ రోల్ లో ఉన్నారు.

రిచ్ ల్యాబ్స్ క్లెయింట్స్

కొత్తగా ప్రారంభం అవుతున్న స్టార్టప్ కంపెనీలే రిచ్ ల్యాబ్స్ టార్గెట్ మార్కెట్. బడా క్లెయింట్స్ కోసం ఎదురు చూడకుండానే చిన్న కంపెనీలకు సాయం అందిస్తూ ముందుకు పోవాలనే లక్ష్యంతో కంపెనీ అడుగులేస్తోంది. సాధారణంగా పోర్టల్ డిజైనింగ్ తోపాటు యాప్ డెవలప్ మెంట్ వరకూ అన్ని వ్యవహారాలు చూసుకుంటుంది. యునిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఔత్సాహికుల దగ్గర నామినల్ చార్జీ తీసుకొని టెక్ సపోర్టు అందిస్తారు. కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టానికి సిద్ధంగా ఉన్నామని ఫౌండర్ శేషు అన్నారు. రిచ్ ల్యాబ్స్ లో నిరంతరంగా ట్రెయినింగ్ క్లాసులు జరుగుతుంటాయి. స్టార్టప్ కు కావల్సిన టెక్నికల్ స్టాఫ్‌ నుంచి ప్రతి విషయంలో రిచ్ ల్యాబ్స్ మార్కు ఉండేలా తీర్చి దిద్దడంపై పూర్తి స్థాయిలో పనిచేస్తున్నది స్టార్టప్ టీం. కొత్తగా క్లెయింట్స్ వెతుక్కునే పని లేకుండా తమ దగ్గర ట్రెయినింగ్ తీసుకున్న ఎంతో మంది చేత స్టార్టప్ ప్రారంభించి తమకు క్లెయింట్స్ గా మార్చుకుంటున్నారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

కాలేజీల్లో ఈవెంట్స్ ప్లాన్ చేసి అక్కడ టాలెంట్ హంట్ చేపట్టాలని చూస్తోంది రిచ్ ల్యాబ్స్. విద్యార్థులంతా ఫ్రెష్ థాట్స్ తో ఉంటారు. ఔటాఫ్ బాక్స్ ఆలోచించే విద్యార్థులను గుర్తించి వారి భవిష్యత్ కు కావల్సిన ట్రెయినింగ్ అందించాలని చూస్తోంది. అవసరం అనుకుంటే పెట్టుబడి పెట్టి వారితో స్టార్టప్ ప్రారంభించే యోచనలో ఉంది. ప్రస్తుతం సాస్ పై నడుస్తోన్న కంపెనీ భవిష్యత్ లో యాప్ ఫ్లాట్ ఫాంపైకి రానుంది. షాపింగ్, ఈకామర్స్ కలిసిన ఫ్లాట్ ఫాంతో మరో ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నామని .. తొందరలోనే తీసుకురానున్నామని శేషు అంటున్నారు

రిచ్ ల్యాబ్స్ నకలు యాప్  ప్రాజెక్టు

రిచ్ ల్యాబ్స్ నకలు యాప్ ప్రాజెక్టు


పదిమందికి సాయం చేయడం అంటే మనకు మనం సాయం చేసుకోవడమే. మన మద్దతుతో పదికంపెనీలు పైకొస్తే వాటికంటే ఒక మెట్టు పైనే మనం ఉన్నట్టు లెక్క. ఇదే మా రిచ్ ల్యాబ్స్ వ్యాపారం సూత్రం అని ముంగించారు ఫౌండర్ శేషు