పతంజలి ఉత్పత్తుల్ని డోర్ డెలివరీ చేస్తామంటున్న ప్లస్

కస్టమర్ల చెంతకు ప్రొడక్ట్స్ను చేర్చే ప్లస్ యాప్ త్వరలో ఢిల్లీ, గుర్గావ్ లో అందుబాటులోకి రానున్న సర్వీస్

0

FMCG మార్కెట్లో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న పతంజలి ఆయుర్వేద కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. లేటుగా అయినా లేటెస్టుగా డోర్ డెలివరీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. మెడిసిన్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ను డోర్ డెలివరీ చేసే గుర్గావ్ కు చెందిన స్టార్టప్ ప్లస్ (PLUSS)తో కలిసి ఉత్పత్తుల్ని కస్టమర్ల చెంతకు పంపేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 2500కోట్లకుపైగా ఆదాయం ఉన్న పతంజలి సంస్థ ప్రస్తుతం దేశంలోని టాప్ ఫైవ్ FMCG కంపెనీల్లో ఒకటి. సంస్థ ఉత్పత్తి చేసి విక్రయించే వస్తువుల్లో న్యూట్రిషన్ - సప్లిమెంట్, హెయిర్, స్కిన్, డెంటర్ కేర్కు సంబంధించిన ఉత్పత్తులున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో త్వరలోనే ప్లస్ యాప్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం పతంజలి ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్నది.

“దేశంలోని టాప్ 5 FMCG కంపెనీల లిస్టులో పతంజలి ఇప్పటికే స్థానం సంపాదించుకుంది. ఫార్మాస్యూటికల్స్, హెల్త్ నీడ్స్ కు సంబంధించిన ప్రొడక్ట్స్ ను కస్టమర్లకు అందజేస్తాం.” -మధులిక పాండే, ప్లస్ కో ఫౌండర్

ఇండియన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఇబ్బందుల్ని గమనించిన అతీత్ జైన్, మధులిక పాండే, తరుణ్ లవాడియాలు కలిసి 2015లో ప్లస్ (PLUSS) పేరుతో స్టార్టప్ను ప్రారంభించారు. నిత్యావసర వస్తువులతో పాటు ఫుడ్ ను డోర్ డెలివరీ చేసే అవకాశమున్న దేశంలో మెడిసిన్స్ డెలివరీకి మాత్రం అలాంటి సదుపాయం లేకపోవడం వాళ్లలో ఈ ఆలోచన రేకెత్తించింది. ప్లస్ మ్యాన్ పేరుతో కంపెనీ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ వచ్చిన ఆర్డర్లను సకాలంలో అందిస్తుండటంతో ప్లస్ అందరి ఆదరాభిమానాలు పొందుతోంది.

IDG వెంచర్స్ ఇండియా, M&S పార్ట్నర్స్ (సింగపూర్), పవర్ హౌజ్ వెంచర్స్ (యూఎస్ఏ) ల నుంచి మిలియన్ డాలర్ల ప్రీ సీరీస్ ఏ ఫండ్ ను ప్లస్ సమీకరించింది. ఢిల్లీ, గుర్గావ్ లలో సేవలందించే ప్లస్ యాప్ ని నెలకు దాదాపు 15వేల మంది ఉపయోగిస్తున్నారు.

హెల్త్ ప్రొడక్ట్ మార్కెట్ ఏటా 15 శాతం వృద్ధితో 2017 నాటికి 158 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నది అంచనా. ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని కస్టమర్ల కష్టాలు తీర్చడంతో పాటు లాభాలు సంపాదించాలని ప్లస్ భావిస్తోంది.

ప్లస్ ముఖ్యంగా బేబీ కేర్, పెట్ కేర్, పర్సనల్ వెల్నెస్, డైలీ ఎసెన్షియల్స్ వంటి నాలుగు విభాగాల్లో సబ్ క్యాటగిరీల్లో వందల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంచుతోంది. ఈ ఆన్ డిమాండ్ మెడిసిన్ డెలివరీ యాప్ సర్వీస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండటంతో ఆదరణ పెరుగుతోంది. ఈ యాప్ Androidతో పాటు IOSలోనూ అందుబాటులో ఉంది.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి