మంచి బుక్‌పై లుక్కేయడం ఈజీ అంటున్న బుక్2లుక్

ఆన్‌లైన్‌లో పుస్తకాలు కొనడం 'బుక్2లుక్'తో ఎంతో ఈజీపుస్తక భాండాగారం మీ చేతుల్లోనే ఒక్క క్లిక్ చేస్తే చాలు అందుబాటులో ఈ -బుక్ అమెజాన్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తోన్న బుక్2లుక్

మంచి బుక్‌పై లుక్కేయడం ఈజీ అంటున్న బుక్2లుక్

Saturday June 06, 2015,

4 min Read

సాంకేతిక రంగం ఎంతగానో విస్తరించింది. తమకు అందిన సమాచారాన్ని పదిమందికీ చేరవేయడం ఇప్పుడు వేగంగా మారింది. పుస్తకాలు ముద్రించడం, వాటిని వివిధ బుక్ స్టాల్స్‌కు పంపించడం ఇప్పుడు మనకు కనిపించదు. ఈ బుక్ రీడింగ్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన పుస్తకాలను కొనుక్కుని అక్కడే చదివేయడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. 2017 నాటికి ప్రింటెడ్ పుస్తకాల కంటే ఈ-బుక్స్ బాగా విస్తరిస్తాయని అంచనా. అమెరికాలో 2017 నాటికి ఈ బుక్స్ సింహభాగం ఆక్రమిస్తాయంటున్నారు. మిగతా ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి ప్రచురణకు సంబంధించిన గ్రంథాలు, పుస్తకాలు కనుమరుగు కాకతప్పదనే వాళ్లూ లేకపోలేదు.

image


పబ్లిషర్లు, పుస్తక విక్రేతలకు మేలు కలిగేలా 'బుక్2లుక్' పనిచేస్తోంది. ఈ-బుక్స్ పెరగడంలో Amazon.com విప్లవాత్మకమయిన మార్పులు తీసుకు వచ్చింది. అయితే Amazon.com ఆధిపత్య ధోరణిలో వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. ఆధునిక సాంకేతిక సహాయంతోఈ-బుక్ రీడింగ్ కల్చర్‌ ఇప్పుడు పెరుగుతోంది. ప్రపంచంలో ఏ మంచి పుస్తకమయినా చిటికెలో మీకు అందుబాటులోకి వస్తుంది. అంతా డిజిటలైజేషన్ అయిపోతున్న ప్రస్తుత తరుణంలో ఈ-బుక్స్‌కి ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది.

చిన్న పబ్లిషర్లు అంది వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోలేకపోతున్నారు. దీంతో సంప్రదాయ బుక్ ప్రింటింగ్ ప్రక్రియకే మొగ్గుచూపుతున్నారు. ఆధునిక సాంకేతికతను అర్థం చేసుకోవడం వెనుకబడ్తున్నారు.

ఈ విషయంలో జర్మనీ బుక్ పబ్లిషింగ్‌ ఎంతో ముందుంది. 30 ఏళ్ళ నుంచీ ఈ రంగంలో అద్బుతాలు చేస్తున్నారు Ralph Möller. పిల్లల పుస్తకాల పబ్లిషింగ్‌లో ఆయన ఆధునిక పద్థతులను అనుసరిస్తున్నారు. ఆయనతో పాటు Systhema పేరుతో ఆయన భార్య ఐరిస్ బెల్లింగ్ హసన్ ఎన్నో కొత్త పద్ధతులను అవలంభిస్తున్నారు. జర్మన్ భాష మాట్లాడే పిల్లల కోసం తక్కువ ఖర్చు, సాఫ్ట్‌వేర్‌తో బుక్ స్టోర్స్‌ నడుపుతున్నారు. బెల్లింగ్ హసన్ బాటలో నడవాలని పదిమంది అనుకుంటున్నారు.

Möllers & Bellinghausen లు Terzio Verlag München పేరుతో ఓ పబ్లిషింగ్ హౌస్‌ను నిర్వహిస్తున్నారు. జర్మనీకి చెందిన వివిధ మ్యూజికల్ బుక్స్‌ను, సీడీలను అందరికీ అందుబాటులో తేవాలని భావించారు. అందులో భాగంగా సీడీ రామ్స్ తీసుకువచ్చారు. ఇప్పటికే 600 సంగీత విభాగాలకు సంబంధించిన ప్రోడక్ట్‌లను ఆన్‌లైన్‌లో ఉంచారు. 1990 దశకంలో సీడిలు తెచ్చిన సంచలనం అంతా ఇంతా కాదు. Terzio వివిధ రకాల సీడీలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. అయితే ఆ తర్వాత Amazon నుంచి వచ్చిన పోటీతో Terzio పోరాటం చేయాల్సి వచ్చింది. కేవలం బుక్ స్టోర్స్‌కే తమ సేవలు పరిమితం కాకుండా ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని భావించారు.

image


ఆలోచనల్లో భాగంగా న్యూ ఢిల్లీ, బెంగళూరుల్లో German Book Office లు తెరిచారు. ముంబైకి చెందిన edutainment company WITS తో ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థ CEO హితేష్ జైన్ సహకారం మరువలేనిదంటారు హసన్. వివిధ పుస్తకాలకు సంబంధించి ప్రోమోలను ఆన్‌లైన్‌లో ఉంచడం ప్రారంభించారు. వివిధ విభాగాలకు చెందిన బుక్స్ 'బుక్2లుక్' లో ఉంచారు. దీనికోసం వారు ప్రాథమిక పెట్టుబడిగా 25 వేల యూరోలు పెట్టారు. Terzio and WITS సంయుక్తంగా ప్రారంభించిన బుక్ డిస్కవరీ టూల్ ఐడియా బాగానే వర్కవుట్ అయింది.

biblet పేరుతో ఒక విడ్జెట్‌ని డెవలప్ చేశారు. దీంతో book2lookని బ్రౌజ్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రపంచంలోని వివిధ భాషలకు చెందిన పుస్తకాలు అందుబాటులో ఉంచారు. జర్మన్, ఇంగ్లీషు, స్పానిష్ భాషలకు చెందిన వివిధ విభాగాలకు చెందిన పుస్తకాలను ఆన్‌లైన్‌లో ఉంచారు. ఇప్పటి వరకూ 60 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. book2look సక్సెస్ అయ్యాక ఈ వెబ్‌సైట్ కార్యకలాపాలను అమెరికా, స్పెయిన్‌కు విస్తరించారు. biblet అనేది కేవలం బుక్ రీడర్స్‌కే కాదు రచయితలు, అమ్మకం దారులు, బుక్‌స్టోర్స్, బ్లాగర్స్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

'బుక్2లుక్'లో తమ పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలంటే ముందుగా రచయతలు, పబ్లిషర్స్ తమ పుస్తకానికి సంబంధించిన pdf ఫార్మాట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు రచయిత పేరు, చిరునామా, బుక్ టైటిల్, పబ్లిషర్, రేటు, ISBN నెంబరుని 'బుక్2లుక్' కి అందచేయాలి. ఆ విధంగా అందచేశాక biblet వెర్షన్ 45 నిముషాల్లో అందుబాటులోకి వస్తుంది. biblet వచ్చాక పబ్లిషర్ కొంత మొత్తాన్నిఒకేసారి 'బుక్2లుక్' కి చెల్లిస్తారు. అలా చెల్లించిన తర్వాత ఆన్‌లైన్‌లో బుక్ అందుబాటులోకి వస్తుంది. ఆన్‌లైన్‌లో ఉన్న ఆయా పుస్తకాలను పాఠకులు చదువుకోవచ్చు. జీవితాంతం biblet పాఠకులకు అందుబాటులో ఉంటుంది.

image


biblet ద్వారా ఆయా పుస్తకాల కవర్ పేజీలు, పుస్తకం యొక్క సమాచారం, ముఖ్యాంశాలు సోషల్ మీడియాలో అందుబాటులోకి వస్తాయి. Facebook, Twitter, LinkedIn, Pinterest ద్వారా అందరు పాఠకులకు ఈ సమాచారం చేరుతుంది. ఫలానా బుక్ ఫలానా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చిందని ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటారు. బుక్‌కి సంబంధించిన ఇమేజ్‌పై క్లిక్ చేస్తే రచయిత, వెబ్‌సైట్ సమాచారం తెలుస్తుంది. QR code ని స్మార్ట్‌ఫోన్‌లో స్కాన్ చేస్తే చాలు ఆయా పుస్తకాలు సరసమయిన ధరలకు చదువుకునేందుకు అందుబాటులో ఉంటాయి. వీటివల్ల బుక్ కొని చదవాల్సిన పనిలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెబ్‌సైట్ నిర్వాహకులు సూచించిన మొత్తాన్ని ఒకేసారి పే చేస్తే సరిపోతుంది.

ఒకసారి biblet ఓపెన్ అయితే ఆయా రచయితలు, పబ్లిషర్ల ఇతర ప్రచురణలు కూడా ఒకేచోట లభ్యమవుతాయి. ఆయా పుస్తకాలపై ఇతర పాఠకుల అభిప్రాయాలు, సూచనలు మనకు తెలుస్తాయి. ఏ బుక్ బాగుందీ అనేది కూడా సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. ఇతర పాఠకుల తమ అమూల్యమయిన సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆయా బుక్‌లకు చెందిన ప్రోమోలు, వీడియోలు, బుక్ రివ్యూలు ఇవ్వడం వల్ల సమగ్రమయిన సమాచారం పాఠకుడి చెంతకు చేరుతుంది. ‘‘వివిధ బుక్‌లకు సంబంధించిన ఒకే రకమయిన సమాచారం పాఠకులకు ఇవ్వడం వల్ల పబ్లిషర్ల పని సులువవుతుంది. పాఠకులు కూడా తమ ఛాయిస్, అవసరం మేరకు పుస్తకాలు చదువుకునే అవకాశం ఉంటుంది’’ అంటున్నారు Ralph Möller.

తమ దగ్గరున్న సమాచారంలో ఆయా పుస్తకాలు కొనుగోలు చేయాలో వద్దో పాఠకులే నిర్ణయించుకుంటారు. ఒక బుక్ కొనాలంటే యానిమేటెడ్ బుక్ ఇమేజ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మనకు అవసరమయిన పుస్తకం ఈ బుక్ రూపంలో వస్తుంది. మనం డబ్బులు పేమెంట్ చేసిన వెంటనే ఆ బుక్‌కి సంబంధించిన లింక్ కస్టమర్‌కు అందుతుంది.

రిటైలర్ల కోసం 'బుక్2లుక్' ప్రత్యేక ఏర్పాటు చేశారు. రిటైలర్లు లాగిన్ అయితే biblet అందుబాటులోకి వస్తుంది. కస్టమైజ్డ్ biblets రిటైలర్లకు ఉచితంగా దొరుకుతాయి. బుక్ రివ్యూ చేయాలనుకునేవారు biblets చూసి తమ ఆకాంక్షను నెరవేర్చుకోవచ్చు. బ్లాగ్లు నిర్వహించేవారు ఈ-బుక్ లోగోలతో యాక్సెస్ కావచ్చు.

జింబాబ్వేకి చెందిన ‘Ama’ అనే పబ్లిషింగ్ హౌస్‌తో కలిసి కేస్ స్టడీ చేశారు Möller. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ ఈ బుక్స్ అన్నీ book2lookలో దొరుకుతున్నాయని సర్వేలో తేలింది. వృద్ధులు ఇంటర్నెట్ ద్వారా ఈ బుక్స్ చదువుకోవడం చాలా ఈజీ అంటున్నారు book2look వ్యవస్థాపకుడు Möller.

వివిధ పుస్తకాల సేల్స్ పెంచేందుకు మిగతా వెబ్‌సైట్లతో కలిసి వ్యాపార ప్రకటనలు ఇవ్వాలని, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించామంటున్నారు Möller. ఈ 'బుక్2లుక్' తో పాటు వివిధ పుస్తకాల సమగ్ర సమాచారాన్ని అందిస్తోంది మరో వెబ్‌సైట్ flipintu.com. దీనికి వ్యవస్థాపకుడు Möller. అయితే పబ్లిషర్లు తమ బుక్స్‌కి సంబంధించి టాగ్స్ సరిగా ఇవ్వలేకపోతున్నారని.... మంచి ట్యాగ్స్ ఇస్తే రీడర్స్ సంఖ్య బాగా పెరుగుతుందంటున్నారు Möller. ఈ లోపాన్ని సవరించేందుకు flipintu.com దోహదపడుతుందంటున్నారు Möller. ఈ flipintu.comద్వారా మంచి మంచి ట్యాగ్స్ పెట్టి కస్టమర్లను ఆకట్టుకోవచ్చంటున్నారు.

image


చిన్న పబ్లిషర్లు టెక్నాలజీని తమకు అనుకూలంగా వాడుకునే విషయంలో చాలా నిర్లిప్తతతో ఉన్నారని, వారికి అవగాహన కల్పించి book2look..com ద్వారా వారి లాభాలను పెంచుతామంటున్నారు Möller . పుస్తకానికి మించిన మిత్రుడు లేడు, చీకటిని పారద్రోలే శక్తి పుస్తకానికి ఉందంటారు Möller. అలాంటి మంచి మంచి పుస్తకాలను తమ వెబ్‌సైట్ ద్వారా అందరికీ పరిచయం చేస్తామని. ట్యాగ్ టైప్ చేయగానే ఆయా ఈ బుక్స్ సమాచారం చిటికెలో అందుబాటులోకి తెస్తామంటున్నారు.