రాజకీయ పార్టీలకు ఓటర్ల నాడి చెప్పేసే హైదరాబాదీ సంస్థ 'సిప్పర్'

0

రాజకీయ పార్టీలకూ టెక్నాలజీ అవసరమే.

పార్టీలకు పర్సనలైజ్డ్ ఐవీఆర్ సేవలు.

అభ్యర్ధులతో ఓటర్లను అనుసంధానం చేస్తున్న సిప్పర్ గ్లోబల్ .


టెక్నాలజీ... ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ లోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత ఐదారేళ్లుగా సాంకేతిక రంగాన్ని రాజకీయ నాయకులు బాగానే వాడుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఐవీఆర్ (క్లౌడ్ టెలిఫోనీ), సోషల్ నెట్వర్క్, ఈమెయిల్ మార్కెటింగ్‌లను అనేక పార్టీలకు చెందిన నేతలు ఉపయోగించుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటి ప్రచారంపైనే తమ పార్టీకి పునాదులు వేసుకుంది. ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ గెలుపును.. ఆ పార్టీ నేతలే కాకుండా... కొన్ని స్టార్టప్ కంపెనీలు కూడా సెలబ్రేట్ చేసుకున్నాయి. ఆప్ తర్వాత నరేంద్ర మోడీ కూడా.. సోషల్ నెట్వర్క్‌ని బాగా ఉపయోగించుకున్న నేత. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న 'మై ఆపరేటర్'.. ఆప్‌కి అనుకూలంగా 5లక్షల కాల్స్ తమకు వచ్చాయని తెలిపింది. అలాగే ఇన్వైట్ రిఫరల్ అనే సంస్థ... ఆప్ కోసం రిఫరెల్ ప్రోగ్రాం కూడా నిర్వహించింది.

ఈ రెండు కంపెనీలే కాకుండా... హైద్రాబాద్ సంస్థ సిప్పర్ గ్లోబల్ ఇన్ఫర్మాటిక్స్ కూడా పొలిటికల్ వ్యవహారాలను ఔట్ సోర్సింగ్ ద్వారా నిర్వహించే కంపెనీయే. ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు.. అభ్యర్ధులు-ఓటర్లను కలిపేందుకు పర్సనలైజ్డ్ ఐవీఆర్, ఔట్ బౌండ్ కాలింగ్ ప్లాట్‌ఫాంలను అందించింది.

పాలిటిక్స్‌తో టెక్నాలజీ లింక్ ఆలోచన ఎలా ?

రాజకీయాలపై డిబేట్‌లకు మన దేశంలో జనాలు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అభిజిత్ షా, అతని కజిన్ నితిన్ టంక్సలే కూడా తాజా రాజకీయ పరిస్థితులపై ఎప్పుడూ వాదులాడుకుంటూ ఉంటారు. “ ఓ రాజకీయ నేత.. తమ ప్రాంతంలో సేవలు చేయడం ద్వారా ఎలా పాపులర్ అవుతున్నారు, పేరు తెచ్చుకుంటున్నారు అనే అంశంపై మాటమాట వచ్చింది. అదే సమయంలో కొంతమంది నేతలు ఇంకా మంచి పనులు చేసినా.. వారికి తగిన గుర్తింపు రాకపోవడం ఆశ్చర్యం వేసింది. ఇలా అతను చేసే పనులు జనాలకు తెలీకపోవడం కూడా కారణమే అని అర్ధమైంది. అప్పుడే నేతలు-ఓటర్ల మధ్య గ్యాప్ తగ్గించడానికి సాంకేతికతను ఉపయోగించుకోవాలనే ఆలోచన వచ్చింది. ఈ రంగంలో వెంచర్ ప్రారంభిస్తే.. డిమాండ్ తప్పకుండా ఉంటుందని గ్రహించి... సిప్పర్ గ్లోబల్ ఇన్ఫర్మాటిక్స్‌ను ప్రారంభించా ”నంటారు అభిజిత్.

అభిజిత్ షా, నితిన్ టంక్సలే- సిప్పర్ గ్లోబల్
అభిజిత్ షా, నితిన్ టంక్సలే- సిప్పర్ గ్లోబల్

సిప్పర్ టీం

ఈ వెంచర్‌ని ప్రారంభించే ముందు... జర్మన్ షిప్పింగ్ జెయింట్ హపగ్ లాయిడ్, ఒమన్‌లోని ఏఐ డస్టూర్ గ్రూప్‌లలో పని చేశారు అభిజిత్. నితిన్‌కు మార్కెటింగ్, బ్రాండ్ యాక్టివిటీలలో 15 ఏళ్ల అనుభవం ఉంది. ఈయన రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్‌, చికాగో కేంద్రంగా పని చేస్తున్న కమ్యూనికేషన్ సంస్థ లియో బర్నెట్‌లలో పనిచేశారు. అలాగే కోకకోలా, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌లలో అకౌంట్స్ విభాగంలోనూ విధులు నిర్వహించారు.

రాజకీయ నాయకులను, తమ లక్ష్యమైన ఓటర్లను కలిపేందుకు అవసరమైన సాంకేతిక సేవలు (పర్సనలైజ్డ్ ఐవీఆర్, ఔట్ బౌండ్ కాలింగ్ ప్లాట్‌ఫాం) అందించడంలో.. దేశంలో తొలి కంపెనీ సిప్పర్ గ్లోబల్ ఇన్ఫర్మాటిక్స్ అంటారు అభిజిత్ షా, నితిన్. ఓటర్లకు కాల్స్ చేసేందుకు, వారు చేసే కాల్స్‌కు రెస్పాన్స్ ఇచ్చేందుకు, డేటాబేస్ నిర్వహణకు తగిన టెక్నాలజీని అందిస్తుంది సిప్పర్.

మార్కెట్‌లో పోటీ, అవకాశాలు

2013 లో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటితోనే సిప్పర్ తన కార్యకలాపాలు ప్రారంభించింది.మొదట ఐదుగురు రాజకీయ నేతల (ఛత్తీస్‌ఘడ్‌లో ముగ్గురు, మధ్యప్రదేశ్‌లో ఒకరు, రాజస్థాన్‌లో ఒకరు)కు కస్టమైజ్డ్ కమ్యూనికేషన్ కేంపెయిన్‌లు నిర్వహించింది సిప్పర్.

2014 పార్లమెంట్ ఎన్నికల్లో సిప్పర్ సేవలను నేతలు బాగానే ఉపయోగించుకున్నారు. ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతో పాటు... ఏపీ, తెలంగాణల్లోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులు సిప్పర్ ఇచ్చే ఐవీఆర్ సర్వీసులు ఉపయోగించుకున్నారు. దాదాపు 50 పార్లమెంటరీ అభ్యర్ధులకు సేవలు అందించామని తెలిపారు నితిన్. ప్రస్తుతం ఈ కంపెనీలో 15మంది ఇంజినీర్లు, 20మంది టెక్నాలజీ స్టాఫ్ ఉన్నారు.

“ధరల నిర్ణయం, ఛార్జీల వసూళ్ల విషయంలో మేం చాలా జాగ్రత్తగా వ్యవహరించాం. ఆయా నేతలకు అవసరమైన విధంగా సేవలు ఇవ్వడమే కాదు... ఇచ్చిన సేవలకు తగిన విధంగానే ఛార్జ్ చేశాం. ఆయా లీడర్లు పోటీ చేసిన నియోజకవర్గాన్ని కూడా ఇందుకోసం పరిగణలోకి తీసుకున్నాం. ముఖ్యంగా ఆ నియోజకవర్గ సైజ్.. ధర నిర్ణయంలో ప్రధాన పోషిస్తుంది”అని చెప్పారు అభిజిత్.

తమకు మై ఆపరేటర్, నోలారిటీ సహా.. ఇతర క్లౌడ్ టెలిఫోనీ కంపెనీలతో పోటీ లేదంటారు అభిజిత్. కారణం ఈ మార్కెట్ ఇంకా ప్రారంభ స్థాయిలో ఉండడమే. అభివృద్ధికి ఇంకా చాలా అవకాశం ఉండడంతో.. అప్పుడే పోటీ మాట అనవసరం అంటారాయన. “ఆయా నియోజకవర్గాల ప్రొఫైల్, సైజ్ ఆధారంగా ప్రతీ అభ్యర్ధికి కస్టమైజ్డ్ సేవలందించడం చాలా ముఖ్యం. అప్పుడే ఈ మార్కెట్లో నిలబడగలం” అన్నారు అభిజిత్.

All about me, family & freinds

Related Stories