గ్రామాలయ మైక్రోఫైనాన్స్... లేడీస్ స్పెషల్

మహిళల కోసం మహిళలు..స్త్రీ సాధికారత కోసం ఓ స్టార్టప్గీతా జగన్ ఆధ్వర్యంలో గ్రేట్ (GREAT) గ్రామాలయ ఆంట్రప్రెన్యూర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ తమిళనాడులో పేదమహిళల అభ్యున్నతి కోసం మైక్రోక్రెడిట్ సేవలురెండేళ్లలో 2258మందికి సాయంమిలాప్ సైట్ ద్వారా ఆంట్రప్రెన్యూర్లకు ఫండింగ్

గ్రామాలయ మైక్రోఫైనాన్స్... లేడీస్ స్పెషల్

Monday July 06, 2015,

3 min Read

మహిళలకు ఆర్ధికంగా సాయం చేస్తే..అది గ్రామాలనుంచి పేదరికం పారదోలడానికి సాయపడుతుంది..ఇదీ గ్రామాలయ స్లోగన్ " ఇండియాలో మగవారు తమ సంపాదనలో ఎక్కువశాతం తమ వ్యక్తిగత అవసరాలకే దుబారా చేస్తుంటారు. సిగరెట్, మందు, పేకాటకు ఖర్చు పెట్టడంలోనే వారి జీతం ఖర్చైపోతుంది. అదే మహిళల సంగతి విషయానికి వస్తే వారి సంపాదన అంతా కుటుంబపోషణ, ఆస్పత్రి ఖర్చులు, స్కూల్ ఫీజులకు వాడుతుంటారు" అని ప్రపంచ బ్యాంక్ తన సర్వే ద్వారా ప్రకటించింది.

image


తమిళనాడులోని గ్రామాలయ మైక్రో ఫిన్ ఫౌండేషన్ (GMF) అనే స్వచ్ఛంధ సంస్థ మహిళల సాధికారికతకు దోహదం చేస్తేనే అది వారి జీవితాలను బాగు చేస్తుందని నమ్మింది. 2011లో తమ బిజినెస్ చేస్తున్న రూపాన్ని మార్చుకుని మార్చుకుంది. మిగిలిన సంస్థలకన్నా భిన్నంగా మహిళలకు రుణాల మంజూరు చేయడం ప్రారంభించింది. మిలాప్ అనే వెబ్‌సైట్‌ ద్వారా ద్వారా నిధుల సేకరణ చేసి మహిళలకు అందిస్తుంది జీఎంఎఫ్.

తమ విభిన్న ఆలోచన ద్వారా సాయం పొందాలంటే..ముందుగా ఇందులో చేరే స్త్రీలు జీఎంఎఫ్ సంస్థ ఇచ్చే ట్రైనింగ్‌లో పాల్గొనాలి. జిఎంఎఫ్ గ్రామాలయ ఆంట్రప్రెన్యూర్స్ అసోసియేట్స్ ప్రోగ్రామ్ (GREAT) పేరుతో ఏర్పాటయ్యే ఆ కార్యక్రమంలో మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు ఎలా చేయాలనే అంశాలపై మెళకువలు నేర్పుతారు. దీనికి మిలాప్ ఆర్ధికంగా తోడ్పాటు అందిస్తుంది. బిజినెస్‌లో స్కిల్స్ ట్రైనింగ్, టెక్నికల్ సపోర్ట్, ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో వారికి ఇండస్ట్రీలోని నిపుణుల చేత లెక్చర్లు ఇవ్వడం నేర్పిస్తారు. ఈ ప్రోగ్రాములన్నీ పూర్తైన తర్వాత మాత్రమే మహిళలకు రుణాలు ఇస్తారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌లో సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయం, అరటి, గోధుమలతో తయారు చేసే ఆహార పదార్ధాలు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ మాత్రమే కాకుండా..వారికి ఆసక్తి ఉన్న వాటిల్లో శిక్షణ ఉంటుంది. ఇది పూర్తయ్యాక వీరంతా గ్రూపులుగా ఏర్పడి వారికి అనువైన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కొంతమంది అప్పటికే తమకేవైనా వ్యాపారాలుంటే వాటిని అభివృధ్ది చేసుకుంటారు.

జీఎంఎఫ్ సీఈఓ గీతా జగన్ యువర్ స్టోరీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారి కుటంబానికి సాయపడే స్థాయికి ఎదిగేలా చేయడమే తన కల అని చెప్పారు. 

"చాలామందికి స్త్రీలకు బ్యాంకుల్లో రుణాలు పొందే తెలియదు. అసలు లోన్లు ఎలా ఇస్తారో కూడా అవగాహన ఉండదు. ఆత్మవిశ్వాసం లోపించడం కూడా దీనికి ఓ కారణం. మహిళలకు తమకు డబ్బు కావాలంటే భర్తపైనో...తండ్రిపైనో ఆధారపడుతున్నారు తప్ప, వారికంటూ ఏమీ చేసుకోలేకపోతున్నారు. మహిళలకు అత్యంత పెద్ద సమస్య ఏదైనా ఉందీ అంటే అది డబ్బే. దానికోసం ఎవరో ఒకరిపై ఆధారపడాల్సి వస్తుంది. జీఎంఎఫ్‌లో ముందు స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాం. సొంతంగా డబ్బు సంపాదించేలా చేస్తాం. మహిళల్లో చాలా శక్తి ఉంది, అది చాలాసార్లు బైటికి రాదు. వారికి మనం కాస్త మద్దతు ఇస్తే అది వారి కుటుంబాలకే కాదు.. దేశం అభివృధ్దికే మద్దతు ఇచ్చినట్లు..మహిళలకు మద్దతు ఇవ్వడమంటే..మొత్తం కుటుంబానికీ సాయం చేసినట్లే.. ఆడా,మగా అనే తేడా లేకుండా పని చేయడం ఆత్మవిశ్వాసంతోనే సాధ్యమవుతోంది.." తన లక్ష్యం గురించి చెప్పారు గీతాజగన్..

గీతాజగన్-గ్రామాలయ సీఈఓ

గీతాజగన్-గ్రామాలయ సీఈఓ


ప్రారంభంలో పది వేల నుంచి పన్నెండువేల రూపాయలు వరకూ జిఎంఎఫ్ లోన్లు మంజూరు చేస్తుంది. ఇది చెల్లించడానికి సంవత్సరం నుంచి సంవత్సరన్నర వరకూ గడువు ఇస్తుంది. మొదట ఇచ్చే పెట్టుబడి బ్యాంకులు, ఫైనాన్స్, ప్రైవేట్ సంస్థల ద్వారా మంజూరు చేయిస్తుంది జీఎంఎఫ్. 2013 జనవరి నుంచి జీఎంఎఫ్ ఇప్పటిదాకా 4557మంది మహిళలకు దాదాపు 3.29 కోట్ల రూపాయల లోన్లు ఇవ్వగలిగింది.

image


కత్తుపుత్తూర్ గ్రామంలో నివసించే 39 ఏళ్ల రేవతి ముత్తుస్వామి జీఎంఎఫ్ లబ్దిదారుల్లో ఒకరు. మిలాప్ వెబ్ సైట్ ద్వారా ఆమెకి కావాల్సిన నిధులు సేకరించింది జిఎంఎఫ్.అంతకు ముందు రేవతి టైలర్‌గా పని చేసేది. ఐతే ఆ వృత్తిలో ఆమెకు పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. నికరమైన ఆదాయం కోసం ఆమె మార్గం వెతుకుతుండగా జీఎంఎఫ్ ప్రతినిధులు సంప్రదించారు."జీఎంఎఫ్ గురించి తెలిసిన తర్వాత వారి ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాను. ఆ తర్వాత ఐదుగురు సభ్యుల బృందంతో అరటి ఉత్పత్తులు, మిల్లెట్స్(తృణధాన్యాలు) అమ్మకం ప్రారంభించాం.."

" సొంతంగా సంపాదిస్తున్నా అనే ఫీలింగే చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. సంతృప్తి కలిగించే పని చేద్దామనుకున్నాం..చేశాం.. ఇప్పుడు ఈ వ్యాపారం ఇంకా పెరగాలి. మా ఐదుగురిని మా భర్తలు ఎంతో ప్రోత్సహించారు కాబట్టే ఇప్పుడీ స్థితిలో ఉన్నాం" అంటూ తమ వ్యాపారం నేపధ్యం గురించి చెప్పుకొచ్చింది రేవతి.

రేవతి ముత్తుస్వామి-జీఎంఎఫ్ లబ్దిదారు

రేవతి ముత్తుస్వామి-జీఎంఎఫ్ లబ్దిదారు


మహిళలకు మీరిచ్చే సలహా గానీ..సూచన గానీ ఏమైనా ఉందా అంటే.." ఏదైనా చేయాలనే తపనే ఉంటే సరిపోదు. అది సాధించగలమనే ఆత్మవిశ్వాసం ఉండాలి. కుటుంబం ప్రోత్సాహం కూడా ముఖ్యమే. మన ఇళ్లల్లో భర్తో..అత్తమామలో..ఆడపడుచులో..ఆడాళ్లు ఇంట్లోనే ఉండాలంటారు. వాటన్నింటినీ ఎదుర్కొనగలగాలి. అలా కాకుండా..వారే ప్రోత్సహించాలి.ఇంకా సాధించగలవనే ఉత్సాహం పెంచాలి." చాలా మంది గృహిణులకు చదువు ఉండదు. అదేవారిని ఏమీ చేయనీయకుండా అడ్డుకుంటుంది. చదువు లేనంత మాత్రాన ఏమీ సాధించలేం అనుకోవద్దు. ఇంటికి మాత్రమే పరిమితమవకుండా బయట మన కోసం ఎదురు చూస్తున్న అద్భుత అవకాశాలు అందిపుచ్చుకోవాలి.." అని రేవతి సుదీర్ఘంగా చెప్పారు.

సియాగరమ్ పికిల్ యూనిట్

సియాగరమ్ పికిల్ యూనిట్


యువర్ స్టోరీ కూడా మిలాప్ వెబ్ సైట్ (milaap.org) తో చేతులు కలిపి..విమెన్ హెల్పింగ్ విమెన్ అనే వారి క్యాంపెయిన్‌కి మద్దతుగా అనేక స్టోరీలు ప్రచురించింది. వాటిలోఇది కూడా ఒకటి.