మీ డ్రస్సే.. మీ వ్యక్తిత్వానికి కేరాఫ్ అడ్రస్..

0

టాలెంట్ ఉంది. ప్రాజెక్టు గురించి అనర్ఘళంగా మాట్లాడుతాం. ప్రాడక్టు గురించి అదిరిపోయే స్పీచ్ ఇస్తాం. వర్క్ ప్లేస్ లో జోకులు పేలుస్తాం. మీటింగ్ లో సెన్సాఫ్ హ్యూమర్ ప్రదర్శిస్తాం. అయితే, కార్పొరేట్ ఉద్యోగాల్లో కేవలం అవి మాత్రమే చాలదు. మాటలతో పాటు వేసుకునే బట్టలు కూడా ఆకట్టుకోవాలి. ముఖ్యంగా మహిళల డ్రస్సింగ్.. ఆఫీస్ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేయాలి. ఫ్రెష్ లుక్ తీసుకురావాలి. స్టయిల్ ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలి. అంతేకానీ ఇంకా అవే పాతకాలం బట్టలు వేసుకుని రావడం వల్ల మనమీద ఇంప్రెషన్ సహోద్యోగుల్లో రానురాను తగ్గిపోతుంది.  

మనం వేసుకునే డ్రస్ మనల్ని ప్రజెంట్ చేస్తుంది. అదొక్కటే కాదు. బిహేవియర్‌, బాడీలాంగ్వేజ్‌ అన్నీ అవతలివారికి ఇట్టే అర్ధమైపోతాయి. కాన్ఫిడెన్స్ లెవల్ పెరుగుతుంది. ఆటోమేటిగ్గా అప్రోచ్‌ పెరుగుతుంది. చాలారకాల స్టడీల్లో తేలిన విషయం ఇదే. ఒక మంచి ఫార్మల్ వేసుకున్న ఉద్యోగి సెల్ఫ్‌ పర్సెప్షన్ ఆఫీస్ మొత్తం అట్రాక్ట్ చేస్తుంది. ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎదుటివారికి వాళ్లిచ్చే ఆదేశాలు, మాటలు నచ్చుతాయి.

అలాంటి గుర్తింపు రావాలంటే, మన వ్యక్తిత్వాన్ని నలుగురి ముందు ఆవిష్కరించాలంటే డీసెంట్ లుక్ ఎంతో ముఖ్యం. మెయిన్ గా కార్పొరేట్ ఉద్యోగాలు చేసే మహిళలు ఫార్మల్ దుస్తుల్లో వస్తుంటారు. వాటి ఎంపిక అంత కష్టమేమి కాదు. అయితే ఈ కార్పొరేట్ డ్రెసింగ్ సెన్స్ పై అవగాహన పెంచుకోవాలి. ఈ తరహా దుస్తులతో మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకునే వీలుంది. అటు ఫ్యాషనబుల్ గానూ, ఇటు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా డ్రెస్సింగ్ సెన్స్ ఉపయోగపడుతుంది.

1. ముందుగా మీరు పనిచేసే ఆఫీసు వాతావారణాన్ని గమనించండి..

ఆఫీసులో వేసే డ్రెస్, కనిపించే లుక్ ఇంపార్టెంట్. మనం పనిచేసే ఎన్విరాన్మెంట్.. మన చుట్టూ పనిచేసే వారంతా వివిధ హోదాల్లో ఉన్నవారు.. ఎలాంటి డ్రెస్ సెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారో గమనించాలి. ఆఫీసులో మన కలీగ్స్ ఎక్కువగా ఫుల్ సూట్స్, బ్లేజర్స్, ఫార్మల్ ప్యాంట్స్ వాడుతున్నట్లయితే, మనం కూడా సూట్ నే ప్రిఫర్ చేయాలి. మన దేశంలో లీగల్ సిస్టమ్ లో పనిచేసే లాయర్స్, బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసే మహిళలు ఎక్కువగా సాంప్రదాయ బట్టలనే వేసుకునేందుకే ఇష్టపడతారు. ఇక ఇతర రంగాల్లో పనిచేసే మహిళలు వారి వీలును బట్టి డ్రెస్ వేస్తారు.  

2. మీకు సూట్ అయ్యే స్టైల్ నే అనుసరించండి.. ఇతరులను అనుకరించకండి..

కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగులంతా ఒకే రకమైన డ్రెసింగ్ నే అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇదొక రకమైన గందరగోళ సిట్యువేషన్. దానివల్ల ఏమవుతుందంటే.. మీ ఓన్ ఫ్యాషన్ మరుగున పడిపోతుంది. అలాంటి పరిస్థితిని ఒక చిన్న ప్రయత్నంతో మార్చేయొచ్చు. ఒకరిని కాపీ కొట్టకుండా మీ డ్రెసింగ్ సెన్స్ తో కొత్త పరిచయాన్ని పంచవచ్చు. 

3. మీ వస్త్రధారణలో వ్యక్తిత్వం కనిపిస్తే పట్టుదల మీ వెంటే నడిచొస్తుంది.

డ్రెస్సింగ్ లో ప్రధానమైనది కంఫర్ట్.. అనుకూలంగా లేనిదే ఏ పనీ చేయలేం. ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచంలో చేసే పనుల్లో చాలా ఒత్తిళ్లను తట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే మన డ్రెసింగ్ మనకు అనుకూలంగా, కంఫర్ట్ ఉండటమే ప్రధానం. మీరు వేసుకున్న డ్రెస్సింగ్ అనుకూలంగా లేనట్లయితే ఆ ప్రభావం చేసే పని మీద కూడా పడుతుంది. అందుకే అటు ఫ్యాషనబుల్ గానూ, కంఫర్ట్ గానూ ఉండే డ్రెస్ ను ఎంపిక చేసుకుంటే బెటర్.

4. అదిరేటి డ్రెస్సంటే మీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడమే..

బ్లాక్, వైట్, నేవీ, గ్రే ఇలాంటి కలర్స్ తో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ని ఇట్టే ఆకర్షించవచ్చు. అలాంటి డ్రెసింగ్ వల్ల ఆ రోజు హాపీగా మొదలవుతుంది. కంఫర్ట్ లేని డ్రెస్సింగ్ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. బ్లాక్ ప్యాంట్, బ్లాక్ బ్లేజర్, ఆక్స్ ఫర్డ్ వైట్ షర్ట్ ధరించి మీ రోజును ధగధగలాడించవచ్చు.. కానీ అవేవీ మీ వ్యక్తిత్వానికి చిరునామాగా మారలేవు. కానీ ఆయా దుస్తుల్లో మీరు కంఫర్ట్ గా ఫీలయితే మాత్రం ఆ రోజు మీదే అవుతుంది. గొప్ప ఆశయంవైపు నడవడటం ద్వారా మన కలల్ని సాకారం చేసుకోవచ్చు. అందుకే మీ డ్రెస్సెంగ్ నే మీ చిరునామాగా మార్చుకోండి.