మొత్తానికి పేటీఎం గల్లాపెట్టె నిండిందబ్బా..!!

ఒక్కరోజులోనే రూ.120 కోట్ల టర్నోవర్..!

మొత్తానికి పేటీఎం గల్లాపెట్టె నిండిందబ్బా..!!

Tuesday November 22, 2016,

1 min Read

పెద్ద పాత నోట్ల రద్దుతో పేటీఎం కళకళలాడుతోంది. ఒక్కరోజులోనే ఊహించనంత రీతిలో టర్నోవర్ జరిగింది. వంద నోట్లు దొరక్క నానా అవస్థలు పడుతున్న జనం ప్రత్యామన్నం బాట పట్టి పేటీఎం మీదకి దృష్టి సారించారు. క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ జరుపుతూ పేటీఎం పంట పండించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించిన తర్వాత ఒక్కరోజులోనే రూ.120 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించింది.

గత పది రోజుల్లో దాదాపు 45 మిలియన్ల మందికి సేవలందించామని పేటీఎం తెలిపింది. ఇందులో దాదాపు 5 మిలియన్ల వినియోగదారులు కొత్తగా చేరిన వారేనని ఆ సంస్థ పేర్కొంది. గత కొన్ని రోజులుగా ప్రజల్లో పేటీఎం పట్ల ఆదరణ పెరిగిందనడానికి ఈ లావాదేవీలే నిదర్శనం. దేశంలోని అనేక ప్రాంతాల్లో వినియోగదారులు పేటీఎం ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిపారు.

image


గతంతో పోల్చి చూసుకుంటే టర్నోవర్ 65 శాతానికి పైగా చేరుకుంది . టాక్సీ మొదలుకొని రెస్టారెంట్లు, దుకాణాలు, సినిమాహాళ్లు, పార్కులు, చివరికి పచారీ సరుకులకు కూడా జనం పేటీఎంనే వాడారు. అటు వినియోగదారులు ఇటు వర్తకులు తమ సేవలను వినియోగించుకునేలా నిరంతరం శ్రమిస్తున్నామని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు సుధాంశు గుప్తా చెప్పారు.