హౌస్ హోల్డ్ సర్వీసులన్నీ ఒకే గొడుగుకిందకి తెచ్చిన నిట్ మాజీ స్టూడెంట్స్

హౌస్ హోల్డ్ సర్వీసులన్నీ ఒకే గొడుగుకిందకి తెచ్చిన నిట్ మాజీ స్టూడెంట్స్

Saturday April 02, 2016,

3 min Read


హైదరాబాద్ లో రీచార్జ్ కార్డు దొరుకుతుంది కానీ, మనకు కావల్సినప్పుడు ఎలక్ట్రీషియన్ మాత్రం దొరకడు. ప్యాక్ అండ్ మూవర్స్ నంబర్ కావాలంటే ఠక్కున తెలుస్తుంది కానీ, పెస్ట్ కంట్రోల్ నంబర్ కావాలంటే మాత్రం కాసేపు తడుముకోవాల్సిందే. అద్దెకు ఇల్లు కావాలంటే క్లాసిఫైడ్స్ అందుబాటులో ఉంటాయి. బట్, ఇంటికి పెయింటింగ్ చేయించాలనుకుంటే పెయింటర్ అడ్రస్ అంత వీజీ కాదు. సగటు నగరజీవికి ఎన్ని సౌకర్యాలున్నాయో, అంతకుక మించి అయోమయాలు కూడా ఉన్నాయి. చిన్నా చితకా పనుల కోసం కూడా పరుగులు తీయాల్సిందే. ఎవరికి ఫోన్ చేసినా సరైన సమాచారం ఉండదు. ఈ గజిబిజి ఫజిల్ కు నిట్ మాజీ విద్యార్థులు సొల్యూషన్ కనుగొన్నారు. దాని పేరు UrbServ.in

image


అర్బ్ సర్వ్ అందించే సర్వీసులు

సాధారణ అపార్టుమెంటుతో పాటు ఇతర ఇళ్లకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ అందిస్తున్నారు.

1. 50మంది స్కిల్డ్ ప్రొఫెషనల్స్ చేతికింద ఉన్నారు. ప్రస్తుతానికి హైదరాబాదులో సేవలు అందిస్తున్నారు.

2. పెస్ట్ కంట్రోల్ దగ్గర్నుంచి పెయింటింగ్ దాకా దాదాపు 20 రకాల సర్వీసులిస్తున్నారు.

3. ప్రొఫెషనల్స్ డేటాని పూర్తిస్థాయిలో వెరిఫై చేయడం ద్వారా సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకుంటారు.

4. ప్రొఫెషినల్స్ తో అగ్రిమెంట్స్ చేసుకోవడం ద్వారా పూర్తిగా నమ్మకమైన సర్వీసు .

5. మినిమం చార్జీలు వసూలు చేయరు. చేసిన పనికి మాత్రమే చార్జ్ తీసుకుంటారు.

6. ఇతర యుటిలిటీ సర్వీసులకంటే తక్కువ మొత్తం తీసుకోవడం వీరి ప్రత్యేకత

7. ఎలైట్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ దాకా ఎవరికైనా సర్వీసుల విషయంలో ఒకే ధర. 

అర్బ్ సర్వ్ పనితీరు

గతేడాది అక్టోబర్ లో బీటా వెర్షన్ ప్రారంభించిన ఈ స్టార్టప్ ఇప్పటి వరకూ 5వేల మంది రిజిస్ట్రర్ యూజర్లను సంపాదించుకుంది.

“రోజుకి 40మందికి సర్వీసు అందిస్తున్నాం,” జావెద్ ఫైసల్

ప్రారంభించిన రోజునుంచి కస్టమర్లు ఉన్నారని అర్బ్ సర్వ్ సీఈవో జావెద్ అంటున్నారు. రిపీడెట్ కస్టమర్లు ఉండటం తమ పనితీరుకు అద్దం పడుతుందని అతను అభిప్రాయపడ్డారు.

image


యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. తద్వారా కొత్త కస్టమర్లను తీసుకురాగలుగుతున్నామని మరో కో ఫౌండర్ కార్తీక్ అంటున్నారు. ధరలర విషయంలో మిగిలినవారికంటే తక్కువకే సర్వీసులను అందిస్తున్నాం కనక ఈ రంగంలో తమకు ఎదురులేదని చెప్పుకొచ్చారాయన.

“బీటుబీతో పాటు బీటుసీలో మా స్టార్టప్ పనిచేస్తోంది” -అభిమన్య పర్వతం

సంస్థకు మరో కో ఫౌండర్ అభిమన్య. ప్రొఫెషనల్స్ సాయం చేయడంతో పాటు వ్యాపారులకు సర్వీసులు అందించడం ద్వారా బిటుబి లో కూడా పనిచేస్తున్నామని అతను అంటున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, ఇందిరానగర్ , కుకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి సేవలు అందిస్తున్నారు.

టెలి బుకింగ్స్ ప్రధానం

హైదరాబాద్ లో యాప్స్ కంటే టెలిఫోన్ ద్వారా బుకింగ్ పైనే జనం ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారని జావెద్ అంటన్నారు. రోజులో వచ్చే 40 బుకింగ్స్ లో 30 నుంచి 35 బుకింగ్స్ కాల్స్ ద్వారానే వస్తున్నాయని అంటున్నారు.

“ఆన్ లైన్ కంటే మాకు ఆఫ్ లైన్ కస్టమర్లే ఎక్కువ,” కార్తీక్

తమ దగ్గర రిజిస్ట్రర్ అయిన కస్టమర్లలో ఆన్ లైన్ కంటే ఆఫ్ లైన్ కస్టమర్లే ఎక్కువగా ఉండటం విశేషం అంటన్నారు కార్తీక్. పూర్తి స్థాయి ఆన్ లైన్ వినియోగం ఈ రంగంలోకి ఇంకా రాలేదనేది అర్బ్ సర్వ్ అనుభవంలో తేలిన విషయం.

image


అర్బ్ సర్వ్ టీం

టీం విషయానికొస్తే జావెద్ ఫైజల్ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2013లో నిట్ వరంగల్ నుంచి సీఎస్సీలో బీటెక్ పూర్తి చేశారు. కార్తీక్, అభిమన్యు కూడా నిట్ వరంగల్ నుంచి ఈసీఈ, ట్రిపుల్ఈ పూర్తి చేశారు. వీళ్లిద్దరూ 2014లో అర్బ్ సర్వ్ లో చేరారు. వీరితో పాటు మానస మరో కో ఫౌండర్ గా చేరారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె ఈ స్టార్టప్ కు టెక్ సపోర్ట్ అందిస్తున్నారు.

సవాళ్లు, లక్ష్యాలు

కస్టమర్లలో విశ్వాసాన్ని పాదుకొల్పడం, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ని మెంటేయిన్ చేయడం పెద్ద సవాలంటున్నారు. పూర్తి బూట్ స్ట్రాపుడ్ స్టార్టప్ అయిన అర్బ్ సర్వ్.. ఫండింగ్ కోసం ఎదురు చూస్తోంది. సెల్ఫ్ సస్టేయినబుల్ మోడల్లో నడుస్తోన్న తమ స్టార్టప్ మంచి ట్రాన్సాక్షన్ సాధించిందని, దాన్ని మరింత పెంచుకుంటామనే ధీమా వ్యక్తం చేశారు ఫైజల్.

image


పోటీదారులు, ఫ్యూచర్ ప్లాన్స్

హౌస్ జోయ్ అనే ఓ పెద్ద ప్లేయర్ ఈ రంగంలో పోటీదారుగా ఉంది. అయితే అది మిలియన్ డాలర్ల కంపెనీ. ఎస్ బ్రిక్స్, ఆస్క్ హెల్ప్ డాట్ ఇన్ లాంటి స్థానిక స్టార్టప్ ల నుంచి కూడా గట్టి పోటీయే ఉంది. వీళ్లకంటే సర్వీసు విషయంలో పెద్దగా తేడా చూపలేకపోయినా, ధరల విషయంలో చాలెంజింగ్ ప్రైస్ ఇవ్వడంతో సక్సెస్ సాధిస్తామని అభిమన్య అంటున్నారు.

ఈ ఏడాది చివరికల్లా చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలకు విస్తరించాలని చూస్తున్నారు. మంచి నంబర్లు ఉండటం అది ఈజీ అంటున్నారు. ఫండింగ్ వస్తే మరిన్ని సేవలను అందించడంతో పాటు మార్కెటింగ్ కోసం వినియోగిస్తామని ముగించారు ఫైజల్.

website