పుస్తకాలతో పాటు సమాజాన్ని ఎలా చదవాలో నేర్పించే అప్నీశాల

This story is a part of Portraits of Purpose series sponsored by DBS Bank. ‘ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తిమంతమైన ఆయుధం విద్యేనని ’ నెల్సన్ మండేలా అంటారు. అయితే, విద్య అంటే, అకడమిక్ శిక్షణ మాత్రమేనా ? మరి పిల్లలు జీవన నైపుణ్యాల్ని , ప్రయోగపూర్వకమైన విద్యను ఎక్కడ నేర్చుకుంటారు ? సమాజంలో మార్పు తేవాలంటే, ఈ రకమైన విద్య కూడా చాలా అవసరం. కానీ మన పాఠశాలల్లో నైపుణ్యాలకి సంబంధించిన విద్య మీద పెద్దగా శ్రద్ధ చూపించడం లేదు. వెనుకబడిన ప్రాంతాల్లో ఈ కొరత ఇంకా ఎక్కువే వుంది. పుస్తకాల చదువుకి, జీవన నైపుణ్యాలకి మధ్య వున్న ఈ అగాధాన్ని పూడ్చడానికి ముగ్గురు యువతులు చేస్తున్న ప్రయత్నమే అప్నీశాల.

0

అల్పాదాయ వర్గాల పిల్లల్లో భావోద్వేగపరమైన, ఆలోచనపరమైన నైపుణ్యాన్ని, ఒకరితో ఒకరు మెలగడంలో చూపించాల్సిన చొరవను పెంచేందుకు ఈ అప్నీశాల కృషి చేస్తోంది.

‘స్కూళ్లలో లెక్కలు, సైన్స్, హిస్టరీ, లాంటి సబ్జెక్టుల మీద చూపించే శ్రద్ధ, లైఫ్ స్కిల్స్ ట్ర్రైనింగ్ మీద చూపించరు. ఈ రోజుల్లో పిల్లలకి సబ్జెక్టులు మాత్రం వస్తే చాలదు. వాళ్ళలో సరైన ప్రవర్తన, సమస్యలను ఎదుర్కొనే నేర్పు, నిర్ణయాలు తీసుకునే శక్తి పెంపొందించాలి’ అంటారు అప్ని శాల వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్వేత.

కొన్నాళ్ళ క్రితం శ్వేత ‘ఈచ్ వన్ టీచ్’ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నప్పుడు అక్కడో పిల్లవాడిని గమనించారు. చదువులో మరీ అంత అధ్వాన్నం కాకపోయినా, అతని ప్రవర్తన మాత్రం చాలా అరాచకంగా వుండేది. ఎవరితోనూ స్నేహంగా వుండడు. తోటి విద్యార్థులతో దుందుడుకుగా వ్యవహరించేవాడు. ఎందుకిలా వుంటున్నాడని ఆరా తీస్తే అతని కుటుంబ నేపథ్యమే అందుకు కారణమని తెలిసింది. అతని తండ్రి తాగుబోతు. ఆ అబ్బాయిని హింసించేవాడు. పైగా స్కూలు అయిన తర్వాత ఆ అబ్బాయి పనిచేసి ఇంటిని పోషించాల్సి వచ్చేది. అందుకే అతను చదువులో బాగానే వున్నా.. ప్రవర్తన మాత్రం అభ్యంతరకరంగా వుండేది.

ఈ అబ్బాయిని చూసాక ఇంక శ్వేతకి మళ్ళీ కార్పొరేట్ జాబ్‌ వైపు వెళ్లాలనిపించలేదు. ఇలాంటి పిల్లల మానసిక ప్రవృత్తిలో, ప్రవర్తనలో మార్పుతెచ్చే పనేదైనా చెయ్యాలనిపించింది. అందుకే కార్పొరేట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేసి , ప్రథమ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో కంటెంట్ డెవలపర్‌గా చేరారు. అక్కడితో ఆగకుండా తను చేయబోయే పనిలో మరింత నైపుణ్యాన్ని పెంచుకునేందుకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఎం.ఎ. సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ కూడా పూర్తి చేసారు.

టిస్ (TISS) లోనే శ్వేతకు అమ్రిత, అనుకృతి కూడా పరిచయమయ్యారు. అనుకృతికి మొదటి నుంచి ఆంట్రప్రెన్యూర్‌షిప్ లక్షణాలుండేవి. సొంతంగా ఏదైనా చేయాలని ఆమె కోరిక. అమ్రిత సైకాలజీ చదువుకుంది. 

‘‘ఎవరికి వాళ్ళకి పిల్లలకి సంబంధించి ఏదైనా చేయాలని వుండేది కానీ, ఆ పని ముగ్గురం కలిపి చేస్తామని అప్పట్లో అనుకోలేదు..’’ అని టిస్ రోజుల్ని గుర్తుచేసుకున్నారు శ్వేత.

మొదట్లో శ్వేత లైఫ్ స్కిల్స్ నేర్పించడం మీద దృష్టి పెడితే, అను, అమ్రిత... లైబ్రరీ మోడల్ గురించి ఆలోచించే వాళ్ళు. కానీ వాళ్ళు కలిసిన ప్రతీ స్కూల్ యాజమాన్యం, లైఫ్ స్కిల్స్ మీదే ఆసక్తి చూపించింది. దీంతో పిల్లల లైఫ్ స్కిల్స్ మీదే పనిచేయాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు.

లక్ష్యం నిర్ణయించుకున్నంత తేలికంగా దారి దొరకలేదు. పిల్లలకి లైఫ్ స్కిల్స్ అవసరమని స్కూళ్లన్నీ అంగీకరించినా ఈ దిశగా పనిచేసే అవకాశాన్ని మాత్రం ఎవరూ అప్నీశాలకు ఇవ్వలేదు. ‘‘ఐడియా నచ్చుతోంది కానీ, దాన్ని అమలు చేయడానికి అవసరమైన సమయాన్ని మాత్రం స్కూళ్ళు కేటాయించలేదు’’ అని శ్వేత ఆనాటి తన అనుభవాల గురించి చెప్పారు.

స్కూళ్ళను సంప్రదించడం కంటే, ఎన్‌జిఓలను కలిస్తే, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఈ టీమ్ భావించింది. ''స్వచ్ఛంద సంస్థలకు స్కూళ్ళతో టైఅప్స్ వుంటాయి. అందుకే ఆ సంబంధాలను అలా వాడాలని నిర్ణయించుకున్నాం. విద్యారంగంలో చాలా సంస్థలు పనిచేస్తున్నప్పటికీ, లైఫ్ స్కిల్స్ విషయంలో అవేమీ చేయడం లేదు. అందుకే మా ఆలోచన విన్న వెంటనే ఈ ఎన్జీవోలు మమ్మల్ని స్కూళ్ళతో అనుసంధానం చేసాయి’’ అని తమ తొలి సక్సెస్ గురించి చెప్పుకొచ్చారు శ్వేత.

ఇక తరవాత సమస్య, ప్రభుత్వంతోనే వచ్చింది. ప్రతి అనుమతి కోసం అనేక మంది చుట్టూ తిరగాలి. అయితే, లక్ష్యసాధనకు ఇవన్నీ తప్పవని వాళ్ళకు తొందరగానే అర్థమయింది. ఇలాంటి చాలా కష్టాలు చుట్టుముడుతున్నప్పుడే అప్నీశాలా టీమ్‌కి DBS మద్దతు దొరికింది. ‘‘డి.బి.ఎస్. మా కష్టాలను తీర్చేసింది. మాకు అనుభవం తక్కువ. సామాజిక వ్యాపారానికి మేం కొత్త. అయినా, డి బి ఎస్ మమ్మల్ని నమ్మి మాకు నిధులచ్చింది. ఇప్పుడు మేం సరయిన కర్రిక్యులమ్ మీద దృష్టి పెడితే చాలు. డి బి ఎస్ కారణంగా మాకు మా మీద, మా ప్రాజెక్టు మీదా మరింత నమ్మకం కలిగింది.’’ అంటున్నారు శ్వేత.

కథలు, నాటకాలు, ఆటపాటలతో కూడిన అనుభవాత్మకమైన శిక్షణ ద్వారా పిల్లల్లో భావోద్వేగమైన మార్పును తేవాలని అప్నీ శాల ప్రయత్నిస్తోంది. ‘‘ప్రతి స్కూల్ తన కరిక్యులమ్‌లో ఈ అనుభవాత్మక విద్యపైనా, లైఫ్ స్కిల్ ట్రెయినింగ్ పైనా ద్రుష్టి పెట్టాలి’’ అంటారు శ్వేత.

వచ్చే ఏడాదికల్లా పదకొండొందల మంది విద్యార్థులకు ఈ రకమైన శిక్షణ ఇవ్వాలని అప్నీశాల లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం పిల్లలకే కాక, టీచర్లతో కూడా ఈ దిశగా పనిచేయాలని అప్నీశాల ప్రయత్నిస్తోంది.

Related Stories