నిన్న స్మాల్‌టౌన్... నేడు టాక్ ఆఫ్ ది టౌన్

చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్small-town ద్వారా బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయంరాజస్థాన్ ప్రభుత్వ ప్రశంసలు పొందిన small-townసొంత డిజైనింగ్ ద్వారా ప్రతిభ వెలుగులోకి

నిన్న స్మాల్‌టౌన్... నేడు టాక్ ఆఫ్ ది టౌన్

Wednesday May 20, 2015,

3 min Read

చేసే పని చిన్నదైనా సంకల్పం పెద్దగా ఉంటే చాలంటారు చాలామంది పెద్దలు.

‘‘మా ఆలోచనలే మా ప్రణాళికలు.. మాతో కలిసి నడవాలనుకునేవారికి ఇదే మా ఆహ్వానం’’ అంటారు హ్యాండ్లూమ్ స్టార్టప్ ఎండీ నేహా ప్రకాష్.

మనదేశంలో అద్భుతమయిన కళాఖండాలు తయారుచేసే కళాకారులకు లైఫ్ లేకుండాపోతోంది. వారు తయారుచేసిన వస్తువులకు, దుస్తులకు సరైన మార్కెటింగ్ లేదు. కళాఖండాలు తయారుచేసినవారికంటే వాటిని అమ్మినవారికే అధిక లాభాలువస్తున్నాయి. ఈ పరిస్థితి మారకపోతే భవిష్యత్తులో కొనుగోలుదారులు ఉంటారు కానీ, కళాకారులు ఉండరు’’ అంటున్నారు నేహా ప్రకాష్.

నేహా ప్రకాశ్, స్మాల్ టౌన్ ఎండి

నేహా ప్రకాశ్, స్మాల్ టౌన్ ఎండి


స్మాల్‌టౌన్ పేరుతో ప్రారంభించిన స్టార్టప్ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందింది.

‘‘చేనేత కళకారులే మా బలం. వారికి ప్రయోజనం కలిగించడమే మా ధ్యేయం’’ అంటారు స్మాల్‌టౌన్ స్టార్టప్ నిర్వాహకులు ప్రకాష్. బీహార్, బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్ఠాన్‌కి చెందిన హస్త కళాకారుతో కలిసి ఈ స్టార్టప్‌ని ప్రారంభించారు. ఆధునిక ధోరణులతో కూడిన ఫ్యాషన్ దుస్తులు, ఇతర ఉత్పత్తులు మార్కెటింగ్ చేయాలని దీన్ని స్థాపించారు నేహా ప్రకాష్, బిశ్వజిత్ దాస్. ‘‘ప్రముఖ యాడ్ ఏజెన్సీ లియో బర్నట్ కంపెనీలో క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నేను గత ఏడాది ఫిబ్రవరిలో రాజీనామా చేశాను. భారతీయ హస్తకళలకు అంతర్జాతీయ మార్కెటింగ్ చేయాలని నిర్ణయించాం. నా చిన్నప్పుడు మా అమ్మగారి అల్మారాలోని అపురూపమయిన దుస్తులు, హస్తకళలు చూసేదాన్ని. వాటిని తయారుచేసిన కళాకారుల కోసం అనేక గ్రామాలు తిరిగాను’’ అంటారు నేహా ప్రకాష్.

image


పశ్చిమబెంగాల్‌లోని ఫూలియాలో నేహా అనేక గ్రామాలను సందర్శించారు. నేతకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తీవ్రమయిన సంక్షోభంలోనూ చేనేత కళాకారులు తయారుచేస్తున్న కళాఖండాలు, దుస్తుల నాణ్యత ఏమాత్రం తగ్గకపోవడం ఆశ్చర్యం అనిపించింది.

స్మాల్‌టౌన్ అని పేరు పెట్టడంలోనే స్టార్టప్ కంపెనీ సక్సెస్ అయింది. ఈ టీంలోని సభ్యులంతా దేశంలోని చిన్నచిన్న పట్టణాలకు చెందినవారే. బెంగాల్, బీహార్, మధ్యప్రదేశ్‌కి చెందిన హ్యాండ్యూమ్స్ మా స్మాల్‌టౌన్లో దొరికే ఏర్పాటుచేశాం. రెండేళ్ళ తర్వాత స్మాల్‌టౌన్ ప్రారంభమయింది. అయితే మార్కెటింగ్‌లో పెద్దగా మార్పులు కనిపించలేదు.

image


సామాజిక వెబ్‌సైట్‌లో మా గురించి ప్రచారం చేసుకోవాలని నిర్ణయించాం. ‘‘మేం ట్రెండ్ సెట్ చేయాలని అనుకోవడం లేదు. పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో మా ఆలోచనలను కార్యరూపంలో పెట్టాలనుకుంటున్నాం. చేనేత కళాకారుల జీవితాలను మార్చేందుకు మీరూ ప్రయత్నించండి’’ అంటూ ఫేస్‌బుక్‌లో ప్రకటన చేశారు నేహా.

image


పేమెంట్ గేట్ వే రైట్ వే

‘‘స్మాల్‌టౌన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. చేనేత వస్తువులను మేమే తయారుచేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ డిజిటల్ డిజైన్ రూం ప్రారంభించాం. స్వంతంగా ఒక లోగో, ఒక బ్యాగ్, ఒక స్టయిల్ ఏర్పాటుచేసుకున్నాం. పేమెంట్ గేట్ వే రైట్ వే అని గుర్తించాం.

Jaypore.com మరియు Tadpolestore.com అనే వెబ్‌సైట్లతో ఒప్పందం పెట్టుకున్నాం. మా Small Town లో కొనుగోలు చేసినవారి వివరాలు ఎప్పటికప్పుడు డేటాబేస్‌లో నిక్షిప్తం చేశాం. వారినుంచి ఎప్పటికప్పుడు వారి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాం. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ మా ప్రొడక్ట్స్ సేల్ చేయాలనుకుంటున్నాం. కస్టమర్ల నుంచీ భారీగా స్పందన లభిస్తోంది.

ఫేస్‌బుక్‌ని బాగా వాడుకుంటున్నాం. మా కంపెనీ ట్యాగ్‌లైన్‌లో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లను పోస్ట్ చేస్తూ కస్టమర్ల సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం’’అంటున్నారు నిర్వాహకులు.

ఎన్నో ఒడిదుడుకులు.. కష్టాలే ఎక్కువ

జీవితం మనం చెప్పినట్టుగా ఎప్పుడూ సాగదు. జీవితం చెప్పినట్టు మనం ముందుకు పోవాలి. ఎన్నో ఆశలతో Small Town ప్రారంభించాం. ఆదిలోనే హంసపాదులా మాకు వచ్చిన ఆర్డర్‌ని సకాలంలో డెలివరీ చేయలేకపోయాం. రూ.60 వేల రూపాయల ఆర్డర్. చేనేతకారులు సకాలంలో పూర్తిచేసి ఇవ్వలేకపోయారు. ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి మాకు చాలా టైం పట్టింది. ఈ అనుభవం నుంచి పాఠం నేర్చుకున్నాం.

image


మనదేశంలో షెమూర్ కాటన్ అని ఫేమస్. ఈ కాటన్‌తో చిన్నపిల్లలు వాడే పిల్లోస్‌ని తయారుచేస్తారు. మా ప్రోడక్ట్‌లో ఈ కాటన్‌ని ఎక్కువగా వాడుతున్నాం. Small Townలో డిజైన్ చేసే డ్రెస్‌లను ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌లోకి అప్‌లోడ్ చేస్తుంటాం. కొత్త కొత్త సింబల్స్, కంపెనీలు ఇచ్చే లోగోలను వారికి నచ్చేవిధంగా మార్పులు చేస్తూ ఉంటాం. కస్టమర్ల సంతృప్తికి మించింది లేదు కదా‘‘

స్వచ్ఛభారత్‌కి అనుగుణంగా మా దుస్తుల డిజైన్ ఉంటుంది. నిరక్షరాస్యులైన మా చేనేత కారుల్లో సాంకేతిక పరమయిన నైపుణ్యం పెంచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. చేనేత కారులు తాము తయారుచేసే అత్యాధునిక డిజైన్లను అధిక ధరలకు అమ్మడం మా విధి. వారి కష్టాన్ని అందరికీ తెలిసేలా చేయడం ద్వారా పదిరూపాయలు ఎక్కువగా వచ్చేలా చేస్తున్నాం’’ అంటున్నారు నేహా ప్రకాష్ అండ్ టీం.

చేనేత కారులకు మరింత ఉపాధి కలిగించేందుకు వివిధ విద్యాసంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించాం. దీనివల్ల ఎక్కువమందికి పని దొరుకుతుంది. అంతేకాదు సవ్యసాచి వంటి బడా ఫ్యాషన్ డిజైనర్ల సాయం తీసుకుంటున్నాం. మనదేశంలో ఇప్పటికే చేనేత వస్త్రాలకు ఎంతో డిమాండ్ ఉంది. అదృష్టవశాత్తూ మనదేశంలోని చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభిస్తుందంటే దానికి అదే కారణం’’ అంటారు Small Town నిర్వాహకులు.

స్మాల్ టౌన్ నేతకార్ల నేసిన చీర

స్మాల్ టౌన్ నేతకార్ల నేసిన చీర


మా Small Town లో డిజైన్ చేయబడిన Kot Jewar ఎందరో ప్రశంసలు పొందింది. Kot Jewar అంటే ఒక ప్రాంతానికి చెందిన చేనేత ఉత్పత్తి. దీన్ని మా Small Town ద్వారా విశ్వ వ్యాప్తం చేశాం.ఇక్కడి చేనేత వస్త్రాలు చూసేందుకు పర్యాటకులు కూడా వస్తున్నారు. ఈవిధంగా ఆయా గ్రామాల ఖ్యాతిని పదిమందికి తెలియచేయగలుగుతున్నాం. అంతకుముందు ఆ ఊరు ఎక్కడ ఉందో తెలీదు. కానీ ఇప్పుడు అదో టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది. చేనేత కారుల ప్రతిభను గుర్తించి వారిని జనబాహుళ్యంలోకి తీసుకురావడం మా విధి. ఈ విషయంలో మేం బాగా సక్సెస్ అయ్యాం. రాజస్థాన్ ముఖ్యమంత్రి మా Small Town ఐడియాను బాగా మెచ్చుకున్నారు.

‘‘ఓ స్టార్టప్‌ని ప్రారంభించడం అంత తేలికయిన విషయం కాదు. ఓ బ్రాండ్ ఏర్పాటయ్యేవరకూ మీరు తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది’’ అంటారు నేహా ప్రకాష్.

చేనేత కళాకారుల్లో ఎంతో ప్రతిభ ఉందని.. వాటిని వెలికి తీసి ప్రపంచానికి చూపిస్తే ఎన్నో చేనేత కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపవచ్చునంటారు నేహా.