చిన్న మధ్యతరహా వ్యాపార సంస్థలకు గూగుల్ తోడ్పాటు

0

ఇంటర్నెట్ కి దూరంగా ఉన్న చిన్న మధ్యతరహా కంపెనీలకు గూగుల్ తోడ్పాటు అందిస్తోంది. డిజిటల్ అన్ లాక్ పేరుతో ఎస్ఎంబీ వ్యాపార సంస్థలకు గూగుల్ ఇండియా వర్క్ షాప్ మొదలుపెట్టింది. వచ్చే మూడేళ్లలో 40 నగరాల్లో 5వేల వర్క్ షాపులు నిర్వహించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇండియాలో 68 శాతం చిన్నవ్యాపారాలు ఆఫ్ లైన్ లోనే ఉన్నాయి. వెబ్ ఆధారిత బిజినెస్, చిన్న మధ్యస్థాయి వ్యాపారంకూడా 6 శాతం కంటే తక్కువే ఉంది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఎస్ఎంబీ వ్యాపారం రూ. 5.1 కోట్లుగానే ఉంది. ఈ నేపథ్యంలోదేశంలోని చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థల్లో డిజిటల్ టెక్నాలజీని పెంచడానికి ప్రభుత్వం డిజిటల్ అన్లాక్ పేరుతోగూగుల్ ఇండియా శిక్షణ ఇవ్వబోతోంది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

అగ్రిమెంట్ ప్రకారం ఎస్ఎంబీ ప్రతినిధులతో గూగుల్ వర్క్ షాప్ ప్రారంభించింది. ఇందులో భాగంగా వచ్చే మూడేళ్లలో 40 నగరాల్లో 5వేల వర్క్ షాపులను గూగుల్ నిర్వహించనుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్, మొబైల్ ద్వారా ఇచ్చే ఈ శిక్షణా కార్యక్రమంలో చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థలు వేల సంఖ్యలో డిజిటల్ పరిజ్ఞానాన్ని సంపాదిస్తాయి. ఈ వర్క్ షాప్ లతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న దాదాపు 40 ఎస్ఎంబీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. డిజిటల్ టెక్నాలజీని వాడే ఎస్ఎంబీలను ప్రోత్సహించడానికి ఎస్ఎంబీ హీరోస్ పేరుతో గూగుల్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. బిజినెస్ ఇన్నోవేషన్, డిజిటల్ సిగ్నిఫికెంట్ ఛేంజ్ , విమెన్ ఆంట్రప్రెన్యూర్షిప్ విభాగాల్లో ఎస్ఎంబీ హీరోలను గుర్తిస్తారు. దీనికి సంబంధించిన ఎంట్రీలను పంపాల్సిన చివరి తేదీ ఏప్రిల్ 24.

చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. గూగుల్ వంటి కంపెనీల మద్దతు ఉంటే చిన్న కంపెనీలు ఎక్కువ ప్రయోజనం పొందుతాయని సర్కారు భావిస్తోంది. సిస్టమ్, పాలసీ, ఫండ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తే, అనేక చిన్న వ్యాపారాలు పుంజుకుంటాయన్న ముందుచూపుతో, వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్స్ ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. 

Related Stories