చుల్‌బుల్‌పాండేకు పోటీ ఈ పోలీస్ రంజిత్ సింగ్ !

ఇండోర్ లో ఎంతో ఫేమస్ అయిన పర్సనాలిటీ12th క్లాస్ ఫెయిల్, కానీ ఎంతోమందికి ఆదర్శంనాన్న గర్వపడే పని చేయడంలోనే ఆనందం వెతుక్కున్న రంజిత్ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగమే అయినా దేశ వ్యాప్తంగా పాపులారిటీఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు అవార్డులు అందుకున్న సింగ్

చుల్‌బుల్‌పాండేకు పోటీ ఈ పోలీస్ రంజిత్ సింగ్ !

Thursday May 21, 2015,

5 min Read

సమయం సాయంత్రం 7గంటలు. ప్రాంతం ఇండోర్ పాతబస్తీలోని ట్రాఫిక్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. కొన్ని వాకీటాకీల నుంచి శబ్దం వినిపిస్తోంది. వేసవి తాపానికి నగరమంతా ఠారెత్తిన పరిస్థితి. సాయంకాలమైనా కనిపించని చల్లదనం. అక్కడొక వ్యక్తి . చూడ్డానికి ఓ హిందీ సినిమా హీరోలా కనిపిస్తున్న ఆ వ్యక్తి, టెర్రిఫిక్ ఉండే నగర ట్రాఫిక్‌. ఒంటి చేత్తో మొత్తం ట్రాఫిక్‌ను కంట్రోల్‌లో పెట్టిన ఆ సింగం పోలీస్ కథా కమీజేంటో తెలుసుకోవాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే.

సాధారణంగా ఇండోర్‌లోని హైకోర్టు జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఛేదించాలంటే... సినిమాలోని ఛేజింగ్ సీనంత కష్టపడాలి. కానీ ఆ ట్రాఫిక్‌ని మేనేజ్ చేస్తూ మైకెల్ జాక్సన్ స్టెప్పులేస్తున్న వ్యక్తిని చూసి కొంత ఆశ్చర్యం, అంతకు మించిన ఆసక్తిని కలిగకమానదు. అతని పేరే రంజిత్ సింగ్. కానీ రంజిత్ సింగ్ అంటే ఇక్కడ ఎవరికీ తెలియదు. అతన్నొక సెలబ్రిటీలా చూసే జనం ..ముద్దుగా దబాంగ్ పోలీస్, సింగం కాప్ అని పిలుస్తారు. మనదేశంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ఎవరూ అంతగా గుర్తు పెట్టుకోరు. కానీ రంజిత్ మాత్రం ఓ ట్రాఫిక్ పోలీసుకి ఓ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టారనే చెప్పాలి.

రంజిత్ సింగ్, ట్రాఫిక్ కానిస్టేబుల్

రంజిత్ సింగ్, ట్రాఫిక్ కానిస్టేబుల్


నేను నా ఉద్యోగానికి నూటికి నూరు పాళ్ల న్యాయం చేస్తున్నానని భావిస్తున్నా. ట్రాఫిక్ వాలంటీర్ ఎవరనే విషయాన్ని నేను అసలు గుర్తుపెట్టుకోను. అవసరం అనుకుంటే ఎస్పీని సైతం ఆపుచేస్తా. ఒకవేళ ఆయన మా నాన్నే అయినప్పటికీ నేను అదేచేస్తా. అని చెప్పుకొచ్చారాయన.ఆయనొక అరెస్టింగ్ పర్సనాల్టీలా మనం ఇక్కడ చూడక్కర్లేదు. ఎందుకంటే అతని సెన్సాఫ్ హ్యూమర్ మనల్ని కట్టిపడేస్తుంది. మరీ ముఖ్యంగా హిందీని మాట్లాడుతూ దాన్ని ఇంగ్లీష్ లో వివరించే విధానం జనాన్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. స్థానికంగా ఇనిస్టిట్యూట్‌లలో మాట్లాడటానికి ప్రత్యేక ఆహ్వానితునిగా వెళ్లారంటే అతని వాక్చాతుర్యం అర్థం చేసుకోవచ్చు.

మధ్యప్రదేశ్ పోలీస్ శాఖతో పాటు ప్రైవేట్ సంస్థలనుంచి ఎన్నో అవార్డులు పొందారు. ఉద్యోగంలో జాయిన్ అయిన రోజుల్లో 45డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న సమయంలో రోడ్లపై అడుగు పెట్టాలంటే హడల్. కొత్త ఉద్యోగం కదా, నాలుగు నెలలైతే అలవాటైపోతుందిలే అని అంతా అనేవారట. ఇప్పుడు దాదాపు 9 ఏళ్లు దాటుతోంది. ఇంకా ఇక్కడే ఉన్నా. దీన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నా అంటారు సింగ్. మొదట్లో జనంతో డ్యాన్స్ చేయించడానికి ప్రయత్నించినప్పుడు అంతా క్రేజీగా ఫీలయ్యే వారు. తర్వాత అతని క్రమశిక్షణ తెలుసుకున్న జనం కనీసం ఆయన ఉన్న జంక్షన్‌లో సిగ్నల్ జంప్ చేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. దటీజ్ వాట్ రంజిత్ సింగ్ ఈజ్.

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సిన్సియర్‌గా డ్యూటీ చేస్తున్న రంజిత్

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సిన్సియర్‌గా డ్యూటీ చేస్తున్న రంజిత్


రోజు రోజుకీ రంజీత్ ఫేమ్ పెరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న ఫాలోయింగే వేరు. చాలామంది కెరియర్ గురించి ఆయనకు సలహాలు అడుగుతుంటారు. చాలామంది పోలీసులు లంచాలు తీసుకుంటారని నా దగ్గర ప్రస్తావిస్తుంటారు. అప్పుడు నేను వారినే తప్పుబడతాను. ఎందుకంటే వారిస్తే కదా.. ఎదుటివారు తీసుకునేది. లంచాలు ఇవ్వడం వల్ల దేశంలో లంచగొండితనం పెరుగుతోంది. ఎడ్యుకేట్ అయిన వారంతా కలసి కట్టుగా లంచం ఇవ్వడాన్ని నిషేధిస్తే.. దేశం నుంచి ఈ కరప్షన్ రాకాసిని పంపించేయొచ్చని అభిప్రాయపడ్డారు సింగ్. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. నన్ను పేరు పెట్టి పిలిచిన వారితో నేనుకూడా అలాగే వ్యవహరిస్తే. నాతో గౌరవంగా మాట్లాడితే వారి గౌరవాన్ని తగ్గించేలా నేనసలు మాట్లాడనని చెప్పుకొచ్చారాయన. 

రంజిత్‌కు కూడా చేదు అనుభవాలు తప్పలేదు.2008 లో ఒకసారి వర్షం పడుతున్న సమయంలో రోడ్ క్రాస్ చేస్తుండగా.. ఒక కారు వచ్చి గుద్దుకుంటూ పోయింది. ఆ కారు డ్రైవర్ కనీసం ఇటు వైపు చూడకుండానే వెళ్లిపోయాడట. రంజిత్ మూడు నెలలపాటు మంచం పట్టారట. తర్వాత తన ఉద్యోగాన్ని డెస్క్‌కు ట్రాన్స్ ఫర్ చేశారు. అదే జీవితంలో వరస్ట్ టైం అని అంటారాయన. ట్రాఫిక్ జంక్షన్‌ను మిస్ కావడం ఎంతో బాధను కలిగించిందట. అక్కడ పనిచేయడానికి ఎక్కువగా ఇష్టపడే రంజీత్ దాన్ని కర్మభూమిగా సంభోదించారు. అక్కడ తనొక నటుడిగా ఉండటానికి ఇష్టపడతారు.

జీవితంలో కొంతమంది మాత్రమే వారికి ఇష్టమైన పనులు చేయగలరు

ఆ ప్రమాదం జరిగిన తర్వాత తాను కూడా ఆ అవకాశాన్ని కోల్పోయానని ఎంతో బాధపడ్డారు రంజిత్. 2010లో ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ రివ్యూజరిగింది. పటిష్టమైన ట్రాఫిక్ క్రమబద్దీకరణ జరగాలంటే సీనియర్ స్థాయి ఉద్యోగులు ఫీల్డులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రంజీత్ కి మరోసారి అవకాశం లభించినట్లైంది. దీంతో మరోసారి ఎగిరి గంతులేసుకుంటూ రోడ్ పైకి వచ్చారు రంజీత్.

రంజిత్ అమ్మ,నాన్న

రంజిత్ అమ్మ,నాన్న


నాన్న కళ్లలో ఆనందం కోసమే

ఇంటిలో పెద్దకొడుకై ఉండి 12వ తరగతి బోర్డు పరిక్షల్లో ఫెయిలైన వ్యక్తి రంజిత్. తండ్రి కూడా పోలీస్ ఉద్యోగే. ఉదయం ఎప్పుడో డ్యూటీకి వెళ్తే ఏ రాత్రికో తిరిగి వస్తారు. అప్పుడప్పుడు తాగి ఇంటికి వస్తుంటారాయన. “నాకు 18ఏళ్లు అనుకుంటా అప్పుడు. ఇంటినుంచి పారిపోయా. నన్ను వెతుక్కుంటూ వచ్చిన మా నాన్న చెంపపగలగొట్టి ఇంటికి ఈడ్చుకెళ్లారు.” అని గుర్తు చేసుకున్నారు రంజిత్. తర్వాత కొన్నాళ్లక ఇండోరు చేరుకున్నారు. వాళ్ల మేనత్త ఇంటిలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించారు. నాన్న గర్వపడేలా ఏదైనా చేసి చూపించాలని కలలు గనేవారట. ఏం చేసినా నాన్న గొప్పగా చెప్పుకొనేలా చేస్తే వచ్చే ఆనందమే వేరంటారాయన. ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అయ్యారు. బెస్ట్ క్యాడెట్‌గా పేరుతెచ్చుకున్నారు. ఫెయిల్యూర్స్ నుంచి సెల్ఫ్ మోటివేషన్‌తో ఎదిగిన రంజిత్ జీవితానికి సరిపడ స్ఫూర్తిని నింపగలిగారు. రోజుకి 8 నుంచి10 గంటలపాటు నిలబడి, ప్రయాస పడాల్సిన ఉద్యోగం కావడంతో ఎవరికైనా ఉన్న స్పూర్తి కూడా పోతుంది. కానీ రంజిత్ విషయంలో అలా జరగలేదు. లేకపోతే ఐదేళ్ల అనుభవం ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నెలకు 20వేలు సంపాదించడం ఎక్కడైనా జరుగుతుందా. రంజిత్ కావడం వల్లనే అది సాధ్యపడింది.

రాత్రుళ్లు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు రంజిత్. వెంటనే వెళ్లి నిద్రపోతారట. శారీరక సామర్థ్యం కోసం తానిలా చేస్తారట. పనిగంటల సమయంలో క్షణం కూడా కూర్చొనే అవకాశం ఉండదు. దీంతో స్టామినా మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు నాకు ముప్పై ఏడేళ్లు. కొత్తవాళ్లంతా మీరెలా ఉండగలుగుతున్నారంటే... ఇదంతా స్టామినాతోనే సాధ్యం అయిందనేది నా సమాధం అని చెప్పుకొచ్చారు.

స్థానికంగా లభించే ఓ ఎనర్జీ డ్రింక్ వాళ్లు రంజిత్‌తో ఓ ప్రకటన చేయడానికి ప్రయత్నించారు కూడా. ఉదయం 5.30కి లేవడం , యోగాసనాలు వేయడం, తర్వాత జిమ్, బ్రేక్ ఫాస్ట్, రెండు అరటిపళ్లు, ఒక యాపిల్ మొదట తర్వాత టిఫిన్ కొద్దిగా తీసుకుంటారు. తర్వాత డ్యూటీ. ఇదే రంజిత్ దిన చర్య. తనకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ విషయాల గురించి మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడలేదు రంజిత్. నా జీవితం దేశ సేవకు అంకితం అంటరాయన. కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చిన వాళ్లంతా తనని ఫాలో కావడం తన సహచరులకు అసూయ కలిగిస్తుందని చెప్తారు..

బండి లాగినందుకు పది రూపాయలు

ఒక రోజు ఒక ముసలి కూలీ తన ట్రాలీ బండి లాగుతూ కష్టపడుతున్న సమయంలో రంజిత్‌ కంటపడ్డాడు. ఇక తను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బండిని తోసేందుకు సాయం చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ కూలీ వచ్చి తనకి పదిరూపాయిలు ఇచ్చాడు. ఒకింత ఆశ్చర్యానికి గురైన రంజిత్.. ఇది ఎందుకని అడిగాడు. ''దేవుడి హుండీలో వేద్దామనుకున్నాను బాబూ.. నీలోనే నాకు ఆ దేవుడు కనబడ్డాడు'' అంటూ ఆ ముసలాయన చెప్పడంతో కళ్లలో నీళ్లు అప్రయత్నంగానే ఉబికాయి రంజిత్‌కు. ఇది జీవితంలో తనకొక టర్నింగ్ పాయింట్ అని రంజిత్ గుర్తు చేసుకున్నారు. ప్రతిరోజు ఓ ముసలావిడ సాయంత్రం రోడ్డు క్రాస్ చేసే సమయంలో తనని పేరు పెట్టి పిలుస్తుంది. ఆమెకు కంటి చూపు కూడా లేదు. రోజూ విసుక్కోకుండా రంజిత్‌ ఆమెను రోడ్డు దాటిస్తాడు. తాను డ్యూటీలో లేకుంటే వేరే ఎవరికైనా ఆ బాధ్యత అప్పజెప్పి సాయం చేయమని కోరతాడు. ఇప్పటి వరకూ 50మంది దాకా రోడ్ ప్రమాదంలో గాయపడిన వాళ్లను ఆసుపత్రికి తీసుకెళ్లారట రంజిత్.

రోజుకి 12గంటలు ఎండనక వాననక కష్టపడి. రాత్రిసరికి ఇంటికి చేరుకుంటారు. తిరిగి ఉదయాన్నే ఎంతో ఫ్రెష్ గా కొత్త స్టెప్పులతో ట్రాఫిక్ డ్యూటీ చేయడానికి వస్తారు రంజిత్. తను చేసే పనిని అంతగా ఇష్టపడతారు కనుకనే అతని కథ ఈరోజు మనం చదవగలిగాం.