ఆడవారి గొంతుగా మారిన ‘వాయిస్ ఫర్ గర్ల్స్’

ఆడవారి గొంతుగా మారిన ‘వాయిస్ ఫర్ గర్ల్స్’

Monday November 09, 2015,

3 min Read

మారుతున్న పరిస్థితులకు అనుగూణంగా మారిపోవడం కంటే పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవడం గొప్ప వ్యక్తులకు మాత్రమే సాధ్యపడుతుంది. సమాజంలో వస్తున్న కొత్త పోకడల నుంచి అమ్మాయిలకు అర్థమయ్యేలా చేయడం కొత్తగా నగరానికి వచ్చిన వారికి మద్దతివ్వడం, గైడ్ చేయడం లాంటివి వాయిస్ ఫర్ గర్ల్స్ చేస్తుంది. వాలంటరీగా చేసే ఈ ఎన్జీఓ ఆర్గనైజేషన్ హైదరాబాద్ లో గడిచిన నాలుగేళ్లుగా సేవలను కొనసాగిస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి వచ్చిన వారికి కావల్సిన అనుకూల పరిస్థితులను ఏర్పాటు చేస్తుంది.

“క్యాంపులను ఏర్పాటు చేయడం ద్వారా అమ్మాయిల్లో స్కిల్స్ డెవలప్ చేయడం మా ఉద్దేశం.” అనుష భరద్వాజ్

అనుష భరద్వాజ్ ఇప్పుడు వాయిస్ ఫర్ గర్ల్స్ లో ప్రొగ్రాం హెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోన్న సేఫ్టీ యాప్ ను వినియోగించే పద్దతిపై హైదరాబాద్ వాలంటీర్లకు ట్రెయినింగ్ ఇస్తున్నారు. ఈ యాప్ ద్వారా సేఫ్టీ జోన్ లను గుర్తించొచ్చు. అన్ సేఫ్ జోన్ లలో ఎలాంటి సమస్యలున్నాయో సార్ట్ అవుట్ చేసే అవకాశం ఉంది.

image


షీటీమ్స్ తో కలసి

హైదరాబాద్ పోలీస్ విమన్ సెల్ ఇటీవల ప్రారంభించిన షీ టీమ్స్ తో వాయిస్ ఫర్ గర్ల్స్ కలసి పనిచేస్తుంది. ఈ సంస్థ దగ్గర ఉన్న వాలంటీర్ల సంఖ్య ఎక్కువ. ఎప్పటికప్పుడు స్కూళ్లు, కాలేజీల్లో వాలంటీర్లు అపాయింట్ అవుతునే ఉన్నారు. ఇదొక కంటిన్యూ ప్రాసెస్. దీంతో వీరితో కలవడానికి షీ టీమ్ సైతం ముందుకొచ్చింది. మొదటిసారి సేఫ్టీ పిన్స్ క్యాంపైన్ చేసిన సంస్థగా వాయిస్ ఫర్ గర్ల్స్ కు పేరుంది.

“యాప్ ద్వారా కలెక్ట్ చేసిన డ్యాటాను మేం షీటీమ్ కు అందిస్తాం.” భరద్వాజ్

ప్రస్తుతం హైదరాబాద్ లో అన్ సేఫ్ ప్రాంతాలను గుర్తించే పనిలో ఉంది. ఇందులో భాగంగా వాలంటీర్లకు ప్రికాషన్స్ ఇస్తున్నారు. ఆయా ప్రాంతాలు ఏరకంగా అన్ సేఫ్ గా ఉన్నాయో వాలంటీర్లు మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. అలా డేటాను కలెక్ట్ చేస్తున్నారు. ఈ కలెక్టెడ్ డేటాని షీ టీమ్స్ కి అందిస్తారు. దీంతో షీటీమ్స్ సేవలను మరింతగా విస్తరించే అవకాశం ఉంటుంది.

image


వాయిస్ ఫర్ గర్ల్స్ టీం

వాయిస్ ఫర్ గర్ల్స్ నలుగురు కాలేజీ గర్ల్స్ తో ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం వాళ్లు దీన్ని నడపడం లేదు. అమ్మాయిలకు అంకితం ఇచ్చేసి పక్కకు తప్పుకున్నారు. అనుష భరద్వాజ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అనూషనే మొత్తం ప్రొగ్రాంని రన్ చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆమె స్వచ్ఛంద సంస్థలో పని చేశారు.అనంతరం కొన్ని ఎన్జీఓలకు పనిచేశారు. 2013 నుంచి వాయిస్ గర్ల్స్ యాక్టివ్ గా పనిచేస్తున్నారు. చాలా మంది వాలంటీర్లు, యాక్టివ్ మెంబర్లు, విద్యార్థులు ఈ సంస్థకోసం పాడుపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రాప్రాంతాల్లో ఎంతోమంది వాయిస్ ఫర్ గర్ల్స్ కోసం పనిచేసిన వారున్నారు. ఎప్పటికప్పుడు కొత్తవారు అపాయింట్ అవుతునే ఉన్నారు. అమ్మాయిల ఎడ్యుకేషన్ పై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తారు. స్కూల్ డ్రాపవుట్ అమ్మాయిలను గుర్తించి వాళ్లు తిరిగి స్కూల్ కి వచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. తల్లిదండ్రులతో సంప్రదింపులు జరపడంతో పాటు స్త్రీ విద్య ఆవశ్యకతపై కార్యక్రమాలు చేస్తున్నారు.

image


అమ్మాయిలకు వాయిస్ గా

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమ్మాయిలకు కమ్యునికేషన్ స్కిల్స్ నేర్పించడం తోపాటు, తనకాళ్ల మీద తాను నిలబడేలా మద్దతిస్తుందీ సంస్థ. ప్రభుత్వం తరుపున వచ్చే పధకాలను వారికి అందించే క్రమంలో సాయం అందిస్తోంది. లైఫ్ స్కిల్స్ క్యాంపులు ఇందులో ప్రత్యేక ఆకర్షణ. గైడ్ లైన్స్ ఇచ్చి భవిష్యత్ లో తానే వెరొకరరి సాయం చేసేలా ఈ సంస్థ ట్రెయినింగ్ ఇస్తుంది.

“స్కిల్డ్ కమ్యూనిటీ డెవలప్ చేయడం మా ప్రధాన ఉద్దేశం.” భరద్వాజ్

అమ్మాయిలకు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి డౌట్స్ ఉన్నా తమతో సంప్రదించాలంటున్నారు భరద్వాజ్. సాయం అందించడానికి తమ సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

ఇప్పటి వరకూ వేయికి పైగా అమ్మాయిలకు ట్రెయినింగ్ అందించి తోట్పడ్డారు. వాలంటీర్ల సంఖ్యను పదింతలు చేసి ఈ సంఖ్యను మిలియన్ కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆడవారి విషయంలో హెల్దీ స్కూల్ తయారు చేయాలనుకుంటన్నారు. హెల్దీ యంగ్ గర్ల్స్, హెల్దీ విమన్ కోసం తాము పాటుపడుతున్నామని భరద్వాజ్ అన్నారు. హెల్దీ సొసైటీ ఉండాలంటే హెల్దీ విమన్ అవసరం ఉందని ముగించారు.