సైన్యం నుంచి సామాజిక సేవకు మారిన ‘అనంత్‘ ప్రయాణం

ఆర్మీ ఆఫీసర్ నుంచి జాబ్స్ ఇచ్చే స్థాయిలో అజిత్నిరుద్యోగ, కంపెనీలకు వారధిగా రోజ్ గార్ మేళాసమాజంలో తాను సైతం అంటున్న అనంత్

0

“నేను సైతం ప్రపంపంచాగ్నికి సమిథనొక్కటి ఆహుతిచ్చాను” అని మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు..తాను కూడా ప్రపంచానికి ఏదో సాయం చేయాలనుకున్నారు ఈ మాజీ సైనికొద్యోగి. నిరుద్యోగ యువతకు దారిచూపే రోజ్ గార్ మేళాను ప్రారంభించారు. ఆ అనంత్ ఉద్యోగ అవకాశాల కథే ఇది.

నిరుద్యోగ యువత కోసం దేశంలో అతిపెద్ద జీవనోపాధి, ప్రమోషన్ ఉద్యోగం పోర్టల్ Rozgarmela. ఇది యువతలో నైపుణ్యం ఉన్నవారికి, లేని వారికి, అవసరమైన శిక్షణ ఇస్తుంది. యువతకు, సంస్థ యాజమానులకు మధ్య వేదికగా ఉండి... శిక్షణ ప్రొవైడర్లు, యజమానులకు అంచనాలకు అనుగుణంగా పనిచేయడమే దీని లక్ష్యం. గోడ మీద వేలాడుతున్న సైనిక దుస్తులు... కప్పులో వేడి వేడి టీ.. ఏమి చేయాలనే అనే ఆలోచనపై గంటల కొద్ది చర్చలు.. చివరికి అందరిలా కాకుండా డిఫెరంట్‌గా ఉండాలని ధృడ సంకల్పం...అలా ఆర్మీ ఉద్యోగి మనస్సులో నుంచి పుట్టినదే... అనంత్ సేవలు. 

అటు టెక్నాలజీని ఉపయోగించుకుని... వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు. రైతుల నైపుణ్యం, అంచనా వేసి వారికి తగిన ఉపాధి, శిక్షణను పోర్టల్ అందిస్తోంది. ఇన్వెస్ట్ మెంట్ హోల్డింగ్ మరియు ఉపాయ సామాజిక వెంచర్స్ పేరుతో సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి సాధించడం తమ ప్రధాన లక్ష్యమని ఫౌండర్ అజిత్ సింగ్ చెప్పారు. 

"అనంత్ అంటే అనంతం..అవకాశాలకు హద్దు లేదు అనే భావం అర్ధం కావాలనే ఉద్దేశం మా లోగో, అనంతం సైన్ పైన కనిపిస్తుంది." Rozgarmela.com. రూపకల్పన చేసిన ఆర్మీ ఆఫీసర్ అజిత్ యొక్క కెరీర్ గురించి ఆలోచిస్తున్న సమయంలో... ఆయన మనస్సుకు తట్టిన ఆలోచనే ఇది. ఆర్మీలో పనిచేయడం వల్ల రకరకాల అవరోధాలను అధిగమించడం అలవాటైంది. ఉద్యోగ నిర్వహణలో అలవాటైన సవాళ్లు...ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతున్నాయంటారు అజిత్... దేశం క్టిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు సైన్యంలో పనిచేశారు. కీలక నిర్ణయాల్లో చురుకైన పాత్ర పోషించారు.

రోజ్‌గార్ మేళా ద్వారా యువతకు మార్గనిర్దేశనం
రోజ్‌గార్ మేళా ద్వారా యువతకు మార్గనిర్దేశనం

1999 లో ఒక పూర్తి స్థాయి యుద్ధంలో పాల్గొన్న ఆయన... ఇదే తనకు ప్రేరణ ఇచ్చిందని చెబుతుంటారు. అప్పుడే జీవితం యొక్క ప్రాముఖ్యం అర్థమైందని.. అంతే కాకుండా, ఆర్మీ లో పనిచేసిన వ్యక్తులను కలుసుకుని, వారి సమస్యలు తెలుసుకోవడానికి అనుమతి లభించడం వల్లే లైఫ్ స్టయిల్ మారడానికి కారణమైందని చెబుతారు.

వయస్సుతో బేధం లేదు.. అందరికీ అవకాశాలపై అవగాహనా ఉండాలనేదే అనంత్ లక్ష్యం
వయస్సుతో బేధం లేదు.. అందరికీ అవకాశాలపై అవగాహనా ఉండాలనేదే అనంత్ లక్ష్యం

అనంత్ సంస్థ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తర్వాత ఆర్మీ వదిలి, అజిత్ వివిధ రకాల ప్రజల గురించి ఆలోచించడం ప్రారంభించారు. తన కెరీర్ మొత్తంలో ఎదుర్కొన్న విషయాలే, డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్‌గా మారేందుకు దోహదపడింది. అప్పుడే ఢిల్లీలో ఒక చిన్న టీషాప్‌లో మేము ఐదుగురు స్నేహితులం కలిసి భవిష్యత్‌పై చర్చించుకున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేక ఇబ్బందిపడుతున్న యువత కోసం ప్రణాళికలు తయారు చేయాలని నిర్ణయించుకున్నాము. పోర్టల్ ఏర్పాటు వెనుక ప్రధాన లక్ష్యం సామాజిక వర్గాలను కలుపుకొని అభివృద్ధి చేయడమే. అంతే కాదు Rozgarmela వెబ్, మొబైల్‌తో ఏర్పాటైన ఏకైక యూజర్ ఫ్రెండ్లీ టెక్నాలజి. మరో వైపు అసంఘటితరంగ కార్మికుల కోసం ఒక ప్రత్యేకమైన విభాగం కూడా ఉంది. 

పోస్ట్-ప్లేస్మెంట్ ట్రాకింగ్, అనాలసిస్ , జాబ్ పోర్టల్ అనే మూడు రంగాలపై ఈ వ్యవస్థ దృష్టి సారించింది. వీటితో పాటు మేము ASCI ఇండియన్ అగ్రికల్చర్ స్కిల్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ భాగస్వామిగా రైతులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాము. ఇలా ఒక్కొక్క సంస్థ మాతో కలిసి పనిచేయడానికి రావడంతో మాకు బలం పెరిగింది. మేము చేసిన ప్రయత్నంతో ఓ ప్లాట్ ఫారం రెడీ అయిందని "అజిత్ చెప్పారు. దాదాపు పదకొండు రాష్ట్రాల్లోని ముప్పై వేల మంది రైతులకు సలహాలు, సూచనలు చేస్తోంది. 

చివరగా, Rozgarmela.com SMS ఆధారిత టెక్నాలజీ అనుసంధానించే ఇది ఒక వెబ్ వేదికగా మారిపోయింది. అంతే కాదు.. భవిష్యత్తులో సంస్థలు ప్రారంభించాలని నిర్ణయించుకున్న యజమానులకు బాటమ్ ఆఫ్ పిరమిడ్ ( పునాది గట్టిగా ఉండే విధంగా) ఫార్మేట్‌లో లింక్ తయారు చేశారు. అయితే ఉద్యోగం కోరుకొనేవారు మాత్రం ఎలాంటి పైకము చెల్లించాల్సిన అవసరం లేకుండా సేవలు అందుతాయి. యజమానులతో మా విశ్వసనీయతను బిల్డప్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని అజిత్ వివరిస్తారు. కొత్తగా ఏర్పడిన సంస్థ కావడంతో మా ఆలోచనలు,భావనలు అమలుచేయడం, నమ్మకం కల్గించడానికి భారీ స్థాయిలో ప్రణాళికలు తయారు చేశారు. అయితే, అనంత్ క్రమక్రమంగా ప్రగతిపథంలో దూసుకెళ్లడంతో... సంస్థకు లాభాలు ఆర్జించి పెట్టాయి. దాంతో రెండవ సంవత్సరం లాభదాయకంగా మారింది. 

అనంత్‌ను విస్తరించేందుకు ఆలోచన ప్రణాళిక, వినూత్న మార్కెటింగ్ వ్యూహం కోసం బుర్రకు పదును పెట్టారు అజిత్. అనంత్ ప్రారంభించడానికి సాయం చేసిన వారంతా కలిసి...మళ్లీ ప్రణాళికలు తయారు చేశారు.మంచి ఆలోచనలు, ప్రణాళికతో ఉమ్మడిగా కలిసి పనిచేయడంతో ఆయా రంగాల్లో మా బృందం ఆరితేరిపోయింది. అటు ఉద్యోగులకు..ఇటు సంస్థలకు మధ్య వర్తిలా వ్యవహరిస్తున్న అనంత్ 'అవసరాలను గుర్తించడంలో సమతౌల్యం సాధించాల్సి ఉంటుంది అంటారు "అజిత్. అయితే ఎప్పటికప్పుడు ఎంత మీరు చేయవచ్చు ? ఎంత మీరు చేయాలనుకుంటున్నారు ? అనే విషయంలో బ్యాలెన్స్ చేస్తుంటామని చెబుతున్నారు అజిత్...

రోజ్‌గార్ సంస్థ కాల్ సెంటర్
రోజ్‌గార్ సంస్థ కాల్ సెంటర్
ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik