వంద రూపాయలకే ఫ్రీలాన్సింగ్ సేవలు

• 100 రుపాయలకే వెబ్ సర్విసెస్ ను అందుబాటులోకి తెచ్చిన కీర్తి కదమ్...• వేల మందికి ఉపాధి కల్పించడంతో పాటు ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చులో సర్విస్ ఇవ్వడం లక్ష్యం...

వంద రూపాయలకే ఫ్రీలాన్సింగ్ సేవలు

Wednesday April 29, 2015,

4 min Read

అమెరికాలో ఉంటూ గ్రాడ్యుయేషన్‌తో పాటు ఎంబీఏ చేసిన కీర్తి కదమ్, ఓ కొత్త ఆలోచనతో ఇండియా తిరిగి వచ్చారు. గతంలో పార్ట్‌టైమ్ వ్యాపారవేత్తగా చేసినా, ఈ సారి మాత్రం ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో 2013లో ఓ ఆఫిస్ ని అద్దెకు తీసుకుని నడిపారు. చిన్న టీమ్‌తో ప్రారంభమైన వ్యాపారం, ‘మైండ్ టెక్’ ఆధ్వర్యంలో వెబ్ సర్వీసెస్ ఇవ్వాలని అనుకున్నారు కీర్తి. అమెరికా నుండి ప్రాజెక్ట్స్ తీసుకోవడంతో పాటు స్ధానికంగా పూణే మార్కెట్లో కూడా వెబ్ సర్వీసెస్ ఇవ్వాలని భావించారు. అయితే దేశీయ మార్కెట్‌కు అనుగుణంగా ఉండటంతో పాటు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగారు కీర్తి.

100 రుపాయలకు ఎవరైనా ఏదైనా కొనే - అమ్మే విధంగా ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తుంది ‘100 రుపీస్.కామ్’. ఒక్క సారి రిజిస్టర్ అయిన వారు అదే సైట్‌లో ఏదైనా అమ్మొచ్చు, లేదా కొనచ్చు. అమ్మాలనుకున్న వారు వారి ప్రొడక్ట్స్‌ను వంద రుపాయల్లో , లేదా కొన్ని వందల్లో, ఏ విధమైన ఆఫర్ ఇస్తున్నారో తెలపడంతో పాటు, ఎప్పటి వరకు డెలివరి చేస్తారో తెలియజేయాలి. వినియోగదారులు చాలా సులువుగా బ్రౌజ్ చేసి ఏదైనా కొనే అవకాశం ఉందని అంటున్నారు కీర్తి.

image


గంతలో ఫ్రీలాన్సర్‌గా పని చేసిన కీర్తి, ‘ఎలాన్స్’, ‘ఫావర్’, ‘గురు’, ‘ఓడెస్క్’ లాంటి కంపెనీల కోసం పని చేసారు. ఇలా ఇంట్లో నుండి తనకు అనుకూలమైన సమయంలో పని చేయడంతో పాటు డబ్బు కూడా సంపాదించడం ఇష్టమని అంటున్నారు. ఫ్రీలాన్సర్‌గా పని చేస్తున్న సమయంలో అతి తక్కువ ధరలకు మైక్రో ప్రాజెక్టులకు పని చేయడం కీర్తిని ఆకట్టుకుంది. ఇలాంటి పనే చేయాలని భావించిన కీర్తి, ఇండియన్ మార్కెట్‌ను ఫోకస్ చేస్తూ ఏదైనా చేయాలని అనుకున్నారు.

“అయితే ఈ రంగంలో చిన్న చిన్న పనులకు కూడా విపరీతంగా చార్జ్ చేస్తున్నారు, ఓ సామాన్యమైన లోగో తయారుచేయడానికి 200 డాలర్ల వరకు చార్జ్ చేస్తున్నారు. నాకు తెలిసిన ఓ వ్యక్తి రెండు వెబ్ బ్యానర్ల డిజైన్ కోసం 5వేలు ఇచ్చారు, అదంతా చూసి కంప్యూటర్ సావీ కాని వారి కోసం పని చేయాలని నిర్ణయించాను”.

image


ఈ ఐడియా వినగానే ఉత్సహంతో పొంగిపోయిన తన టీమ్‌తో వారం రోజుల్లో ‘ఫీవర్’ లా ఏదైన చేస్తే బాగుటుందని అన్నాను. కాని మంచి లేఅవుట్ కోసం కూడా నెల పట్టింది, అయితేనేం మా ప్రయాణం మొదలైందని ఓ చిరునవ్వుతో చెప్తారు కీర్తి.

100 రుపాయల టాగ్ తో వెళ్లడం అంటే సరసమైన ధరకు క్వాలిటీ అందించడం, 100 రుపాయలంటే ఏ వినియోగదారుడికైనా పెద్ద విషయం కాదు, ఇండియాలో చాలా స్టార్టప్స్ సర్వీసెస్ ఇస్తున్నాయి. కానీ క్వాలిటీ మాత్రం అంతగా ఇవ్వలేకపోతున్నారు. అందుకని 100 రుపాయలు అంటే ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారు,

చిన్న ప్రాజెక్ట్స్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంటే ఏ వినియోగదారుడైనా ఇష్టపడతారు. ఖచ్చితంగా ఓ రోజు ‘ఫీవర్’ లాంటి కంపెనీకి కూడా పోటీ ఇవ్వగలమనే నమ్మకం ఉందని అంటున్నారు కీర్తి. మా లక్ష్యం ప్రొఫెషనల్స్‌తో పాటు నిరుద్యోగులు కూడా, ఇక్కడ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే ఇద్దరికి కూడా లాభమే.

ఇక ఎటువంటి సమస్యలు తలెత్తకూడదని, ప్రతీ యూజర్‌నూ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. స్పామింగ్ లేకుండా ఉండటానికి ప్రాబ్లం ఉన్న యూజర్స్‌ను బ్లాక్ కూడా చేస్తుంటామంటున్నారు 100 రుపీస్ నిర్వహకులు.

ఇంటర్నెట్ మార్కెట్లో కేవలం దేశంలో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పోటీ ఉంటుంది. ఆన్‌లైన్ ఫ్రీలాన్సింగ్ పనులకు గతంలో కన్నా ఎక్కువ పోటీ ఏర్పడిందని అంటున్నారు. ఇప్పటికే ‘ఓడెస్క్’, ‘ఎలాన్స్’ లాంటి కంపెనీలు కూడా విలీనమయ్యాయి,. ‘ఫ్రీలాన్సర్ డాట్ కామ్’ కూడా తన బడ్జెట్‌ను 30 డాలర్ల నుంచి 10 డాలర్లకు తగ్గించేసారు, ‘ఫివర్’ లో అయితే కొంత మంది 5 డాలర్లకు కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు కీర్తి. అయితే మన దేశంలో మాత్రం ఈ-కామర్స్ భవిష్యత్తు మరింత బలంగా ఉండబోతుందని అంటున్నారు. అయితే ‘100 రుపీస్ డాట్ కామ్’ కారణంగా వినియోగదారులకే కాకుండా ఫ్రీలాన్సర్లకు కూడా అదనపు డబ్బు సంపాదించే అవకాశాలు కల్పిస్తుందని అంటున్నారు. ఈ రంగం మాత్రం ఖచ్చితంగా ఎదుగుతుందని, ఇంట్లో నుండే ప్రశాంతంగా ఈ పనులను చేసుకోవచ్చని కీర్తి అంటున్నారు.

అయితే ఇదంతా కేవలం కాలేజ్ యువకులకు వారి పాకెట్ మనీ కోసం చేసే పని కాదని, వేల సర్విస్ ప్రొవైడర్స్‌ని ఒకే చోటికి తేవడంతో పాటు, రిటైర్డ్ అయిన వారు, గ్రామాల్లోని యువకులు, ఇంట్లో ఉండే మహిళలు, విద్యార్దులకు కూడా ‘100 రుపీస్’ మంచి అవకాశమని అంటున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేయాలని కోరిక ఉండే వారికి మంచి అవకాశమని అంటున్నారు.

వినియోగదారుల కోసం చిన్న వ్యాపారాలు చేసే వారిని అందుబాటులోకి తెచ్చి, ఆ సర్వీస్‌ని 100 రుపాయల్లో ఇస్తే , ఆ కస్టమర్ మళ్లీ వస్తారు, ఇప్పటి వరకు మా క్వాలిటీని చూసి చాలా మంది పాత కస్టమర్లు మళ్లీ వస్తున్నారు.

image


భవిష్యత్తులో ఫ్రీలాన్సింగ్ కేవలం అనువైన పనిగా కాకుండా, నేర్చుకునేందుకు కూడా మంచి అవకాశాన్ని కల్పిస్తుంది, అంతే కాకుండా ఇక్కడ లైవ్ ప్రాజెక్ట్స్ ఉండటంలో ఫ్రీలాన్సర్లు కూడా ఎంతో సీరియస్‌గా ఈ పనులు చేస్తున్నారు. ‘ఎలాన్స్’, ‘ఫివర్’ లాంటి కంపెనీలు ఇప్పటికే వారి పని తీరును మెరుగు పరుస్తున్నారు, వారితో పోటీ పడి ప్రపంచంలోనే సరసమైన ధరకు మా సర్వీస్‌ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

“ప్రస్తుతం పుణేలో స్టార్టప్స్‌పై పని చేస్తున్నాము. మార్కెటింగ్‌పై పెద్దగా ఖర్చు పెట్టకపోయినా, భవిష్యత్తులో చేయాలి. 100 రుపాయలకే లోగో డిజైన్ చేయడం మా దగ్గర పాపులర్ అయింది. అదే మార్కెట్లో పబ్లిసిటీ కూడా ఇస్తుంది. ఇక పెట్టుబడుల విషయంలో ఇటీవల బెంగుళూరుకు చెందిన కంపెనీ మాతో కలవడానికి ముందుకు వచ్చిందని అంటున్నారు కీర్తి”.

“ఆర్ధిక సమస్యలను సవాళ్లుగా తీసుకుని వ్యాపారవేత్తలు ముందుకు వెళ్లాలి, మీ విశ్వాసాన్ని కొనసాగిస్తూ, సృజనాత్మకంగా ఏ పని చేసినా సమస్యలను అధిగమించవచ్చు” - కీర్తి.
image


మా సైట్ ద్వారా వేల మంది ఆర్ధికంగా ఎదగడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుందని కీర్తి అంటున్నారు. ఇక 2020 వరకూ ‘100 రుపీస్’ లో ఒక బిలియన్ యూజర్లు ఉండాలనీ... ప్రతీ యూజర్ కనీసం నెలకు పది వేలైనా సంపాదించాలని నా కోరిక. లక్షల మందికి ఉపాధి కల్పించడం నా ఆశ అంటున్నారు.

వ్యాపారవేత్తలుగా ఎదగాలనే వారికి కీర్తి ఇచ్చే సలహా. “వ్యాపారవేత్తలుగా ఎదగాలంటే మీకు మీరే బాస్ అని అనుకోవడం కన్నా మీరు చేస్తున్న పనిని ఇష్టపడండి. మీ ఆలోచనలను అమలు పరచడమే మీ సక్సస్ అని అంటున్నారు. ఇక ఏ వ్యాపారం చేయాలన్నా ఆర్ధిక సమస్యలు ఉండనే ఉంటాయి. అయితే సృజనాత్మకంగా ఆలోచించి ముందుకు వెళ్లాలి. చాలా మంది బానే మొదలు పెట్టినా వారి గమ్యాన్ని మరిచిపోయి విఫలమవుతూ ఉంటారు. ఒకరు సక్సెస్ కావాలంటే మీ గమ్యంపై నిరంతరంగా ఫోకస్ పెడుతూ, కఠినంగా శ్రమించకుండా, సరదాగా వాటిని పూర్తిచేసుకోవడం కూడా సక్సెస్ లోని సీక్రెట్స్ అని అంటున్నారు.