మిల్క్ బిల్ పేమెంట్ సులభతరం చేసిన ‘ఈజీ మిల్క్’

0


సాధారణంగా ఉదయం మిల్క్ ప్యాకెట్ తీసుకోవడంతోనే మన రోజు మొదలువుతుంది. నెల వారీ మిల్క్ డబ్బులు చెల్లిస్తుంటాం. ఈ చెల్లింపులన్నీ అన్ ఆర్గనైజ్డ్ గా ఉంటున్నాయి. వీటిని క్రమబద్దీకరించింది ఈజీ మిల్క్ అనే హైదరాబాదీ స్టార్టప్.

“కస్టమర్ మిల్క్ బిల్ చెల్లింపులను మరింత ఈజీ చేయడమే మా ఉద్దేశం,” స్వరూప్

ఈజీ మిల్క్ ఫౌండర్ అయిన స్వరూప్.. ఐడియాని విరించారు. ఆన్ లైన్ మిల్క్ ఆర్డర్స్ అనేది భవిష్యత్ లో తీసుకురాబోయే ప్రాడక్ట్ అంటున్న ఆయన.. ఇప్పుడు ఎలాంటి తలనొప్పులు లేని మిల్క్ బిల్ చెల్లింపులే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

మిల్క్ ఏజెంట్లకు ప్రయోజనం

మిల్క్ ఏజెంట్లు ఫేస్ చేసే రెండు ప్రధాన సమస్యలకు తమ స్టార్టప్ పరిష్కారం చూపుతుందని స్వరూప్ అంటున్నారు.

1.పేమెంట్ కలెక్షన్స్

మిల్క్ ఏజెంట్స్ చాలా కంపెనీల వెండర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి రోజూ అమ్మకాలు చేస్తుంటారు. నెలవారి సప్లై చేస్తుంటారు. కానీ వాటి కలెక్షన్లు అనుకున్న సమయానికి రావు. కస్టమర్లు అందుబాటులో లేకపోవడం కూడా ఒక సమస్య. దీనికి ఆన్ లైన్ ప్లాట్ ఫాంని తీసుకొచ్చింది ఈజీ మిల్క్. మీరు ఆఫీసు నుంచే మిల్క్ బిల్ పే చేసుకోవచ్చని అంటున్నారు స్వరూప్.

2. డెలివరీ

ఆర్డర్లకు సరిపడా డెలివరీ చేయడం ఏజెంట్లకు కష్టమైన పని. సాధారణంగా కస్టమర్లు ముందుగా పేమెంట్స్ చేయరు. ఆర్డర్లు డెలివరీ అయ్యాక ఇస్తారు. అలాంటప్పుడు మిల్క్ ఏజెంట్ల దగ్గర మనీ జనరేట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. దీనికి షార్ట్ టర్మ్ లోన్ల ద్వారా ఈజీ మిల్క్ పరిష్కారం చూపుతుంది. మనీ లెండింగ్ అనేది నెలవారీ మిల్క్ సప్లయ్ పై కూడా ఇస్తామని స్వరూప్ తెలిపారు.

ఈజీ మిల్క్ ఎలా పనిచేస్తుందంటే..

ఈజీ మిల్క్ ప్రారంభమై దాదాపు 9 నెలలు కావొస్తోంది. సైబరాబాద్ తో పాటు హైదరబాద్ లోని మరికొన్ని ప్రాంతాలకు సేవలు విస్తరించారు. ఇప్పటి వరకూ 50వేల చొప్పున్న నలుగురు ఏజెంట్ల కు మనీ లెండ్ చేశారు. నెలకు 300 నుంచి 500 దాకా చెల్లింపులు జరుగుతున్నాయని అంటున్నారు స్వరూప్. 120మంది ఏజెంట్లు ఈ ప్లాట్ ఫాంని ఉపయోగించుకుంటున్నారు. బిటుసి కంటే బిటుబికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం కనక ఎక్కవగా ట్రాక్షన్ కనపించక పోవచ్చనేది స్వరూప్ అభిప్రాయం. బిటుసిలో కూడా విస్తరణ ప్రయత్నాలు మొదలు పెట్టామని.. కానీ ఏజెంట్ సెక్టార్ ని వ్యవస్థీకరించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన చెప్పుకొచ్చారు. ఏజెంట్ల కోసం ప్రత్యేకమైన యాప్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఏజెంట్లకు మనీ లెండింగ్ చేయడం ఈ స్టార్టప్ ప్రధాన ఆదాయ వనరు. దీంతో పాటు చెల్లింపుల్లో కమిషన్ మరో ఇన్ కమ్ సోర్స్.

ఈజీ మిల్క్ టీం

స్వరూప్ దీని ఫౌండర్. సీరియల్ ఆంట్రప్రెన్యూర్ అయిన స్వరూప్ గతంలో 3 స్టార్టప్ ల కోసం పనిచేశారు. ఇండియా, ఎబ్రాడ్ లో సాఫ్ట్ వేర్ మార్కెటింగ్ లో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్వరూప్ తో పాటు మరో ఏడుగురు ఈ స్టార్టప్ కోసం పనిచేస్తున్నారు. 120 మంది ఏజెంట్లున్నారు.

ప్రధాన సవాళ్లు

ఏజెంట్స్ చాలా మంది టెక్నాలజీని తొందరగా అడాప్ట్ చేసుకోరు. వాళ్లని ఒప్పించి దగ్గరకు తీసుకు రావడం ప్రధాన సవాలని స్వరూప్ చెబుతున్నారు. కస్టమర్లు డైరెక్టుగా తమని అప్రోచ్ కాలేరు. వాళ్ల ఏజెంట్ తమ దగ్గర రిజిస్ట్రర్ అయితేనే అది సాధ్యపడుతుంది. ఏజెంట్ కి ఉన్న కస్టమర్లే తమ కస్టమర్లు.. ఇలా నంబర్ పెంచుకోవడం మరో సవాలని అంటున్నారు.

ఫండింగ్, ప్యూచర్ ప్లాన్స్

ఈ స్టార్టప్ పై ఫ్రెండ్స్, ఫ్యామిలీ దగ్గర నుంచి 2 మిలియన్ డాలర్ల సీడ్ ఫండింగ్ జమచేశారు. ప్రీ సిరీస్ ఏ రౌండ్ లో కలసి వచ్చే వారితో పనిచేస్తామని స్వరూప్ అంటున్నారు. 6 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో వస్తే ఆహ్వానిస్తామని అంటున్నారు.

మిల్క్ సబ్ స్క్రిప్షన్ మోడ్ ని భవిష్యత్ లో తీసుకొస్తామన్న స్వరూప్.. ఈ ఏడాది చివరికల్లా అన్ని మెట్రో నగరాల్లో సేవలను విస్తరిస్తామని చెప్పి ముగించారు.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories