అవమానాలు, తిరస్కరణలను తట్టుకునే శక్తి మీలో ఉందా..?

హృదయం లేని మనుషుల గురించి ఆలోచించాల్సిన అవసరంలేదు- శ్రద్ధాశర్మ

0


మీ జీవితంలో పెద్ద కోరిక ఏమిటి..?. మీరు చాలాకాలంగా దేని కోసం వెయిట్ చేస్తున్నారు..?. ఒక మాంచి హాలిడే ట్రిప్, మంచి శరీర తీరును రూపొందించుకోవడం, స్టార్టప్ కు ఫండింగ్ పొందడం ... ఇలాంటి వాటి కోసం చాలా మంది ఎదురుచూస్తూంటారు. కానీ నేను మాత్రం ఎవరైనా నన్ను విమర్శించినా...అవమానించినా...తిస్కరించేలా మాట్లాడినా లైట్ తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తాపే. అంటే ఓ రకంగా నా "తోలు మందాన్ని" ఎప్పటికప్పుడు ఎలా పెంచుకోవాలా..? అని ఆలోచిస్తూంటాను.

కొన్ని సంవత్సరాలుగా ఈ విషయంపై బెటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. చాలా వరకు మెరుగుపడ్డాను కూడా. అయితే ఇది అంత తేలికైన విషయం ఏమీ కాదు.

మన కండరాలను మరింత ధృడపరుచుకునేందుకు చేసే కసరత్తులు ఎంత క్లిష్టంగా ఉంటాయో ఇది కూడా అంతే. మీకు సహజంగా సన్నని, నాజూకైన శరీరం రాకపోతే ... పొట్టపైన సెక్సీ ఏబ్స్ కోసం చాలా తీవ్రమైన శారీరక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా ఇదే తరహాలో మనసును కూడా స్ట్రాంగ్ గా, కటువుగా మార్చుకునేందుకు కష్టపడాల్సి ఉంటుంది.

మనజీవితాల్లో ఇప్పుడు ఇలా లేకపోవడమే పెద్దలోపం. చిన్నతనం నుంచి మనకు దీన్ని అలవాటు చేయకపోవడమే దీనికి కారణంగా నేను చెబుతాను. చిన్నతనంలో మీకు ఎవరైనా ఏమైనా చెబుతూంటే వినకపోతే ఏం జరుగుతుందో మీకు గుర్తుందా..?

నేను చెప్పేది మాత్రం విను..?

నేను చెప్పేది వింటున్నట్లు నటిస్తున్నావా..?

శ్రద్ధ చూపించు..!

ఇలాంటి హెచ్చరికలు ప్రతీ రోజు స్కూల్లో, ఇంట్లో పదుల సార్లు వింటూ ఉంటాం. వీటితోనే మనం మరో ఆలోచనలేకుండా వినడానికి అలవాటు పడిపోయాం. ఒక వేళ వారు చెప్పేది వినకపోతే తిట్టించుకోవడానికి సిద్ధపడాలి... లేదా నోట్ పుస్తకంలో నేను తప్పుచేశాను.. మళ్లీ ఇలాంటితప్పు చేయను అని వందసార్లు రాయడానికి రెడీ అవ్వాలి. ఇదీ కాకపోతే క్లాస్ రూమ్ బయట తప్పుచేసినట్లు నిలబడాలి. ఇవన్నీ చెప్పేది వినకపోవడం వల్ల జరిగేవే..

నేను కూడా మొదట్లో ఎవరు ఏం చెప్పినా వినేందుకు సిద్ధపడిపోయేదాన్ని. మొదట్లో ఈ అలవాటు వల్ల చట్టుపక్కలవారిని ఇబ్బంది పెడుతున్నానేమో అనుకునేదాన్ని. అయితే దీని వల్ల మన చుట్టూ ఉన్న ప్రజలతో మనం అనుసంధానం కావడానికి ఎక్కువ అవకాశం లభిస్తుంది.

నేను స్టార్టప్ ప్రారంభించిన రోజుల్లో ఓ వ్యక్తి నాతో చాలా దురుసుగా ప్రవర్తించాడు. ఆ ఘటన నాకు ఏడుపు తెప్పించింది. అతను సంస్కారం లేకుండా అలాంటి మాటలన్న తర్వాత నాకు అక్కడ ఉండాలనిపించలేదు. బయటకువచ్చాను. అలా వచ్చిన వెంటనే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అతను చాలా దురుసుగా, అవమానించేలా ప్రవర్తించాడని నాకు తెలుసు. అయితే ఆ సమయంలో కచ్చింతగా ఏం చేయాలో మాత్రం తెలీదు. అయితే అదే సమయంలో మా నాన్న ఫోన్ చేశారు. నేను అంతా మామూలుగానే గడిచిపోతోందని వీలైనంత సహజంగా... చెప్పేందుకు ప్రయత్నించా. అయితే తల్లిదండ్రులు ఇట్టే కనిపెడతారు. ఏదో అయిందని మా నాన్న కూడా కనిపెట్టారు. ఏమయిందని అడిగారు. అయితే ఇలాంటి ఘటనల గురించి తల్లిదండ్రులకు తెలియకూడదని అనుకునేవారిలో నేనూ ఒకరిని. కానీ ఆ సందర్భంలో మాత్రం అసలేం జరిగిందో మొత్తం వివరించాను. అప్పుడు మా నాన్న నాకు ఒక్కటే చెప్పారు.

"నువ్వు ఒక దారిలో వెళ్తున్నప్పుడు రోడ్డును ఎలా క్రాస్ చేయాలో.. నీ దారిలో వస్తున్న ట్రాఫిక్ అడ్డంకులను ఎలా అధిగమించాలో సంపూర్ణమైన అవగాహన పెంచుకోవాలి"

కొన్నేళ్లు గడిచాయి. ఇప్పుడు నేను రోడ్డును సరిగ్గాక్రాస్ చేయడాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నాను..? . ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్. అయితే ఇప్పటికి చాలా సందర్భాల్లో ఎదురుపడే జీవితపు చిక్కులు, మనుసులను డీల్ చేయడంలో గాభరాపడుతూనే ఉంటాను.

నా తరహాలో శక్తిసామర్థ్యాలు పెంచుకోవాలనుకుంటున్నవారందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఇలాంటి ఆలోచనల్లేకుండా పుట్టినందుకు ముందు మనం మనం థాంక్స్ చెప్పుకోవాలి. సున్నితత్వం అనేది ప్రస్తుత ప్రపంచంలో ఓ చెప్పుకోదగిన అంశం. దీన్ని ఒక బలహీనతగా అందరూ గుర్తిస్తున్నారు. ఒక బలమైన నాయకుడికి ఇది ఉండకూడని అంశంగా భావిస్తున్నారు. అయితే దీనితో నేను ఏకీభవించడం లేదు. "మనలో సున్నితత్వ పరిమాణమే మనకు అతి పెద్ద బలం"

ఎవరైతే బిగ్గరగా ఏడుస్తారో.. వాళ్లే అంతకంటే బిగ్గరగా నవ్వగలుగుతారు.

అందుకే ముందు మీరు మీ సున్నితత్వాన్ని ప్రేమించండి. థిక్ స్కిన్ ని డెవలప్ చేసుకోవడం అనేది ప్రతీరోజు జరిగే ప్రక్రియ. మీ చుట్టూ ఉన్న హృదయం లేని మనుషుల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరంలేదు. ఇంకా చెప్పాలంటే వారిని ప్రేమించండి. ఎందుకంటే వారే మనల్ని మరింత బలంగా మారుస్తారు.

ప్రతి అవమానం, ప్రతి తిరస్కరణ మనం మరింత మనం మరింత బలంగా మారడానికే ఉపయోగపడుతుంది.

చీర్స్ టు బీయింగ్ ధిక్ స్కిన్ డ్...

రచయిత: శ్రద్ధాశర్మ, ఫౌండర్, ఎడిటర్ ఇన్ చీఫ్, యువర్ స్టోరీ

Related Stories

Stories by team ys telugu