లక్ష మంది డాక్టర్లు, 30 వేల అపాయింట్‌మెంట్స్‌తో దూసుకుపోతున్న ప్రాక్టో

తండ్రి ఆపరేషన్ సమయంలో పుట్టిన బిజినెస్ ప్లాన్ఇంజనీరింగ్ చేస్తుండగానే కంపెనీ ఏర్పాటుఆన్ లైన్ లో డాక్టర్లు-పేషెంట్లకు మధ్య వారధి ప్రాక్టోఇప్పుడు సింగపూర్ లో నెంబర్ 1

లక్ష మంది డాక్టర్లు, 30 వేల అపాయింట్‌మెంట్స్‌తో దూసుకుపోతున్న ప్రాక్టో

Sunday April 05, 2015,

5 min Read

అంతే, ఏ కధ ఎక్కడ మొదలవుతుందో. అలా మొదలైన కథ ఏ మలుపులు తిరుగుతుందో .. ఏ ముగింపునకు చేరుకుంటుందో ఉహించ లేము. ప్రాక్టో కధ కూడా అలాంటిదే. ఒక ఆరేడు సంవత్సరాల క్రితం 2008 లో శశాంక్ ఎన్. డి వాళ్ళ నాన్న గారి మెడికల్ రిపోర్టులు చూస్తున్నారు. వాళ్ళ నాన్న గారికి కొద్ది రోజుల్లో ఆపరేషన్ జరిగేదుంది. ఇందుకు సంబంధించి ఒక అమెరకా డాక్టర్ నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలన్నది శశాంక్ ఆలోచన. కానీ, ఆ డాక్టర్ కు సంబందించిన పూర్తి సమాచారం ఎంత వెతికినా ఎక్కడా దొరక లేదు.

అదిగో ఆ దొరక్క పోవడమే ప్రాక్టో కధకు మూలం. అక్కడే కథ మొదలైంది. ఈ సంఘటన జరిగిన తర్వాతనే శశాంక్ అతని క్లాస్ మేట్ అభినవ్ లాల్ తో కలిసి ప్రాక్టో టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనిని 2008 లో బెంగుళూర్ లో ప్రారంభించారు. అప్పటికి ఇంకా ఆ ఇద్దరి చదువు పూర్తి కాలేదు.ఇద్దరు నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, కర్ణాటకలో కంప్యూటర్ ఇంజనీరింగ్ లో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు.


అభినవ్ లాల్(సిటిఓ),ఎన్.డి.శశాంక్(సిఈఓ)

అభినవ్ లాల్(సిటిఓ),ఎన్.డి.శశాంక్(సిఈఓ)


ప్రాక్టో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రాక్టీస్ మేనేజిమెంట్ స్పేస్ లోకి చాలా మంది ఔత్సాహికులు వచ్చారు. అయితే ప్రాక్టో రే పాటించే నాణ్యతా ప్రమాణాల ముందు అవన్నీ వెలవెలబోయాయి. 2012 జూలై లో ప్రాక్టో నాలుగు మిలియన్ డాలర్లు( దాదాపు రూ.24 కోట్లు) మార్కెట్ నుంచి నిధులు సేకరించింది. విస్తరణలో భాగంగా గత ఇన్వెస్టర్ల నుంచే వెంచర్ కాపిటల్ ద్వారా మరో 20 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.120 కోట్లు) బి రౌండ్ నిధులు సేకరించే పనిలో ఉందని సమాచారం (ప్రాక్టో ఈ విషయాన్ని దృవీకరించలేదు). అయితే ఒక ఆలోచన రూపాంతరం చెంది ఈ స్థాయికి రావడానకి గల విజయ రహస్యం ఏంటో శశాంక్ నే అడిగి తెలుసుకునే అవకాశం లభించిది. రండి శాశాంక్ ఏమంటారో విందాం.

అంకెల్లో అభివృద్ధి

ప్రాక్టో రే వ్యవస్థలో 10,000 మంది డాక్టర్లు ఉన్నారు. పది మిలియన్ల మంది కంటే ఎక్కువ మంది రోగుల ఎలక్ట్రానిక్ రికార్డులు తయారు చేసింది. ఈ రికార్డులు ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతున్నాయి. ప్రతి సంవత్సరం 75 లక్షల మంది రోగులు ప్రాక్టో ద్వారా డాక్టర్ల నుంచి 70 లక్షల అపాయింట్ మెట్లు పొందుతున్నారు. ఇక సింగపూర్ లో అయితే మార్కెట్ భాగస్వామ్యం ప్రాక్టో రే అతి పెద్ద ఆన్ లైన్ క్లినిక్ మేనేజిమెంట్ సాఫ్ట్ వేర్. కేవలం రెండు సంవత్సరాల్లోనే ప్రాక్టో ఈ మైలు రాయిని చేరింది. ప్రాక్టో లో అక్షారాలా లక్ష మంది డాక్టర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 310 కి పైగా నగరాలు, పట్టణాల్లో పనిచేస్తున్న డాక్టర్లు ఉన్నా, ఎక్కువ మంది బెంగళూర్, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై,పూణే, సింగపూర్ డాక్టర్లే ఉన్నారు. అలాగే ప్రాక్టో పేజీలను ప్రతి నెలా 13 లక్షల మంది చూస్తున్నారు. 30,000 మంది ప్రాక్టో ద్వారానే డాక్టర్ల సమయాన్ని కోరుతున్నారు. కంపెనీ కార్యాలయాలు హైదరాబాద్ సహా ముంబై , డిల్లీ, చెన్నై, బెంగుళూర్, పూణే , సింగపూర్ లో ఉన్నాయి.ఆదాయం విషయానికొస్తే ప్రాక్టో ఆదాయం ప్రతి త్రైమాసికంలో 50-100 శాతం వంతున పెరుగుతోంది.


image



రెవెన్యూ మోడల్

ప్రాక్టో కు రెండు మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది.

1. హెల్త్ కేర్ ప్రొవైడర్ లేదా డాక్టర్ ఫేసింగ్ ప్రాక్టీస్ మేనేజిమెంట్ సాఫ్ట్ వేర్. దీన్ని ప్రాక్టో రూపొందించి వీళ్లకు విక్రయిస్తుంది. ఇది సబ్క్రిబ్షన్ ఆధారిత SaaS ప్రోడక్ట్.

నెలకు రూ.999, రూ.1999 ధరలకు రెండు ధరల్లో ఇది లభిస్తుంది. ప్రీమియం ప్లాన్ లో అయితే డాక్టర్లకు క్లౌడ్ టెలిఫోనీ ఆధారిత ఐవీఅర్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది.

2. కన్స్యూమర్ ఫేసింగ్ డాక్టర్ డిస్కవరీ పోర్టల్

ఇది డాక్టర్లు, పేషంట్లు ఇద్దరికీ ఉచితంగా లభిస్తుంది. హాస్పిటల్స్, క్లినిక్స్ నుంచి వ్యాపార ప్రకటనలను సేకరించి వెబ్ సైట్లో ఉంచుతాం. ఇది గూగుల్ సెర్చ్ తరహాలో పనిచేసి ఆదాయం తెస్తుంది.

ఫలితాన్నిచ్చిన పనులు -

"మా వినియోగదారుల అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇచ్చే అంతర్గత వ్యవస్థ ఉంది. అలా ఇచ్చిన ప్రతి సమాధానానికి వినియోగదారులు రేటింగ్ ఇస్తారు. సుమారు 85 నుంచి 90 శాతం వరకూ సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చే వ్యవస్థ మాకుంది అంటారు శాశాంక్. మౌత్ పబ్లిసిటీ, రెఫెరెన్స్, టెస్టిమొనియల్స్, కస్టమర్లు నుంచి మాకు మెరుగైన ప్రచారం లభించడంతో బ్రాండ్ ఇమేజ్ పెరిగింది.

భారత్ దేశంలోని హాస్పిటల్స్ లో సహజంగా పేషంట్లకు కూడా మెడికల్ రికార్డ్స్ ఇచ్చేందుకు వాళ్లు ఇష్ట పడరు. అందులో ఏముందో అసలే చెప్పరు.ఈ నేపధ్యంలో ప్రైవేటు డాక్టర్లు, చిన్న చిన్న క్లినిక్స్ చొరవ చూపడంతో ప్రాక్టో సేవలను ఉపయుక్తంగా భావించారు. పెద్ద ఆసుపత్రుల్లో చాలా చిత్రంగా రోగుల నిర్వాహణా వ్యవస్థంతా డాక్టర్ల చేతిలో కాకుండా అడ్మినిస్ట్రేటర్స్, టెక్నాలజీ ఆఫీసర్స్ చేతుల్లో ఉంటుంది. నిర్ణయాధికారం కూడా వారిదే. మేము అందించే సేవలతో ఆకర్షితులైన ప్రైవేటు డాక్టర్ల వల్లే ప్రాక్టో చాలా వరకు విజయం సొంతంచేసుకుంది.

ప్రాక్టో రే ఆన్-లైన్ సాస్ ప్రోడక్ట్ కావడంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా అప్పుడప్పుడు సమస్యగా మారుతోంది. అలాగే కంప్యూటర్ వినియోగం విషయంలో డాక్టర్లకు ఉన్న మానసిక అవరోధాలు కూడా సమస్యగానే ఉన్నాయి. దీనికితోడు అంతర్జాతీయంగా వస్తున్న కొత్త ధోరణులను గుర్తిస్తూ ప్రాక్టో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కోసం ఒక టాబ్లెట్ కంప్యూటర్ తయారు చేసింది. 2014 జూన్ లో ప్రాక్టో టాబ్ ను లాంచ్ చేశాం. నెలరోజుల్లోనే 25 మంది అప్పుడే వాడడం మొదలుపెట్టారు.

ప్రస్థానం నేర్పిన పాఠాలు -
"దీర్ఘ కాలప్రణాళిక అవసరం
అనవసరమైన చెత్తను ఆలోచించొద్దు
ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగువేయరాదు (Never never never quit) "

టీం బిల్డింగ్

మంచి టాలెంట్ ఉన్న వారిని ఆకర్షించాలంటే అన్ని విషయాల్లో స్పష్టత ఉండాలి స్పష్టమైన విజన్ ఉండాలి. మా దగ్గర దాగుడు మూతలు ఉండవు. ప్రతి మూడు నెలలకోసారి ప్రాక్టో ఉద్యోగులతో ఓపెన్ హౌస్ ఉంటుంది. ఈ సందర్భంగా గత మూడు నెలల్లో సాధించిన విజయాలను పంచుకోవడంతో పాటుగా రానున్న మూడు నెలల ప్రణాళికల పై చర్చిస్తాం. ఇందులో ఎక్కడా ఎలాంటి దాపరికం ఉండదు. ప్రాక్టో విజయ ప్రస్థానం లో ఉద్యోగులు కీలక భాగస్వాములు. ఇక్కడి వాతావరణం ప్రతి ఉద్యోగీ తన బాధ్యతలను గుర్తెరిగి తన పనిని తాను సొంతం చేసుకునేలా ఉంటుది. ప్రతిఒక్కరు తనకు తానే యజమాని అనుకునేలా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఏ కొంచెం తగ్గకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు సాధించిన విజయాలను ప్రతి ఉద్యోగికి కమ్యూనికేట్ చేస్తాం.

నిధుల సమీకరణలో సూచనలు

శాశాంక్ ఏమంటారంటే .. పెట్టుబడి పెట్టిన వారికి ఎప్పటికప్పుడు మీ ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని సమయం వృధా చేయకుండా ఇస్తున్నారని తెలియాలి. ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలన్నట్లుగా, పెట్టుబడి పెడతామని వచ్చినప్పుడే నిధులు సమకూర్చుకోవాలి కానీ, నిధుల కోసం వెంటపడడం మంచిది కాదు. దీర్ఘకాల ఆలోచనతో ఓ అద్భుతమైన ప్రొడక్ట్ రూపొందించండి.. పెట్టుబడిదార్లే మీ కోసం క్యూ కడ్తారు.

ప్రాక్టొ రోడ్ మ్యాప్

రోగులకు కావలిసిన సమస్త సమాచారాన్ని ఒకే దగ్గర అందుబాటులో ఉంచాలన్నదే ప్రాక్టో లక్ష్యం. డాక్టర్ ఊరు పేరు చిరునామామ వారికి సంబందించిన సమస్త సమాచార సేకరణ, చివరగా ఆన్-లైన్ లో అపాయింట్మెంట్ బుక్ చేయం వరకు అన్ని ఒక గొడుగు కిందికి తీసుకురావాలి. ఈ ప్రస్థానంలో భాగంగా అందుబాటులో ఉన్న అన్ని మాధ్యమాలను వినియోగించుకుంటూ అధిక శాతం మందికి చేరేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయంగా ఎదగాలని బలంగా కోరుకుంటున్నాం. 18 నెలల క్రితం సింగపూర్ మార్కెట్ లో కాలుమోపాం. ఇప్పుడు మార్కెట్ వాటాను బట్టి చూస్తే ఆన్-లైన్ క్లినిక్ మేనేజిమెంట్ లో మేమే నెంబర్ వన్. ఈ సంవత్సరాంతానికి లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో మరో దేశంలో ఎంటర్ కావాలని చూస్తున్నాం .. ఫిలిపిన్స్, కాదంటే మలేషియా లేదా మిడిల్ ఈస్ట్... ఏదైనా కావచ్చును. ప్రస్తుతం దేశంలో ఆరు మహానగరాల్లో ఉన్నాం. త్వరలో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నాం.