అన్నదాత ఆధునిక మండీ ఈ-ఫామ్

మార్కెటింగ్ కష్టాలకు పరిష్కారంరైతుకు,వినియోగదారునికి మధ్య నిజమైన వారధిదళారుల చేతిలో రైతు మోసపోకుండా ఏర్పాట్లుఐఐటి విద్యార్థి వెంకటసుబ్రమణ్యం ఆలోచనతో రైతుకు రొక్కం

0

మనదేశంలోఅధికశాతం జనాభా ఆధారపడుతున్న వ్యవసాయరంగం కష్టాల కొలిమిలోంచి బయటపడలేకపోతున్నది. ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించినా, వాతావరణం, భూసారం వంటి అంశాలకు సంబంధించి ఆధునిక సాంకేతిక సహకారం అందిస్తున్నా అవి అరకొరాగా తప్ప రైతుకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నాయి. ఐఐటి చదివిన వెంకట సుబ్రమణ్యం ఈ విషయంలో మూసకు భిన్నంగా ఆలోచించాడు. తన నైపుణ్యాలను వ్యవసాయరంగానికి అందించాలని అనుకున్నాడు. నమ్మకమైన మార్కెట్ వ్యవస్ధ లేకపొవడమే రైతు దుస్థితికి ప్రధాన కారణమని తెలుసుకున్నాడు. అపుడే ఈ-ఫామ్ కు రూపకల్పన జరిగింది. రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కేలా చేయడమే దీని లక్ష్యం. రైతుల దగ్గర్నుంచి ఉత్పత్తులు సేకరించి చెన్నైలో స్థానిక రెస్టారెంట్లకు సప్లయ్ చేయడంతో మొదలెట్టిన సంస్థ ఇవాళ మరింత విస్తరించి రైతుకు నేస్తంగా మారింది. పటిష్టమైన పంపీణీ వ్యవస్ధ ఎర్పాటు చేయడంద్వారా వారి కష్టానికి తగ్గ ఫలం అందించగలం అంటారు సుబ్రమణ్యం. ఓ వైపు రైతుకు గిట్టుబాటు అయ్యే ధర చెల్లిస్తున్నారు. మరోవైపు తక్కువ ధరకే వినియోగదారునికి విక్రయస్తున్నారు. అయినా లాభాలు మాత్రం తగ్గలేదని చెప్తున్నాడు ఈ ఐఐటియన్....


వెంకట సుబ్రమణ్యం,ఈ ఫార్మ్ వ్యవస్థాపకుడు
వెంకట సుబ్రమణ్యం,ఈ ఫార్మ్ వ్యవస్థాపకుడు

సంస్ధలొ భాగస్ధులైన రైతుల ఉత్పత్తుల వివరాలతొ పాటు, వినియోగదారుల డిమాండ్ కూడా దృష్టిలో వుంచుకుని ఈ-ఫామ్ పనిచేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే...సప్లయ్ డిమాండ్ సూత్రమే. సంప్రదాయ మండీలు 40 కేజీలకు తక్కువ అసలు సప్లయ్ చేయవు. ఈ-ఫామ్ మాత్రం వినియోగదారుని అవసరం మేరకే సరుకు పంపీణీ చేస్తుంది. దీని వల్ల వృధా కాదు. వినియోగదారునికి ఖర్చు తగ్గుతుంది. 2008లో స్ధాపించిన ఈ-ఫామ్ ఐఐఎమ్ కోజికోడ్ వైట్ నైట్ బిజినెస్ ప్లాన్- 2009 అవార్డు సాధించడంతో పాటు....దేశంలో ప్రతిష్టాత్మక సంస్ధలనుంచి పలు ప్రశంసలు అందుకుంది. ఈ -ఫామ్ క్రమంగా ప్రసారమాధ్యమాలనూ ఆకట్టుకుంది.

రైతుల జీవనప్రమాణాలు మెరుగుపరచడానికి ఈ-ఫామ్ చేపట్టిన ప్రత్యేక పద్ధతులను వెంకట సుబ్రమణ్యం ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో వివరించారు.....రైతు తన ఉత్పత్తులను గ్రేడింగ్ చేయకపోతే దళారుల చేతిలో మోసపోయే ప్రమాదం ఎక్కువ. దళారులు నాణ్యమైన సరుకుకు కూడా తక్కువ వెల కడతారని సుబ్రమణ్యం అంటారు. అలాగే రైతులు సరుకు తూచడానికి ప్రామాణిక తూనికలు ఉపయోగించాలని సూచించారు.


రైతులతో వెంకట్ సుబ్రమణ్యం
రైతులతో వెంకట్ సుబ్రమణ్యం

ఈ-ఫామ్ ఈ విషయంలొ రైతులకు తగిన అవగాహన కలిగిస్తొంది. వారికి ప్రామాణికమైన ఆధునిక త్రాసులు అందజేయడంతో పాటు, వారి ఉత్పత్తుల నాణ్యత గుర్తించి గ్రేడింగ్ చేయడం నేర్పింది. అలాగే ..మార్కెట్ పట్ల రైతుకు అవగాహన పెంచుతూ తదనుగుణంగా సాగుపద్ధతులు ఉండేలా పర్యవేక్షణ చేస్తోంది. ఈ-ఫామ్ రూరల్ కలెక్షైన్ కేంద్రాలలో రైతులు అవసరం మేరకు తమ ఉత్పత్తులను అమ్ముకునే సౌలభ్యం ఉంది. భవిష్యత్తులో ఈ- ఫామ్‌తో కలసి ముందుకు సాగడానికి రైతులు సన్నద్ధంగా ఉన్నారు. ఈ- ఫామ్ కేవలం రైతులకే పరిమితం కాలేదు. వికలాంగులకు, మానసిక వికలాంగులకు చేయూతనిస్తోంది. కూరగాయలు తరగడం వంటి పనుల్లో కాల్ సెంటర్లు ఎర్పాటు చేయడం ద్వారా వారికి ఉపాధి కల్పిస్తోంది. ముంబై డబ్బావాలాల స్ఫూర్తితో ఏర్పాటైన ఈ- ఫామ్ తన ప్రయత్నంలో భాగంగా లాభాలను ఆర్జించడంతో పాటు రైతు కష్టానికి తగ్గ ఫలాన్ని అందిస్తోంది.

ఈ ఫామ్ ఎలా పనిచేస్తోందో ఇక్కడ తెలుసుకోండి