నయా జోష్‌లో హైదరాబాద్ స్టార్టప్స్ !!

నయా జోష్‌లో హైదరాబాద్ స్టార్టప్స్ !!

Sunday January 17, 2016,

2 min Read

కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ పాలసీలతో తెలుగు స్టార్టప్ లలో కొత్త జోష్ కనిపిస్తోంది. మూడేళ్ల పాటు ట్యాక్స్ లేకపోవడం అనేది ప్రధాన ఆకర్షణగా మారింది. గతేడాది టీ హబ్ తో ఊపందుకున్న హైదరాబాద్ స్టార్టప్ లు మరింత ఉత్సాహంగా దూసుకుపోతున్నాయి. ఫండింగ్ విషయంలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని అర్హత పొందడానికి తహతహలాడుతున్నాయి. స్థానికంగా ప్రారంభమై గ్లోబల్ మార్కెట్ లో దుమ్మురేపుతున్న ఎన్నో కంపెనీలు ప్రధాని మోడీ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశాయి. కేంద్రం తీసుకున్న పాలసీలు స్టార్టప్ ఈకో సిస్టమ్ కు ఓ బుస్ట్ లాంటిదని స్థానిక స్టార్టప్ గ్రూప్ లు అంటున్నాయి.

image


“పేటెంట్ పై మోడీ అందించిన సాయం మరిన్ని కొత్త ప్రాడక్టులు మార్కెట్ లోకి రాడానికి అవకాశం ఇచ్చింది,” కోటిరెడ్డి సారిపల్లి

కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ఫౌండర్ అయిన కోటి రెడ్డి మోడీ స్టార్టప్ పాలసీ పై తన అభిప్రాయాన్ని ఈరకంగా తెలిపారు. స్టార్టప్ యాక్షన్ ప్లాన్ స్థానికంగా మరిన్ని స్టార్టప్ లు ప్రారంభించడానికి ఊతం ఇచ్చిందన్నారాయన.

గ్రేట్ స్టార్ట్

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్టప్ లకు ఇది గొప్ప ప్రారంభమని రవి కోరుకొండ అంటున్నారు. ప్రధాని చేసిన ప్రసంగం తానకు ఆధ్యంతం ఆసక్తిని కలిగించిందని చెప్పుకొచ్చారు.

“ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈకో సిస్టమ్ ఇక్కడ మొదలైంది,” రవి కోరుకొండ

ప్రధాని ప్రకటన అందరికీ ఆనందాన్నిచ్చింది. ఇప్పటికేప్రారంభం కావల్సి ఉంది. కానీ ఇప్పటికైనా ప్రారంభమైనందుకు తో ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మరిన్ని రాయితీలు వస్తాయని ఆశించినట్లు అంటున్నారాయన. ఇప్పటికే ఈ సిస్టమ్ లో స్థిరపడిన కంపెనీలకు సైతం ప్రభుత్వం రాయితీలిచ్చి ఉంటే మరిన్ని గొప్ప ఫలితాలొచ్చేవని రవి చెప్పుకొచ్చారు. గ్రాస్ రూట్ నుంచి స్టార్టప్ లకు సాయం అందిచాల్సిన అవసరం ఉందనే విషయాన్ని రవి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను అందరికీ అందేలా ప్రచారం చేయడమే కాదు వాటికోసం ప్రత్యేక పాలసీ ప్రకటించాల్సి ఉందని స్థానిక స్టార్టప్ ఫౌండర్లు అంటున్నారు.

image


ఇన్నోవేషన్ ఇండియా విత్ స్టార్టప్

భారతదేశంలో స్టార్టప్ శకం ఎప్పుడో మొదలైందని, ఇప్పటికే బెంగళూరు,హైదరాబాద్ లో స్టార్టప్ సిటీలుగా దూసుకు పోతున్నాయని వీటిని కేంద్ర సహకారం అందితే మరింత ముందుకు దూసుకు పోతాయని స్థానిక స్టార్టప్ కంపెనీలు అంటున్నాయి. బెంగళూరు కంటే హైదరాబాద్ లో ఇన్నోవేషన్ ఎక్కువనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

“ఆంధ్రప్రదేశ్ లో స్టార్టప్ లు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం,” సిద్ధార్ధ్

స్టార్టప్ ఏపి కి కీలక సభ్యుడిగా ఉన్న సిద్ధార్థ్ ఆంధ్రాలో కొత్త స్టార్టప్ లు ప్రారంభం కానున్నాయని, కేంద్రం ఇచ్చిన ప్రొత్సాహంతో వీటికి మరింత బలం చేకూరిందని అంటున్నారు.

“పెట్టుబడులకు ప్రొత్సాహాన్నిచ్చిన పాలసీలను తయారు చేశారు,” సుబ్బరాజు

90 రోజుల్లో స్టార్టప్ ప్రారంభించడానికి క్లియరెన్స్ ఇవ్వాలనే నిర్ణయం తమలాంటి పెట్టుబడి సంస్థలకు ఎంతగానో ఉపయోగ కరమైని స్పార్క్ టెన్ కో ఫౌండర్ సుబ్బరాజు అన్నారు. పేటెంట్ లపై కూడా స్పష్టమైన పాలసీ ప్రకటించడం తమకు రైట్ స్టార్టప్ లో ఇన్వస్ట్ చేయడానికి అవకాశం కల్పించడమే అని అభిప్రాయపడ్డారు.

“మోడీ పాలసీతో ఈ ఏడాని మూడు ఏంజెల్ ఇన్వస్ట్ మెంట్లు, ఆరు స్టార్టప్ లతో తెలుగు రాష్ట్రాలు వెలిగిపోవాలని ఆశిస్తోంది యువర్ స్టోరి”