కిడ్నీ రోగుల పాలిట వరంగా మారుతున్న విజయ్ గంగా

కిడ్నీ ఇబ్బందులను ముందుగానే గుర్తించాలంటున్న డా.సరిత కిడ్నీలు పాడయ్యేవరకూ ఆగకుండా ఇబ్బందుల స్థాయిలోనే గుర్తించాలిపేదలకూ కిడ్నీ సంబంధిత ట్రీట్‌మెంట్ అందుబాటులోకి తెచ్చే యత్నం‘prevention is better than cure’ విజయ్ గంగా స్పెషాలిటీ కేర్

కిడ్నీ రోగుల పాలిట వరంగా మారుతున్న విజయ్ గంగా

Tuesday June 09, 2015,

4 min Read

చెన్నైలో నెలకొల్పిన విజయ్ గంగా స్పెషాలిటీ కేర్.. స్టార్టప్ వైద్యరంగంలో విప్లవం సృష్టిస్తోంది. నెఫ్రాలజీ రంగంలో సేవే లక్ష్యంగా ముందుకి సాగిపోతోంది.

మనదేశంలో వేలాదిమంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఎంతోమంది కిడ్నీ మార్పిడి చేయకపోవడం, చేయలేకపోవడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పదేళ్ళ కెరీర్ అనంతరం ఇలాంటి కిడ్నీ బాధితుల కోసం ఏదైనా చేయాలని భావించారు డా. సరిత దాసరి.

image


కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడేవారు ఎక్కువగా ఉన్నారని డయాబెటిస్ వల్ల ఈ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని ఓ నిర్ధారణకు వచ్చారు డా.సరిత. ప్రివెంటివ్ నెఫ్రాలజీ, పేషెంట్ ఎడ్యుకేషన్, కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించడంపై ఆమె దృష్టిని కేంద్రీకరించారు.

విజయ్ గంగా స్పెషాలిటీ కేర్ అవతరించిన సంగతులను ఓసారి గుర్తు చేసుకున్నారు డా.సరిత తనయుడు సంజయ్ వి.దాసరి. 

సంజయ్ వి. దాసరి

సంజయ్ వి. దాసరి


‘‘బాబ్సన్ కాలేజ్‌లో చదువుతున్నప్పుడు ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలని భావించాను. అన్ని క్లాసుల్లో నావే ర్యాంకులన్నీ. అయితే ఈ విషయం అమ్మదగ్గర ప్రస్తావిస్తే..వేరే స్టార్టప్ ఎందుకు మనమే ఒకటి ప్రారంభిద్దాం అంది. అదే విజయ్ గంగా స్పెషాలిటీ కేర్ నాందిగా మారింది. నాణ్యతతో కూడిన వైద్యసేవలు, నిరుపేదలకు ఆరోగ్య రక్షణ, ప్రతిభ కలవారికి మంచి ఉద్యోగావకాశాలు కల్పించడం మా లక్ష్యంగా మారింది’’ - VGSC ఎండీ సంజయ్.

కిడ్నీ సంబంధిత ఇబ్బందులు త్వరగా డయాగ్నైజ్ కావు, ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కిడ్నీలు పాడైన చాలారోజుల వరకూ ఆ సంగతి రోగులకు తెలియదు. ఇలా కాకుండా కిడ్నీ సంబంధిత ఇబ్బందులను వెంటనే తెలియచేయాలనేది మా అభిమతం అంటుంది హాస్పిటల్ టీమ్. అందుకే తమ VGSC లో అత్యాధునిక డయాగ్నైజ్ ల్యాబ్‌లు అందుబాటులోకి తెచ్చామని, దీంతో త్వరగా డయాగ్నైజ్ అయితే త్వరగా చికిత్స తీసుకోవడం సులువు అవుతుందన్నారు సంజయ్.

తీవ్రమయిన కిడ్నీ వ్యాధులకు డయాలసిస్ ఒక్కటే మార్గం. 2030 నాటికి మనదేశంలో పదికోట్లమందికి డయాలసిస్ అవసరం అవుతుందని ఓ అంచనా. ప్రతీ ఏటా ఇది 30 శాతం పెరుగుతోంది. 2009లో 2 లక్షల 30 వేలమందికి తీవ్రమయిన కిడ్నీ వ్యాధులు సోకితే అందులో 90 శాతంమంది ప్రాణాలు కోల్పోయారని VGSC నిర్వాహకులు చెబుతున్నారు. ఈ పరిస్థితికి కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడమే అంటున్నారు.

image


ప్రారంభంలో చిన్న క్లినిక్‌గా VGSC ని ప్రారంభించారు. క్రమేపీ విస్తరించింది. కిడ్నీ వ్యాధులతో బాధపడేవారికి వివిధ చికిత్సలను అందిస్తోంది. మార్కెట్‌లో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఔట్‌పేషెంట్ కన్సల్టేషన్‌ని విస్తృతం చేశారు. VGSC లో వైద్యసేవలతో పాటు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఇంటర్ ప్లస్ గ్రాడ్యుయేట్లకు డయాలసిస్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇస్తున్నారు.

తమ దగ్గర ట్రైనింగ్ పూర్తిచేసుకున్నవారికి ప్రపంచంలోనే నెప్రాలజీలో పేరున్న BONENT సంస్థ సర్టిఫికెట్లు అందిస్తోందంటారు సంజయ్. దీంతో పాటు మా కంపెనీ ద్వారా స్పోకెన్ ఇంగ్లీషు కోర్సులు అందించి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తున్నామంటున్నారు.

తక్కువ ఖర్చుతో కిడ్నీ వ్యాధులకు చికిత్స అందించడం ఇప్పుడు బాగా డిమాండ్‌తో కూడుకున్నది. ఇలాంటి సర్వీస్ చేస్తున్నవారు మనదేశంలో చాలా తక్కువగా ఉన్నారు. మరో వైపు డయాలసిస్ అనేది బాగా ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. డయాలసిస్ అందించేందుకు ఇప్పుడు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. విజయ్ గంగా స్పెషాలిటీ కేర్‌లో ట్రైనింగ్ పూర్తిచేసుకున్న వారు BONENT ద్వారా ఎన్నో చోట్ల ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతున్నారు.

డా. సరిత

డా. సరిత


‘prevention is better than cure’ అనడం మనం వింటుంటాం. చికిత్స కంటే ముందు జాగ్రత్త ముఖ్యం అనేది డాక్టర్లు చెబుతారు. కిడ్నీ వ్యాధులు వచ్చాక దానికి చికిత్స తీసుకోవడం కంటే ముందు జాగ్రత్త చర్య అవసరం అని అందరిని చైతన్య పరుస్తున్నారు. 

‘‘కిడ్నీ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏంచేయాలో మా రోగులందరికీ తెలియచేస్తున్నాం. ఆరోగ్య నియమాలు, మంచినీళ్ళు తాగడం, యోగా, ఫిజియోథెరపీ, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. మూత్ర విసర్జన చేయాలనుకున్నప్పుడు వెంటనే ఆ పని కానిచ్చేయ్యాలని.. లేదంటే కిడ్నీలపై వత్తిడి పెరిగి వ్యాధులు వస్తాయని రోగులకు వివరిస్తున్నాం’’ అన్నారు VGSC ఎండీ సంజయ్.

‘‘దిగువ మధ్యతరగతి ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఎక్కువగా గురవుతున్నారు. వారికి సరైన డయాలసిస్ సౌకర్యం అందించేందుకు మంచి నైపుణ్యం కలిగిన నిపుణుల్ని తయారుచేస్తున్నాం. వారి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటుచేయడం, కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. భారతదేశంలో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం డయాలసిస్ టెక్నీషియన్ కోర్సులను అందిస్తున్నాం’’ అంటున్నారు డాక్టర్ సరిత.

VGSC లో ఇప్పుడు ఎంతోమంది ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. డాక్టర్ సరిత, సంజయ్ బాబ్సన్ కాలేజ్ నుంచి entrepreneurshipలో బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తిచేశారు. వీరితో పాటు అపోలో హాస్పిటల్స్ Intensive Care Unit కి చెందిన డాక్టర్ కృష్ణమూర్తి, ఇంగ్లండ్‌లో పనిచేసిన డా.శివలింగం సభ్యులుగా ఉన్నారు. వీరంతా కలిసి Train4Life ద్వారా VGSCలో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు.

VGSC లో డాక్టర్ కర్పగం చేరారు. ఈయన American Board certified Physiotherapist. డయాబెటిస్ రోగులు తీవ్రమయిన యూరినరీ ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా చికిత్స అందిస్తున్నారు. అతి మూత్ర వ్యాధితో డయాబెటిస్ పేషెంట్లు ఇంటినుంచీ బయటకు రావడానికే జంకుతారు. అలాంటివారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలుగుతున్నాం అంటున్నారు డాక్టర్ సరిత. ఇలాంటి వాటి వల్ల వారి జీవనప్రమాణం పెరగడం ఖాయం అంటున్నారు.

image


Train4Life కి సంబంధించి మొట్టమొదటిసారిగా న్యూస్‌పేపర్లో యాడ్ ఇచ్చాం. ఆ యాడ్‌కి విపరీతమయిన స్పందన వచ్చింది. అంకితభావంతో పనిచేసే డాక్టర్ల బృందం మా ప్లస్ పాయింట్. కిడ్నీ రోగుల అవసరాలు తీర్చడం, వారికి ఇబ్బంది కలగకుండా ట్రీట్‌మెంట్ ఇస్తున్నాం. అంతేకాకుండా ప్రజల సపోర్టు, రోగులు, వారి బంధువుల ఫీడ్‌బ్యాక్ మాకెంతో సంతృప్తి నిస్తోందంటున్నారు సంజయ్.

‘‘కష్టపడి పనిచేయడం, అంకితభావం, పరిస్థితులపై అవగాహన ఉండడం వల్ల మా స్టార్టప్ కంపెనీ బాగా సక్సెస్ అయింది. Train4Life, VGSC ల ద్వారా సమాజానికి ఏమైనా చేయాలని భావిస్తున్నాం. మాది పరోపకార భావన కలిగిన కుటుంబం. మేం లాభాల గురించి ఆలోచించడం లేదు. ఎంతోమంది నిరుపేదలకు VGSC ద్వారా ఉచితంగా డయాలసిస్ అందిస్తున్నాం. రాబోయే తరంవారు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. జనంలో అవగాహన కల్పించడం మా కర్తవ్యం. ఈ రంగంలో అత్యాధునిక పరికరాలు, ఉపాధిని పెంచే మార్గాలను అన్వేషిస్తున్నాం’’ అంటున్నారు సంజయ్.