అద్భుతమైన డీల్స్ కోసం డీల్ జోన్‌ని విజిట్ చేయండి

0

ఈ-కామర్స్ వ్యాపారం అంతే అంత ఆషామాషీ కాదని చెప్పే కథ ఇది. ఒకసారి వెనకడుగేసి కాంపిటీషన్‌లో గెలుపొందింది ఈ డీల్ జోన్. ఆ తర్వాత గెట్ ఇట్ లోకల్ పేరుతో మరో స్టార్టప్ మొదలు పెట్టారు ఫౌండర్లు. ప్రాచుర్యం పొందిన ఈకామర్స్ స్టోరీలతో స్ఫూర్తి పొందిన ఫౌండర్లు ఇప్పుడు సక్సస్ బాట పట్టారు.

“ 2013లో మేం సాధించలేనిది 2015లో సాధించగలిగాం. హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాల్లో స్థానికంగా లభించే డీల్స్‌ని మేం ఆన్‌లైన్ కస్టమర్ల ముందుకు తీసుకొచ్చాం ” - ఫౌండర్ గౌరీ శంకర్

ఆన్‌లైన్‌లో ఆఫర్ కనిపిస్తుంది. అది బుక్ చేసే లోపే మారిపోవడమనే అనుభవం బహుశా కస్టమర్లకు ఒకసారైనా ఎదురై ఉండొచ్చు. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదురు కాకూడదనే ఉద్దేశంతో మొదలు పెట్టిందే గెట్ ఇట్ లోకల్. స్థానిక షాపులకు సంబంధించిన డీల్స్ ఇందులో ఉంటాయి. డీల్‌కి సంబంధించి పూర్తి హక్కుదారుడు అటు షాప్ కీపర్, ఇటు కస్టమర్ మాత్రమే. షాప్‌లో అందుబాటులో ఉన్న ధర, ఆ యజమాని కొనుగోలుదారుడికి ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్ వివరాలు మాత్రమే సైట్లో ఉంటాయి. ఇక అదే బెస్ట్ ప్రైజ్. కస్టమర్లను తెచ్చినందుకు ఆ షాపు యజమానికి వచ్చిన లాభం నుంచి వీళ్లకు కొంత వాటా అందుతుంది. వెరీ సింపుల్ ఫార్ములా.

కస్టమర్ బెనిఫిట్స్

1. సాధారణంగా ఆన్‌లైన్ వస్తువులకు వారంటీ, గ్యారంటీకి సంబంధించిన ఇష్యూస్ ఎదురవుతూ ఉంటాయి. వాటికి పరిష్కార మార్గంగా గెట్ ఇట్ లోకల్ ఉపయోగపడుతుంది. దీంతో పాటు కొన్న వస్తువుకి నూటికి నూరుశాతం వారంటీ వర్తించేలా షాప్ దగ్గరి నుంచి అగ్రిమెంట్ తీసుకోవడంతో ఇది వినియోగదారుడికి ప్రయోజనకరంగా ఉంటుంది.

2. డెలివరీవిషయంలో కూడా కస్టమర్లకు ఎంతో ఉపయుక్తం. లోకల్ ప్రాడక్టులనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తారు. దీని వల్ల సరైన సమయానికే సరుకులు కస్టమర్‌ చెంతకు చేరుతాయి. ఒక వేళ తర్వగా ప్రొడక్ట్ కావాలనుకుంటే నెట్‌లో బుక్ చేసుకుని.. నేరుగా షాపు దగ్గరికే వెళ్లి డెలివరీ తీసుకోవచ్చు. 

3. ధర విషయంలో కూడా ఎలాంటి మార్పూ ఉండదు. ఎందుకంటే ప్రైజ్ ఫిక్స్ అయిన తర్వాతే సైట్లో పెడ్తారు. ట్యాక్స్‌తో కలిపిన ధరను నిర్ణయించి , అవసరం అనుకుంటే డెలివరీ చార్జీలను కూడా చేర్చి రేటును వెల్లడిస్తారు.

టీం

మొత్తం టీంలో నలుగురు సభ్యులున్నారు. గౌరిశంకర్ సంస్థ ఫౌండర్‌గా వ్యావహరిస్తున్నారు. ఆయనే ఆపరేషన్స్ చూస్తున్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ వ్యవహారాలు చూసేందుకు టీం ఉంది. ఉద్యోగుల సంఖ్య చిన్నదే అయినప్పటికీ పూర్తి స్థాయి అనుభవం ఉండటంతో స్టార్టప్ వ్యవహారాలన్నీ సాఫీగా సాగిపోతున్నాయి.

సవాళ్లు

ఈ-కామర్స్ బిజినెస్‌లో ఎంతో మంది పోటీపడుతున్నారు. ఆన్‌లైన్ సేల్స్‌తో పాటు ఆఫ్‌లైన్ డీల్స్‌లో అంతా దూసుకుపోతున్నారు. అంతా డీల్స్ ఇచ్చి కస్టమర్లను ఎట్రాక్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ డీల్స్ విషయంలో గెట్ ఇట్ లోకల్ కి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉండదు. స్టోర్స్ ఇచ్చే డీల్స్ తప్పితే ప్రత్యేకంగా కస్టమర్లను ఆకట్టుకునే ఛాన్సులు తక్కువే. అయితే గ్యారంటీ, వ్యారంటీలు ఇచ్చే వెసులుబాటు ఉండటం ప్లస్ పాయింట్. ఇప్పటి వరకూ అయితే కస్టమర్ల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉందని టీం చెబ్తోంది. కస్టమర్ బేస్‌ని పెంచుకోవడం తప్పితే మరో మార్గం లేందంటారు గౌరీశంకర్.

భవిష్యత్ ప్రణాళికలు

ప్రస్తుతానికి పూర్తి బూట్ స్ట్రాప్డ్ కంపెనీ అయిన గెట్ ఇట్ లోకల్ ఫండింగ్ కోసం ఎదురు చూస్తోంది. సీడ్ ఫండింగ్ ఇస్తే హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు డీల్స్ లను విస్తరించాలని చూస్తున్నారు. హైదరాబాద్ తోపాటు దక్షిణాది నగరాలకు సేవలను విస్తిరించాలని చూస్తున్నారు. ఈ మోడల్ బిజినెస్ లో గెట్ ఇట్ లోకల్ అనేది ముందుగా ప్రవేశించిన స్టార్టప్. అవకాశాలు కూడా అందిపుచ్చుకోడానికి సిద్ధంగా ఉందంటున్నారు ఫౌండర్లు.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik