ఆఫీసులకు పేపర్ ఫ్రీ పరిష్కారం ‘డాక్యువిటీ’ సొంతం

డాక్యుమెంట్ల స్టోరేజ్ సమస్యలను తీరుస్తున్న ‘డాక్యువిటీ’లక్షల్లో ఉండే కంపెనీ డాక్యుమెంట్లను సైతం డిజిటైజ్ చేసే ప్రక్రియ డిజిటైజేషన్ కు పెరుగుతున్న డిమాండ్.

0

అధికారిక పేపర్లతో పాటు ముఖ్యమైన డాక్యుమెంట్లను మేనేజ్ చేయడంమంటే సామాన్య విషయం కాదు. ఇటువంటి పరిస్ధితులు ఎదురైన సమయంలో పేపర్ డాక్యుమెంట్లకు కూడా సెర్చ్ చేయడానికి ‘కంట్రోల్ ఎఫ్’ ఉంటే ఎంత బాగుంటుందో అని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది.

ఇలాంటి సమస్యను ఎదుర్కోవడానికి డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేయడం, స్టోర్ చేసే ప్రక్రియను కనుగొన్నారు ‘డాక్యువిటీ’ వ్యవస్ధాపకులు నిఖిల్ యతిరాజ్, తేజన్ టింబ్లో, రోహన్ టింబ్లో. ఈ సర్వీస్ ద్వారా ఎవరైన సరే తమ డాక్యుమెంట్స్‌ను స్టోర్ చేయడం, అవసరమున్నప్పుడు తీసుకోవడం వంటి పనులు ఎంతో సులువుగా చేయొచ్చు. ఆఫిస్ పని తీరును బట్టి ఆఫీస్ పరిసరాల్లోనే డిజిటలైజ్ చేస్తుంది ‘డాక్యువిటి’.

పేపర్ వర్క్ ను తగ్గించి, సులువుగా జరగాల్సిన పనికి ఫైళ్లన్ని వెతుక్కునే పని ఉండకూడదనే ఉద్దేశంతో ప్రారంభమైన ‘డాక్యువిటి’. క్లైంట్స్‌తో తమ అవసరాలను బట్టి ఏ డాక్యుమెంట్లను డిజిటలైజ్ చేయాలో కనుక్కుని వాటిని క్లౌడ్ లేదా హోస్ట్ కంపెనీలో ఆ డేటా మొత్తాన్ని సేవ్ చేస్తారు.

ఇక డిజిటైజ్ చేయాల్సిన డాక్యుమెంట్ల సంఖ్యతో పాటు వాటిని స్టోర్ చేసే ప్రదేశాన్ని బట్టి బిజినెస్ ఉంటుందని అంటున్నారు నిఖిల్.

రెండు విధాలుగా పని చేసే డాక్యువిటీ, తమ సొంత సర్వర్ రూమ్‌ని ఏర్పాటు చేసుకోవడం, లేదా క్లౌడ్ పై పని చేస్తుంది. క్లౌడ్ విధానంలో అయితే తక్కువ ఖర్చుతో పాటు నిర్వాహణా సమస్యలు కూడా ఉండవు.

“డిజిటైజేషన్ సర్వీస్ అంతా కూడా పేజ్‌ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతీ పేజ్‌ని స్కానింగ్ చేయడంతో పాటు వాటిని నేమింగ్ చేయడం, డాటా ఎంట్రీ ప్రక్రియ ఉంటుంది. ఈ సంఖ్య లక్షల్లో ఉండటంతో ప్రతీ పని బాధ్యతాయుతంగా చేయాలి”- నిఖిల్.

ఈ సర్విసులతో పాటు ‘టీ-కనెక్ట్’ అనే సాఫ్ట్‌వేర్‌ను కూడా ప్రారంభించారు. ఈ సాఫ్ట్‌వేర్ టాలీ అకౌంటింగ్‌తో అనుసంధానమై ఉంటుంది. సాధారణంగా ప్రతీ కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో కీలకమైన డాక్యుమెంట్లు ఉంటాయి. అలాంటి శాఖలకు ఈ సాఫ్ట్‌వేర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇక ప్రతీ ఏటా 35 శాతం ఎదుగుదల ఉందంటోన్న నిర్వహకులు, చిన్న స్ధాయి మరియు మధ్య తరగతి పరిశ్రమల మార్కెట్‌నే టార్గెట్ చేసుకున్నట్టు చెబ్తున్నారు.

ఇలాంటి సేవల్లో కూడా పోటీతత్వం పెరుగుతున్నప్పటికీ, ‘డాక్యువిటీ’ లాంటి డిజిటైజేషన్ సర్విసులకు పెద్ద సంఖ్యలో డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ భవిష్యత్తులో మరిన్ని స్టార్టప్స్ స్ధాపించడానికి అవకాశాలు కల్పిస్తుంది.

Sr. Correspondent @ yourstory.com

Related Stories

Stories by ABDUL SAMAD