ఈ సుభద్రకు పాటే మంత్రం

సంగీతమే జీవితం.. సంగీతమంటే ప్రాణంహిందుస్తానీలో 'మణి-మన్ ఫెలోషిప్' అందుకున్న మొదటి వ్యక్తిగా రికార్డుహార్వర్డ్‌లోయెబ్ లైబ్రరీలో సుభద్ర రాసి,పాడిన 'వాల్మీకి రామాయణం మ్యూజిక్'

ఈ సుభద్రకు పాటే మంత్రం

Friday June 12, 2015,

4 min Read

సంగీతానికి భాష లేదంటారు. సంగీత సాధన అంటే అదో నిరంతర అధ్యాయం. స్టేజ్‌పై గాయకులు పాటలు పాడుతుంటే .. వీనుల విందైన దాన్ని వింటూ జనం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ ఉంటారు. అందుకే సమాజంలో గాయకులకు ఉన్నంత గౌరవం అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు రాగాలను సానపెడితేకానీ ఎల్లకాలం గాయకులుగా కొనసాగలేరు. దశాబ్దాలకాలం సంగీత ప్రపంచాన్ని ఏలడం అంటే సాధారణ విషయమైతే కాదు. అలాంటి గాయనీ కథే ఇది. ఆమె జీవితం సంగీతానికి అంకితం. చిన్నప్పుడు చిట్టిపొట్టి మాటలతో సరదాగా నేర్చుకున్న సంగీత పాఠాలు ఆమె జీవిత గమనాన్నే మార్చేశాయి. తనకి సంగీతం అపారమైన గౌరవం, గుర్తింపుని తెచ్చి పెట్టిందని సుభద్ర దేశాయ్ నమ్ముతారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని విశ్వసించే వారిలో సుభద్ర ముందుంటారు. అదే మనం ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుకునేలా చేసింది. 

పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణిలో జన్మించిన సుభద్ర దేశాయ్ తండ్రి ఉద్యోగరరీత్యా ఢిల్లీకి చేరుకున్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంగీతంతో ఉన్న సంబంధం ఆమెను ప్రొఫెషనల్ సింగర్‌గా మార్చేసింది. ఇంట్లో అందరికి సంగీతంలో ప్రావీణ్యం ఉండడంతో, యాదృఛ్చికంగానే దానిపై ఆసక్తి పెరిగింది. చిన్ననాటి నుంచే ఆమె ప్రఖ్యాత హిందుస్థానీ శాస్త్రీయ సంగీతకారుడు వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఇంట్లో అందరికీ అవగాహన ఉండడంతో సంగీతం.. విడదీయరాని బంధంగా మారింది. అయితే నేర్చుకోవడంతో పాటు ప్రముఖ సంగీత కచేరీలు వింటూ, సాధన, బోధన, పరిశోధనలు కూడా చేస్తూ వచ్చారు. తన పాటలకు జనం కొట్టే జయజయ ధ్వానాలు ఆమెను పూర్తి స్థాయి గాయనిగా మార్చేశాయి. తన సంగీతానికి లభిస్తున్న ఆదరణ చివరకు ఉద్యోగాన్నీ త్యాగం చేసేలా చేసింది. ఢిల్లీలోని ఓ ప్రఖ్యాత కాలేజీలో సంస్కృతం లెక్చరర్ ఉద్యోగం వదిలేసి పూర్తి సంగీత సాధనకు మరలిపోయారు సుభద్ర.

సుభద్ర దేశాయ్

సుభద్ర దేశాయ్


సుభద్ర తల్లి వృత్తిరీత్యా లెక్చరర్ , గాయని. తండ్రి ఇంజనీరు, కానీ ఆయన చిన్నప్పుడు Israj వాడేవారు. Israj, వయోలిన్, ఆర్గాన్ వంటి సంగీత పరికరాలపై మంచి పట్టుంది. ఇంకా మేనత్త, మేనమామలకు సంగీతంలో ప్రావీణ్యం ఉంది. ఇలా కుటుంబం అంతా సంగీతంతో మమేకమై పోయి ఉండేది. కానీ ఆ రోజుల్లో సంగీతాన్ని ఎవ్వరూ ఓ వృత్తి గా తీసుకోలేదని సుభద్ర చెబుతారు.

సంగీత సముద్రంలోకి చిట్టిపొట్టి అడుగులు

సుభద్ర దేశాయ్ సంగీత జర్నీ ఐదేళ్ల వయసునుంచే మొదలైంది. బెంగాలీ కుటుంబం కావడంతో, ఢిల్లీలో ఓ స్థానిక మ్యూజిక్ టీచర్ దగ్గర చేర్పించారు. తర్వాత దగ్గరలోని ఓ సంగీత కళాశాలలో చేరారు. అప్పటి నుంచి ఆమెకు పాటే ప్రాణమైంది. వెంటనే ఢిల్లీలోని గాంధర్వ మహావిద్యాలయ ఫౌండర్ ప్రిన్సిపాల్, పండిట్ వినయ చంద్ర ముద్గాల్య, పద్మ దేవీల మార్గదర్శకత్వంలో శిక్షణ కొనసాగింది. అక్కడి శిక్షణ గురించి ఇలా చెబుతారు..

'' గురు పండిట్ ముద్గల్ ఎల్లప్పుడూ శిక్షణ ఇచ్చే విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. దాని వల్ల శిక్షణలో పరిపూర్ణత వస్తుంది. నేను ఎనిమిది సంవత్సరాల పాటు అక్కడ చాలా నేర్చుకున్నా. చాలా ఏళ్ల పాటు ప్రొఫెషనల్‌గా సంగీతాన్ని నేర్చుకున్నాను. ఇప్పటికీ నా అవగాహన, నైపుణ్యాలను మెరుగుపర్చడానికి ఆయన మార్గదర్శకత్వం ఉపయోగపడింది."
అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ తో సుభద్ర

అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ తో సుభద్ర


ఆ తర్వాత సుభద్ర జాతీయ ఫెలోషిప్‌లో భాగంగా విదూషిమాలిని దగ్గర శిక్షణ తీసుకున్నారు. తాన్‌పూరా, శ్రవాస్ వంటి కఠినమైన రాగాలు నేర్చుకోవడంతో ప్రావీణ్యం పెరిగింది. సంగీతంలో ఉత్తమమైన హిందుస్తానీ శాస్త్రీయ గాత్ర సంగీతంలో 'మణి-మన్ ఫెలోషిప్' అందుకున్న మొదటి వ్యక్తిగా సుభద్ర రికార్డు సాధించారు. గురు పండిట్ ముద్గల్, విదూషి మాలినిల వద్ద శిక్షణే తనను ఈ స్థాయికి తెచ్చిందని సుభద్ర నమ్రతతో చెబుతారు. ఢిల్లీలో ఏ ప్రతిష్టాత్మక పండుగలు నిర్వహిస్తున్నా...సుభద్ర దేశాయ్ సంగీత కచేరి ఉండాల్సిందే. దేశాయ్ కచేరిలు భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఇతర సీనియర్ ఉన్నతాధికారుల ముందు తీన్ మూర్తి భవన్‌లో నిర్వహించారు. దలైలామా ఢిల్లీలో పర్యటించినప్పుడు నెహ్రూ పార్క్ వద్ద భక్తి ఉత్సవ్‌లో ఆమె కచేరి అందరిని మంత్ర ముగ్ధులను చేసింది. అంతే కాదు దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, ద్వారకా లతో పాటు జర్మన్ బెర్లిన్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ DCలలో కచేరీలు జయప్రదంగా కొనసాగాయి. 2008 లో సుభద్ర దేశాయ్ గానం చేసిన 'వాల్మీకి రామాయణం మ్యూజిక్' మొదటి ఆల్బమ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో లోయెబ్ గ్రంథాలయంలో ఉంచారు. ఈ పుస్తకాన్ని అప్పటి ప్రధాని డాక్టర్ కరణ్ సింగ్, శాస్త్రీయ పండితుడైన కాశ్మీర్ మాజీ రాజు విడుదల చేశారు.

కుటుంబమే కారణం

తన కెరీర్ ఎదుగుదలకు కుటుంబం ఎంతో సహకరించిందని చెప్పే సుభద్ర ఇదంతా తన అదృష్టమని అంటారు. "నా భర్త ఎప్పుడూ వెన్నంటే ఉండి ప్రోత్సహించేవారు, మనస్సులో ఉన్న ఆలోచనలు కార్యారూపం పెట్టాలన్నా, సంగీత ప్రదర్శన, పరిశోధన పనులకు భర్త, అత్తమామలు సహకరించేవారు” అని ఆనందంతో వివరించారు. దాని వల్లే సంగీతాన్ని ప్రొఫెషనల్‌గా మార్చుకోగలిగారట.

మార్గదర్శిగా.. సుభద్ర

సంగీతంతో పాటు ''భారత దేశ సంస్కృతి- వారసత్వం'' పై రీసెర్చ్ చేస్తూ.. రెండింటికి మధ్య సమతౌల్యం పాటించేవారు. ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్ట్స్ ఆధ్వర్యంలో మహిళలు, బుషుల అంతర్భావాలపై పరిశోధనలు చేస్తూ రచించిన పుస్తకం ఈ ఏడాది విడుదలైంది. " ఆధ్యాత్మిక నిబంధనలను పక్కన పెట్టి, పాటల ద్వారా భావాలు వ్యక్తం చేసే విధంగా రచనలు కొనసాగాయి. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ, హిందీ, మార్వాడి, ఒరియా, కాశ్మీరీ తో పాటు ఇతర భాషల్లోని పాటలను వారి మాతృభాషలోనూ రచించారు. శక్తివంతమైన, వీరోచిత పాటలు మహిళల్లో ప్రేరణ రావడంతో తనకు ఎంతో ఆనందం కల్గిందని చెప్పారు.

కచేరి ఇస్తున్న సుభద్ర దేశాయ్

కచేరి ఇస్తున్న సుభద్ర దేశాయ్


ఈ తరం కోసం..

శాస్త్రీయ సంగీతం నుంచి కళల సాధన వరకు గొప్ప గురువులు దగ్గర శిక్షణ పొందాలని ఆమె సూచిస్తారు. కళారూపం,సాధన, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే సాధ్యమవుతుంది. ప్రస్తుత కాలంలో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవడానికి అవకాశాలు వస్తున్నాయి. ప్రజలు శాస్త్రీయ సంగీతాన్ని వృత్తిగా ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు నెమ్మదిగా కచేరీలు స్పాన్సర్ చేస్తున్నాయి . అయితే కళాకారులకు ఫిక్సిడ్ శాలరీ ఉండాలని సుభద్ర దేశాయ్ అంటారు. అప్పుడే యంగర్ జనరేషన్ ఆసక్తి చూపిస్తుంది. ఇక తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.