రిటైలర్ల ఖర్చుపై కన్నేసే వినూత్నసాఫ్ట్‌వేర్ 'డిస్కవల్ డాలర్'

రిటైలర్ల ఖర్చుపై కన్నేసే వినూత్నసాఫ్ట్‌వేర్ 'డిస్కవల్ డాలర్'

Saturday May 02, 2015,

3 min Read

చెల్లింపుల్లో ఇబ్బందులకు పరిష్కారం.

ఒక శాతం చొప్పున నష్టపోతున్న రిటైల్ రంగం.

రియల్ టైంలో అదనపు చెల్లింపులపై హెచ్చరికలు .

ఈమెయిల్స్, కాంట్రాక్ట్స్, పేమెంట్స్, పర్చేజ్ ఆర్డర్లను విశ్లేషించే టెక్నాలజీ.


రిటైలర్లు ఎదుర్కునే సమస్యకు పరిష్కారం చూపుతున్నారో టీం. చాలా మంది రిటైల్ వ్యాపారులు తమ సప్లయర్లకు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువగా చెల్లింపు చేస్తుంటారు. ఆయా లావాదేవీల్లో ఉన్న సంక్లిష్టత, సమాచార లోపం, మానవ తప్పిదాలు వంటి కారణంగా చెల్లింపులు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంటూంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ బిలియన్ డాలర్లకు ఒక మిలియన్ డాలర్లు ఇలా అదనంగా కట్టేస్తుంటారని అంచనా. అంటే ఇంత మొత్తాన్ని రిటైల్ వ్యాపారులు నష్టపోతున్నట్లే లెక్క. డిస్కవర్ డాలర్ అనే సంస్థ ఇందుకు తగిన పరిష్కారాన్ని కనిపెట్టింది. ఇలా నష్టపోయే మొత్తాలను రియల్ టైంలోనే పసిగట్టేలా ఒక సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేసింది. ఈమెయిల్స్, కాంట్రాక్ట్ పేపర్స్, పేమెంట్స్, పర్చేజ్ ఆర్డర్స్‌ను పరిశీలించి.... అదనంగా చెల్లిస్తున్న సమయంలో హెచ్చరించేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశారు డెవలపర్లు.

image


నష్టాలు తగ్గిస్తే లాభాలొచ్చినట్లే

సుబ్రమణ్యరావు, ప్రవీణ్‌లు డిస్కవర్ డాలర్ టెక్నాలజీస్‌ను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్ట్ ఇంకా స్టార్టప్ స్థాయిలోనే ఉంది. ఈ తరహా అదనపు చెల్లింపుల కారణంగా నష్టపోతున్న మార్కెట్ విలువ చాలా ఉందంటారు వీళ్లు. "ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఇలా నష్టపోతున్న మొత్తం 10 బిలియన్ యూఎస్ డాలర్లకు పైగానే. అంటే మన కరెన్సీలో 65 వేల కోట్ల రూపాయలు. అది కూడా సంస్థాగత వ్యాపారంలో మాత్రమే. అవ్యవస్థీకృత రంగాన్ని కూడా కలిపితే ఈ మొత్తం భారీగా పెరిగిపోతుంది. అయితే... వాటిని విశ్లేషించడం కష్టం. ఫార్మా రిటైలర్లు, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, ఈ కామర్స్, నిర్మాణ రంగంలోని వ్యాపారులే మా కస్టమర్లు. ఉత్తర అమెరికా, దక్షిణాసియా, యూరోప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో విస్తరించడానికి ప్రాధన్యమిస్తాం. మిగతా దేశాల్లో దశలవారీగా విస్తరిస్తామం"టారు డిస్కవర్ డాలర్ టీం.

image


రిటైల్ ఇండస్ట్రీకే మొత్తం నష్టమంతా

లీకేజీల కారణంగా, పేమెంట్లు ఎక్కువగా ఉండడంతోనూ... భారీగా నష్టపోతోంది రిటైల్ ఇండస్ట్రీనే అని ఒక సర్వే చెబ్తోంది. ఆయా సంస్థల్లోని మేనేజర్లకు, అకౌంట్స్ నిర్వహించేవాళ్లకు ఈ చెల్లింపులు పక్కలో బల్లెంగా చెప్పచ్చు. మార్జిన్లు తగ్గిపోవడానికి కూడా ఇదే కారణం. వీటన్నిటికీ సాంకేతిక పరిష్కారం చూపుతామంటోంది డిస్కవర్ డాలర్. చెల్లింపుల సమయంలోనే హెచ్చరికలు అందడంతో.. పేమెంట్లు తగ్గుతాయని చెబుతోంది. ఒకవేళ అప్పటికే పేమెంట్స్ కట్టేసి ఉంటే... వాటిని ఆలస్యమయ్యే కొద్దీ రికవర్ చేసుకోవడం చాలా కష్టం. ఒకవేళ ఆడిటింగ్ కూడా పూర్తయ్యాక గుర్తిస్తే ఇక వాటిని రాబట్టుకోవడం అసాధ్యమే చెప్పాలి. రికవరీ కోసం ఆడిట్లను నిర్వహించి, వారికి చేసే చెల్లింపులతో పోల్చితే... ఈ డిస్కవర్ డాలర్‌కు చేసే పేమెంట్స్ చాలా చాలా తక్కువ.


వేటిని నిర్వహించొచ్చు

కంపెనీల అకౌంట్ల విషయంలో ఇంత లోతైన విశ్లేషణ చేయగలిగినపుడు.. లాభాల స్థాయి కూడా గణనీయంగా పెరుగుతుంది. సంస్థ అభివృద్ధి కూడా వేగాన్ని పుంజుకుంటుంది. లావాదేవీల నిర్వహణను సులభతరం చేయడమే ఈ సంస్థ ప్రధానోద్దేశ్యం. విక్రేతల లాభదాయకత. ఆయా విభాగాల్లో మార్జిన్లు, అమ్మకందారుల నిర్వహణ, లాభనష్టాల ఖాతా, లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి, మార్జిన్లు తగ్గడంపై విశ్లేషణ, తిరిగి రాబట్టుకోగల అవకాశమున్న పద్దుల వంటి వాటిని సంపూర్తిగా విశ్లేషిందుకు... ఈ టెక్నాలజీ సహాయపడనుంది.

''టాప్  5 మోస్ట్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ '' అవార్డును శాప్, ఫ్లోరిడా నుంచి అందుకున్న సిఈఓ సుబ్రమణ్య రావు

''టాప్ 5 మోస్ట్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ '' అవార్డును శాప్, ఫ్లోరిడా నుంచి అందుకున్న సిఈఓ సుబ్రమణ్య రావు


లాభాలు పెంచేందుకు టెక్నాలజీ

ఎక్కువ మొత్తంలో చెల్లింపులు జరపకుండా రిటైలర్లకు డిస్కవర్ డాలర్ సహాయపడుతుంది. అలాగే వారు మిస్సయిన డిస్కౌంట్లు ఏమైనా ఉంటే వాటి వివరాలు కూడా అందిస్తుంది. విక్రేతల నుంచి రావాల్సిన మొత్తం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇస్తుంది. అందుబాటులో ఉన్న గణాంకాలన్నిటినీ డేటాబేస్ కింద మార్చుకుని... అత్యంత సమర్ధంగా విశ్లేషించేలా డిస్కవర్ డాలర్ టెక్నాలజీని రూపొందించామంటున్నారు సంస్థ వర్గాలు. అలాగే ఆయా గణాంకాలకు సంబంధించిన హెచ్చరికలను... ఆ సంస్థలో ఏ వ్యక్తికి అందించాలో కూడా దీనిలో ప్రోగ్రామింగ్ చేసి ఉంటుంది. అంటే.. ఎటువంటి అదనపు చెల్లింపులు చేసే అస్కారం ఉండదు. ఒకవేళ ఏవైనా చేసినా... వాటిపై వెంటనే హెచ్చరికలుంటాయి కాబట్టి... సమర్ధంగా రాబట్టుకోవచ్చు. దీని ద్వారా ఆయా కార్పొరేట్లకు, రిటైలర్లకు లాభదాయకత పెంచడం కోసమే ఈ డాలర్ టెక్నాలజీస్ అంటోందీ డాలర్ టెక్నాలజీస్.