సామాజిక సేవతో కలిగే ప్రయోజనాన్ని ఎలా లెక్కించాలి ?

డాక్టర్ పృధివీ పాఠక్, జో స్లాగ్‌ల పరిశీలనఆలోచింపజేసే కథనం

0

సామాజిక ప్రభావాన్ని అంచనా వెయ్యడం అనేది పలు వ్యాపార సంస్థల మధ్య నిరంతరం చర్చలోకి వచ్చే విషయమే ! అయితే ఎలా చెయ్యాలి అనే దాని మీద స్పష్టత ఎవ్వరికీ లేదనే చెప్పాలి. అంటే కనీసం ఏ రకమైన, అర్ధవంతమయిన పరిశోధనా విధానంలో చేస్తే ఆయా సంస్థలకి, వాటాదారులకి, లబ్ధిదారులకి, మదుపరులకి మంచి ఫలితం వస్తుంది అన్న దాని పై కూడా ఒక అవగాహన లేదనే చెప్పాలి. ఎన్నో ఏళ్ళనుంచీ కొనసాగుతున్న సంస్థలకూ ఈ విధానం పై స్పష్టత లేదు. 

UnLtd India, యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ నిర్వహించిన ఒక ప్రాజెక్టులో భాగంగా ఈ రకమైన సవాళ్ళను ఎదుర్కొంటున్న నేటి తరం సోషల్ ఆంట్రప్రెన్యూర్లతో మాట్లాడాం. వాళ్ళంతా ముంబయ్ లో వివిధ రంగాలలో పని చేస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సామాజిక సంస్థల వ్యవస్థాపకులు. వీరితో పలు దఫాలుగా జరిగిన ఇంటర్వ్యూలలో, చర్చలలో అనేక రకాల సమస్యల పరిష్కారమార్గాల గురించి చర్చించాము. రైతుల ఆత్మ హత్యలు దగ్గరనుంచీ, నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దాడులు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వ్యర్ధ పదార్ధాల నిర్వాహణ వంటి అంశాలు చర్చించాము. ఈ చర్చల్లో, వీరంతా సమాజం మీద గట్టి ప్రభావాన్నే చూపించే సహేతుకమైన చర్యలు చేపడుతున్నా, ఆ ప్రభావం ఎంత విభిన్నంగా ఉంటోంది ? ఎంతమందికి చేరుతోంది వంటి విషయాలపై వీరికి అవగాహన లేదని అనిపించింది.

పర్యావరణ ప్రభావాన్ని కొలిచే సంస్థలు ఏదో ఒక రూపంలో ప్రభావ కారకాలైన డేటాని సేకరిస్తాయి. ఈ ప్రభావ కారకాలని పరిమాణ పరంగా కొలుస్తారు. ఉదాహరణకి కర్బన ఉద్గారాల విడుదలని ఎంతశాతం ఆపగలిగాం లాంటివన్నమాట. సాధారణంగా ప్రభావ సూచికలని లెక్కకట్టడానికి కావాల్సిన డేటా అంతా ఆపరేషనల్ అవుట్ పుట్ డేటాగా ఆయా సంస్థలు సేకరిస్తూనే ఉంటారు. 

ఉదాహరణకి సంపూర్ణ అర్థ్ సంస్థ పర్యావరణానికి సంబంధించిన అంశం పై శ్రద్ధ వహిస్తుంది. వీరి మొదటి అంచనా.. చుట్టూ ఉన్న పరిసరాలమీద. దీనిని ఎలా అంచనా వేస్తారంటే కార్యాచరణలో వచ్చిన ఔట్‌పుట్ డేటా తీసుకుని ఎంత కార్బన్ విడుదలని ఆపగలిగాము అని లెక్క కడతారు. వీరు, స్త్రీ ముక్తి సంగనాథ (ఉమన్స్ లిబరేషన్ గ్రూపు) అనే ఓ ఎన్ జి ఒ ఏర్పాటు చేసిన వ్యర్ధ పదార్ధాలు సేకరించే మహిళా ఫెడరేషన్ నుంచి, వ్యర్ధాలను సేకరించే మహిళను నియమించుకుంటారు. కర్బన ఉద్గారాలు తగ్గించడం కంటే, ఈ మహిళలకి సరైన వేతన భత్యాలు ఇవ్వడం, గౌరవ ప్రదమైన ఉపాధి కల్పించడం అనేది కష్టతరమైనది.

అసలు అంచనా వెయ్యడం అనే మొదటి సవాలుని పక్కన పెడితే చాలా సంస్థలు, తాము ఎలా ఎవరితో పనిచేస్తున్నాయి, వాటి ప్రభావం సమాజం పై వైవిధ్యంగా ఎలా ఉంది అని అంచనా వెయ్యడం లో కూడా తడబడుతున్నాయి. సామాజిక వ్యవస్థాపకులు వారు అనుకున్న అంచనాని తమ మార్పు థియరీ ప్రకారం చూడగలరు.కానీ ఈ ప్రభావం ఎలా దోహదపడుతుంది అని మాత్రం చెప్పలేరు.

ఓపెన్ యువర్ ఆర్మ్స్ అనే సంస్థ మానసిక సామాజిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలని , వారి శారీరక మానసిక ,ఆరోగ్య అవసరాలు చూసే ఇతర సంస్థల దృష్టికి తెస్తుంది. సంస్థల మధ్య ఈ భాగస్వామ్యం చాలా కీలకం, ఎందుకంటే భాగస్వామ్యం వల్ల ఒక్క సంస్థ చెయ్యలేని దానిని ఇతరుల భాగస్వామ్యం వల్ల సాధించి సామాజిక ప్రభావాన్ని సమగ్రంగా అంచనా వేయవచ్చు. సామాజిక ప్రభావాన్ని అంచనా వెయ్యడానికి కావాల్సిన వనరులు తక్కువ గా ఉండటం అనే విషయ్యాన్ని పక్కన పెడితే అసలు దీనికి ఎందుకు చెయ్యాలి అనే దాని మీదే స్పష్టత ఉండట్లేదు. సాధారణంగా వాటాదారుల, ముఖ్యంగా మదుపుదారులు, భాగస్వాముల ఒత్తిడి మూలం గా ఈ అంచనా కార్యక్రమం మొదలయ్యి పూర్తవ్వకుండానే మధ్యలో ఎక్కడో గాలిలో కలిసిపోతుంటాయి.

సాధారణంగా ప్రారంభ సంవత్సరాలలో పారిశ్రామికవేత్తలు తమ ఆర్ధిక మరియు సామాజిక అంచనాలని పరీక్షిస్తారు. ఆర్ధిక అంశాలపై దృష్టి సారిస్తే, తరువాతి దానిపై దృష్టి కేంద్రీకరించడం సులభతరం అవుతుంది. కానీ, ఇలా ఈ రెండు అంశాలు ఆశించినట్లుగా అనుసంధానం కావడం లేదు.

ఏ నమూనా అనే కంటే దేని వల్ల అవసరాలు తీరుతున్నాయి, దేని వల్ల కాదు అని పరీక్షించుకోవడం పారిశ్రామిక వేత్తల విజయం లో కీలక భూమిక పోషిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పరీక్షించే లక్షణమే వారికి కీలకం. ఏదైనా ప్రాజెక్ట్ మొదలు పెట్టేటప్పుడు, పైలట్‌ని లాంచ్ చేసి టెస్ట్ చేస్తున్నపుడు ఫలానా నమూనాయే బాగుంది కాబట్టి దానికే కట్టుబడదాం అనుకునే కంటే దేనివల్ల ఒక ప్రత్యేక అవసరం తీరుతోంది అని ఆలోచించడం వల్ల సఫలత వస్తుంది. సంస్థలు, తమ సామాజిక మరియు ఆర్ధిక కార్యాచరణని క్రమం తప్పకుండా తెలుసుకుంటున్నట్లుగానే, వారి పని ప్రభావాలను సైతం పట్టించుకోవాలి.

సామాజిక పారిశ్రామిక వేత్తలు చురుకుగా మరియు తరచుగా ఈ పరీక్ష చేసుకోవాలి. అర్ధం చేసుకోవడంలో లేదా అంచనాని లెక్కకట్టడంలో చిన్న తేడా కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలా జరగకూడదు అనుకుంటే మొదటి రోజునుంచే పరీక్షిచడం మొదలుపెట్టాలి. కానీ వారి అంచనా నమూన సరినదే అన్న గ్యారంటీ మాత్రం ఉండకపోవచ్చు. సామాజిక పారిశ్రామికవేత్తలు మొదటి నుండీ ప్రశ్నించడాన్ని అలవరచుకోకపోతే, ప్రస్తుతం ఎంతో మంది ఉన్న సంధిగ్ధావస్థలో పడిపోతారు. ఒక్కోసారి, తాము నమ్మిన ప్రణాళికల్లో ఏదైనా మార్పు రావచ్చు, సరైన అంచనాలను అందుకోలేకపోవచ్చు. మొదట్లోనే తమ కార్యాచరణ ప్రభావ ఫలితాలను అంచనా వేయలేకపోతే, వారి నమూనాని బలపరచడానికి కావాల్సిన ఆధారాలు లేకపోవడం, ఒక కొత్త అకౌంటింగ్ వ్యవస్థని పెట్టాలంటే సరిపోను వనరులు లేకపోవడం లాంటి పరిస్థితిలో పడాల్సి ఉంటుంది.

రచయితలు గురించి:

డాక్టర్ పథీక్ పాఠక్, యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ లో సోషల్ ఎంటర్ప్రైజ్ నెట్ వర్క్ మరియు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబయ్ లో ఏప్రిల్ 2014 లో మొదలయిన SPARK ఇంటర్నేషనల్ సోషల్ ఎంటర్ప్రైజ్ క్యాంప్ డైరక్టర్.

Zoe Schlag, IDEX Fellow మరియు  Unltd India లో ఇంక్యుబేషన్ అసోసియేట్ .

Related Stories

Stories by rao Sushumna