పేషెంట్లకు ఆన్‌లైన్ వైద్యం అందిస్తున్న ఐ-క్లినిక్

నమ్మకమైన డాక్టర్లతో రియల్ టైమ్‌లో పేషెంట్ల పరిచయంఫోన్, వీడియో కన్సల్టేషన్‌తో సందేహాల పరిష్కారంనేరుగా డాక్టర్ తోనే ఆన్ లైన్ అపాయింట్మెంట్.

0

చాలా మంది ప్రయాణం చేస్తూ ఉండే ఎక్జిక్యూటివ్స్ లాగే, ధృవ్ కుమార్‌కు కూడా పలు సందర్భాల్లో డాక్టర్ అవసరం ఏర్పపడింది. కాని సమయానికి సమ్మకమైన డాక్టర్ దొరకడం, వారితో కనీసం ఆన్ లైన్లో సందేహాన్ని పంచుకోవాలన్నా కష్టంగా మారేది. “ చాలా సార్లు సామాన్యులు పోస్ట్ చేసే యాహూ లో ప్రశ్నలు, జవాబులే దొరికేవి తప్ప, అసలైన డాక్టర్ల తో సందేహాలు తీర్చుకునే నమ్మకమైన పోర్టల్ కనిపించేవి కాదంటారు ధ్రూవ్”.

డాక్టర్ సహకారం కావాల్సిన తనలాంటి వారికోసం ఓ పోర్టల్‌ను ప్రారంభించాలని అనుకున్నారు ధృవ్. 2010 వేసవిలో ‘icliniq’ అనే కంపెనీని ప్రారంభించారు. పేషెంట్లు, డాక్టర్లను రియల్ టైంలో ఒకే ప్లాట్‌ఫ్లామ్ పై పరిచయం చేస్తుంది ఈ వెబ్ సైట్. ఆన్ లైన్ లోనే డాక్టర్ సలహాలు తీసుకోవడంతో పాటు అర్జెంట్ ఉన్నప్పుడు ఫోన్ - వీడియో ద్వారా కూడా మాట్లాడుకునే సౌకర్యం కల్పిస్తోంది.

ప్రాధమిక దశలో కోయంబత్తూర్‌కు చెందిన ఓ కంపెనీ ద్వారా వెబ్ సైట్ నిర్వహణ పనులు చేపట్టారు. కానీ అది సరిగ్గా లేకపోవడంతో 2011, నవంబర్ లో తన సొంత టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు.

ఐక్లీనిక్ ప్రారంభ దశలో

“ఫేస్ బుక్ పై ఈ కాన్సెప్ట్ గురించి తెలిపిన వెంటనే తెలిసిన వారితో పాటు ఫ్రెండ్స్ అంతా వాడతారని అనుకున్నాను. వాళ్లంతా ఈ కాన్సెప్ట్ ని మెచ్చుకున్నారు. కాని, ఎవరు కూడా ఈ వేదికని వాడలేదు. అంతే కాకుండా డాక్టర్లు కూడా అంత సులువుగా దొరికేవారు కాదంటారు ధృవ్. మొద్దట్లో డాక్టర్లు ఐ క్లీనిక్ లో చేరడానికి కారణం, ధృవ్ కోరినందుకే తప్ప, వారికీ ఈ కాన్సెప్ట్ పెద్దగా నచ్చలేదు”.

“ఈ అంశంపై సీరియస్ గా ఆలోచించడానికే సంవత్సరం పట్టింది, అసలు మా కంపెనీ ఓ టెక్నాలజీ కంపెనీగా కాకుండా ఓ ఆరోగ్య రంగ కంపెనీగా గుర్తింపు పొందాలంటే ఎలా అనే ఆలోచన మొదలైంది. అందుకు టెక్నాలజీ సహకారం తీసుకుని వినూత్న పద్ధతిలో సేవలు అందించాలని భావించాము ”.

“డాక్డర్లు టెక్ సావీ అయ్యే విధంగా వారిని ట్రైన్ చేయడం ప్రారంభించాము. ఇదో కొత్త పరిశ్రమ కావడంతో, సొంత విధానాలను కనిబెట్టాల్సిన అవసరం పడింది. అప్పటికీ పిడియో కన్సల్టెషన్లు పెద్దగా రాలేదు, చాలా మంది డాక్టర్లు, పేషెంట్లతో చర్చించాకా, ఎంట్రీనే ఓ సమస్యగా మారినట్టు కనిపించిందని అంటున్నారు ధ్రూవ్”.

అనంతరం వీడియో కన్సల్టెషన్ కాకుండా, ఫోన్ మరియు రాత పూర్వకంగా సందేహాలను తీసుకోవడం ప్రారంభించింది ఈ కంపెనీ, అప్పటి నుండి ‘ఐ క్లీనిక్’ ఎదుగుదలను చూసింది.

డాక్టర్లు , పేషంట్లకు ‘ఐ క్లీనిక్’ ఏలా ఉపయోగపడుతుంది?

డాక్టర్ కేవలం ‘ఐ క్లీనిక్. కామ్’ లో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది, (ఇందులో వారి వెరిఫికేషన్ జరగడంతో పాటు టెలి హెల్త్ పట్ల అవగాహన కల్పిస్తాము, రోగిని పర్సనల్‌గా కలవకుండా, పరిష్కారం చూపడం టెలీ హెల్త్), ఆ డాక్టర్ డాష్ బోర్డుపై అతని కోసం వచ్చిన సందేహాలు, కన్సల్టేషన్లు డిస్‌ప్లే అవుతాయి.

పేషెంట్లు సింపుల్‌గా తమ ఆరోగ్య సమస్యలను ఉచితంగా 160 క్యారెక్టర్స్‌లో పోస్ట్ చేసుకోవడంతో పాటు, కాల్ బ్యాక్ కన్సల్టెషన్ , వీడియో కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. నేరుగా సంబంధిత డాక్టర్‌తో తమ సమస్యలను తెలిపే అవకాశం కూడా ఇందులో ఉంది.

ఆదాయ మార్గం

ఇప్పటి వరకు ఈ ప్లాట్‌ఫార్మ్ సహకారంతో సుమారు 50 వేల పేషేంట్లకు కన్సల్టేషన్ ఆఫర్ చేయగలిగాము. అందులో 25 శాతం మంది విదేశీయులు కూడా ఉన్నారు. “ప్రస్తుతం 10 శాతం కస్టమర్లు.. వాళ్లు అందుకుంటున్న సేవలకు పేమేంట్ కూడా చేస్తున్నారు, ఇండియా, యూఎస్‌ఏ, మిడిల్ ఈస్ట్ వంటి ప్రదాన దేశాల నుండి కూడా పెయిడ్ కస్టమర్లు ఉన్నారంటున్నారు ధృవ్”.

కంపెనీ లాభాల్లో లేకపోయినా, ఆరోగ్య రంగాన్ని ఆన్ లైన్ లో సకస్స్ చేయడంపై మా దృష్టి సారించామంటున్నారు ధృవ్. ప్రస్తుతానికి కంపెనీ తమ ప్లాట్ ఫార్మ్ వాడుకున్నందుకు కొద్ది మొత్తాన్ని ఫీజుగా తీసుకుని డాక్టర్ల ఖాతాల్లోకి మొత్తాన్ని జమ చేస్తోంది.

Sr. Correspondent @ yourstory.com

Related Stories

Stories by ABDUL SAMAD