వేరబుల్ టెక్నాలజీలో నడుస్తున్న ట్రెండ్ ఏంటి..?  

తొడుక్కునే బట్టల నుంచి.. బిజినెస్ దాకా అన్నింటా వాటిదే హవా

0

నడుస్తున్న ట్రెండులో వేరబుల్ టెక్నాలజీ అతిపెద్ద ఇన్నోవేషన్ గా నిలిచింది. స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఎలా భాగమైపోయిందో వేరబుల్ డివైజెస్ కూడా మనిషి మనుగడలో కీ రోల్ పోషిస్తున్నాయి. రానురాను స్మార్ట్ ఫోన్ల అవసరమే లేకుండా పోతుందనడంలో ఆశ్చర్యంలేదు. కమ్యూనికేషన్ ఒక్కటే కాదు.. డాటా సైన్స్, బిగ్ డాటా అనలిటిక్స్, క్లౌడ్ అడ్వాన్స్ మెంట్స్ వంటి అవసరాలు తీర్చేలా రూపుదిద్దుకుంటున్నాయి.

హెల్త్ కేర్, ఫిట్ నెస్ , వెల్ నెస్ డొమైన్

ఈ డివైజెస్ రోజురోజుకి మరింత స్మార్ట్ అవుతున్నాయి. చాలా హెల్త్ కేర్ కంపెనీలు కొత్తకొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టకునేలా డివైజ్ తయారుచేయడంలో తలమునకలయ్యాయి. ప్రతీ చిన్న చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పనిలేకుండా యూజర్లకు సింపుల్ గా అర్ధమయ్యేలా, ఫన్నీగా ఆపరేట్ చేసేలా రూపొందిస్తున్నారు. అతి క్లిష్టమైన మెడికల్ ప్రొసీజర్ ను సింప్లిఫై చేసినప్పటికీ వీటి వాడకంలో పెద్దగా జనంలో పెద్దగా అవగాహన రాలేదు.

లాజిస్టిక్స్

ఒక బిజినెస్ మేన్ ఉన్నాడు. అతనికి ఆంటిక్స్ లాంటి చాలా ఖరీదైన సామాగ్రిని ట్రాన్స్ పోర్ట్ చేసే బిజినెస్ ఉంది. షిప్పులు, కంటెయినర్ల ద్వారా దేశవిదేశాలకు సరఫరా చేస్తుంటాడు. అతని సమస్యల్లా ఒకటే. ప్రతీసారీ కొత్తగా డ్రైవర్ ని అపాయింట్ చేసుకోవాలి. పార్శిల్ దగ్గర్నుంచి లోడింగ్, అన్ లోడింగ్, ఓవరాల్ ట్రాకింగ్ సమస్యలొచ్చేవి. అవన్నీ ఒక్క వేరబుల్ లాకెట్ తో సమసిపోయాయి. ఎలాగంటే సెన్సార్ ఉన్న కీ చైన్ కి కీస్ ప్లస్ డ్రైవర్ ప్లస్ ట్రక్‌.. ఇలా అన్నీ ఒకేసమయంలో అసైన్ చేయొచ్చు. ఇందులో మాన్యువల్ అన్న మాటే లేదు. అన్నీ అసైన్ చేశాక ఆటోమేటిగ్గా క్లౌడ్ సిస్టమ్‌ అనలైజ్ చేసుకుంటుంది. ఇలా వేరబుల్ అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతోంది.

Image source : Mobilelap.com  
Image source : Mobilelap.com  

ఉత్పాదక రంగం

ఆ మాటకొస్తే మాన్యుఫాక్చరింగ్ రంగం కూడా వేరబుల్ పరికరాల మీదనే ఆధారపడుతోంది. రకరకాల సెన్సర్లతో వర్కర్లు తమ పని సులువు చేసుకుంటున్నారు. ఇండస్ట్రీ సంబంధించిన అతిపెద్ద డేటాను వేరబుల్ డివైజెస్ ద్వారా సులభతరం చేసుకుంటున్నారు.

మిలటరీ, సెక్యూరిటీ ఏజెన్సీలు

ఇది మరో ముందడుగు. చాలా సీరియస్‌గా సాగే ఏరియాలో కూడా వేరబుల్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. ఉదా. స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్ వాచీలు, సెన్సర్ రింగ్స్, స్మార్ట్ హెల్మెట్స్ తదితర పరికరాలు మోయాల్సిన బరువును తగ్గించడమే కాకుండా- సెక్యూరిటీ యాంగిల్లో కూడా పటిష్టపరుస్తున్నాయి. టీమ్ ట్రాకింగ్‌లో ఇవి మేజర్‌ రోల్ పోషిస్తున్నాయి.

పెర్సనలైజ్డ్‌ ట్రాకింగ్

కన్స్యూమర్ బేస్ ఎక్కువగా ఉండటంతో హెల్త్ కేర్, ఫిట్ నెస్ కంపెనీలు వేరబుల్ టెక్నాలజీ మీద ఎక్కువ శాతం ఫోకస్ చేశాయి. ఎందుకంటే ఈ మధ్య జనం తమ ఆరోగ్యం పట్ల కాస్తంత శ్రద్ధతో ఉంటున్నారు. డైలీ వాకింగ్, రన్నింగ్ లాంటివి ఫ్రీక్వెంట్‌గా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి వచ్చిన పర్సనల్ డివైజెస్ డే టు డే లైఫ్ ని అనలైజ్ చేసి చూపిస్తున్నాయి. ఒక డాక్టర్ మల్లే రిపోర్టిస్తున్నాయి. రాబోయే ఆరోగ్య సమస్యలపై హెచ్చరికలు చేస్తున్నాయి. దీనివల్ల అడ్మిట్, టెస్టులు, రిపోర్టులు, అబ్జర్వేషన్.. పరిశీలనలు.. ఇలాంటి టెన్షన్ లేకుండా డాక్టర్‌తో రియల్ టైంలో సంప్రదించవచ్చు. దీన్నే కనెక్టెడ్ హెల్త్ కేర్ అంటారు.

ఫ్యాషన్ అండ్ ఎంటర్‌టైన్ మెంట్

అది కాదని అన్ని రంగములా అన్నట్టు.. వేరబుల్ టెక్నాలజీ ఫ్యాషన్ రంగలోనూ తనదైన స్టయిల్లో దూసుకుపోతోంది. ఆల్రెడీ స్మార్ట్ వాచీల గురించి తెలుసు. స్మార్ట్ గ్లాసెస్ కూడా పరిచయమే. రకరకాల కలర్ లెన్స్ తో అది వింతవింత రంగులు మార్చుకుంటోంది. ఆ మధ్య వేరబుల్ టీ షర్టు కూడా ఆవిష్కరించారు. మన మూడ్ కి తగ్గట్టుగా కొటేషన్లు డిస్ ప్లే చేసే ఆ టీ షర్టు మార్కెట్లోకి రావాల్సి ఉంది. ఇంకాస్త అడుగు ముందుకు వేసి బయట టెంపరేచర్ ను బాడీకి తగ్గట్టుగా మార్చే సెన్సర్లతో బట్టలను తయారు చేస్తున్నారు.

మొత్తానికి బట్టల నుంచి బిజినెస్ దాకా వేరబుల్ టెక్నాలదే భవిష్యత్ అని చెప్పొచ్చు.

Related Stories