ప్రముఖులంతా పొద్దున ఎప్పుడు నిద్రలేస్తారో తెలుసా..?

ప్రముఖులంతా పొద్దున ఎప్పుడు నిద్రలేస్తారో తెలుసా..?

Friday October 21, 2016,

3 min Read


లేటుగా పడుకోవడం.. లేటుగా నిద్రలేవడం. అర్బన్ పీపుల్ కు కామనైపోయింది. ఆఫీస్ వర్కో, పెండింగ్ ప్రాజెక్టో, బోర్డు మీటింగో, పార్టీయో, ఫంక్షనో.. ఏదో ఒకటి రాత్రి 1 దాటితే గానీ బెడ్ మీదకి చేరుకోవడం లేదు.

దాంతో ఏం మిస్సవుతున్నామో తెలుసా..?

నులివెచ్చని సూర్యోదయాలు.. 

కుండీలో పూలమొక్కపై రాలిన తుషార బిందులు.. 

తెలిమంచు తెరలు.. 

పక్షుల కిలకిలా రావాలు..

అంతేనా..?

చెప్పాలంటే చాలా మిస్సవుతున్నాం.. ముఖ్యంగా ఆరోగ్యాన్ని చేజేతులా దుప్పట్లో కప్పిపెడుతున్నాం.. కేవలం ఆఫీస్ పేరుచెప్పుకునే పొద్దెక్కేదాకా పక్కమీదనే ఉంటున్నాం.. మరి బడాబడా వ్యాపారవేత్తలు, సీఈవోలు, సెలబ్రిటీలు బిజీ షెడ్యూల్లో కూడా ఎంత పొద్దున లేస్తారో తెలుసా? వాళ్లవాళ్ల మార్నింగ్ షెడ్యూల్ చదివితే మీరు కచ్చితంగా మారుతారు. అయితే లేటెందుకు?

ఒక మనిషి సక్సెస్ కు కారణం కష్డపడటం ఒకెత్తయితే.. పొద్దన్నే నిద్రలేవడం మరో ఎత్తట. జోక్ కాదు. సీరియస్. హెల్త్ పరంగానైనా, కెరీర్ విషయంలోనైనా పొద్దున్నే నిద్రలేచేదాన్ని బట్టే మన విజయాలు ఆధారపడి వుంటాయి. మనం ఎంత పెందలాడే లేస్తే అన్ని గంటలు మనకోసం ఎదురు చూస్తుంటాయి. ఇదేదో గుడ్డిగా చెప్తున్నది కాదు. సైంటిఫిక్ రీసెర్చ్ లో తేలింది.

image


ఇంకాస్త ఇంట్రెస్ట్ పాయింట్ కు వద్దాం..

మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సనాలిటీస్ బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఏం చేస్తారంటే..

20 మంది ఎగ్జ్ క్యూటివ్ లను సర్వే చేస్తే 90 శాతం మంది చెప్పిన ఆన్సర్ ఒక్కటే..

"మేం ఉదయాన్నే ఆరింటికల్లా పక్క దులిపేస్తాం"

image


జాక్ మా, ఫౌండర్, అలీబాబా గ్రూప్.

మనిషిగా పుట్టింది కేవలం పనిచేయడానికే కాదు. జీవితాన్ని ఎంజాయ్ కూడా చేయాలి. వర్క్ ఒక్కటే సర్వస్వం కాదు. కేవలం గానిగెద్దులా పనిచేసుకుంటూ పోతే చివరికి ఏమీ మిగలదు. అప్పుడు తాపీగా బాధపడటం తప్ప మరో ఆప్షన్ లేదు.

జాక్ మా ఇచ్చిన స్టేట్ మెంట్ లో నిజం లేకపోలేదు. అందుకే అతను 6-7 మధ్యలో నిద్రలేస్తాడు. ఆ తర్వాత ప్రతీ క్షణం జీవితాన్ని ఆస్వాదిస్తాడు.

జెఫ్ బెజోస్, సీఈవో, అమెజాన్

కస్టమర్ సర్వీస్ మీద తప్ప మరో ధ్యాస ఉండదు ఇతనికి. అలాగని వర్క్ హాలిక్ అనుకుంటే పొరపాటే. డెడ్ లైన్ తరుముకురానీ, మిన్నువిరిగి మీద పడనీ.. గుడ్ నైట్ చెప్పాల్సి వస్తే మొహమాటమే ఉండదు. ఇదంతా పొద్దున్నే నిద్రలేవడానికే.

image


టిమ్ కుక్, సీఈవో, యాపిల్

మీకో విషయం తెలుసా? టిమ్ కుక్ పొద్దున్నే నాలుగున్నరకు ఈ మెయిల్స్ చెక్ చేసుకుంటాడు. ఐదింటికల్లా జిమ్ కు చేరుకుంటాడు. ఆఫీసులో అందరికంటే లేటుగా ఇంటికి వెళ్తాడు. అందరికంటే ముందుగా ఆఫీసుకి వెళ్తాడు. ఈ విషయాన్ని టిమ్ కుక్ గర్వంగా చెప్పుకుంటాడు.

image


బిల్ గేట్స్, కో ఫౌండర్, మైక్రోసాఫ్ట్

పొద్దున కనీసం గంటసేపైనా ట్రెడ్ మిల్ మీద వర్కవుట్ చేయందే మనసున పట్టదు బిల్ గేట్స్ కు. దానిమీదనే చేయగలిగే పనులన్నీ చేస్తాడు.

image


మార్క్ జుకర్ బర్గ్, కో ఫౌండర్, సీఈవో, ఫేస్ బుక్

ఏదేమైనా ఆరింటికల్లా రెడీ అయి ఆఫీసుకు వెళ్తాడు. అంతకు ముందు చాలా తక్కువ సేపు నిద్రపోయేవాడు. ప్రోగ్రామర్స్ తో చాట్ చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు కాస్త లేటుగా అంటే ఆరు గంటలకు వెళ్తున్నాడు.

image


రిచర్డ్ బ్రాన్సన్, ఫౌండర్ వర్జిన్ గ్రూప్

వర్జిన్ గ్రూప్ ఫౌండర్ రిచర్డ్స్ లైఫ్ స్టయిల్ భిన్నంగా ఉంటుంది. పొద్దున్నే లేవగానే ఈత కొడతాడు. ఆ తర్వాత టెన్నిస్ ఆడతాడు. మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేసి ఆఫీసుకి బయల్దేరుతాడు.

image


వారెన్ బఫెట్, సీఈవో, బెర్క్ షైర్ హాత్ వే

వారెన్ బఫెట్ పొద్దున్నే 6-45కు నిద్ర లేస్తాడు. ఫిక్స్ డ్ షెడ్యూల్ ఏమీ లేకపోతే కనీసం ఆరు దినపత్రికలు చదువుతాడు. 80 శాతం చదవడానికే టైం కేటాయిస్తాడు.

image


రతన్ టాటా, మాజీ ఛైర్మన్, టాటా సన్స్

రాత్రి ఎంత ఆలస్యమైనా పొద్దున ఆరు గంటలకు మీటింగ్స్ అటెండ్ కావలసిందే. వీకెండ్స్ లో అర్లీ అవర్స్ కారు డ్రైవ్ చేస్తారు. లేదంటే తన సొంత జెట్ ఫ్లయిట్ నడుపుతారు.

image


ముఖేష్ అంబానీ, ఛైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్

రోజు పొద్దున్నే 5, 5-30 మధ్యలో ముఖేష్ నిద్రలేస్తారు. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న జిమ్ లో వర్కవుట్ చేస్తారు. అందులోనే స్విమ్మింగ్. ఆ తర్వాత న్యూస్ పేపర్లు తిరగేస్తారు.

image


ఓఫ్రా విన్ ఫ్రే, ప్రఖ్యాత టీవీ హోస్ట్

పొద్దున్నే 20 నిమిషాల మెడిటేషన్ తో దినచర్య ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జిమ్ లో ఎక్సర్ సైజ్.

image


నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ ఉదయాన్నే ఐదు గంటలకల్లా నిద్రలేస్తారు. తర్వాత ప్రాణాయామం, సూర్యనమస్కారం, యోగా చేసిన తర్వాత దినచర్యలోకి అడుగుపెడతారు.

image


విరాట్ కోహ్లీ, భారత క్రికెటర్

కోహ్లీ పొద్దున్నే ఆరింటికి నిద్రలేస్తాడు. రకరకాల వైడ్ కాంబినేషన్ లో ఎక్సర్ సైజులు చేస్తాడు. మాగ్జిమం కండలు పెరిగేందుకు బరువులు ఎత్తుతాడు. మరి లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలంటే ఆ మాత్రం వర్కవుట్ ఉండాలి కదా..

image


బారక్ ఒబామా, అమెరికా ప్రెసిడెంట్

ఒబామా పొద్దున్నే ఆరున్నరకు బెడ్ మీద నుంచి లేవగానే సరాసరి జిమ్ కు బయల్దేరుతాడు. తర్వాత ఫ్యామిలీతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తాడు.