చిన్నారుల కోసం ఎక్స్ ట్రా బ్రెయిన్ తయారు చేశారు..!

Sunday February 28, 2016,

3 min Read

డే నైట్ క్లాసులు, బట్టీ పట్టి తెచ్చుకునే మార్కులు. ఇదీ నేటి స్కూళ్ల టార్గెట్ . చిన్ని మెదళ్లలో మెలకెత్తే ఎన్నో ఆలోచనలను నేటి తరం సోకాల్డ్ టెక్నో స్కూళ్లు తొక్కి పెట్టేస్తున్నాయి. బాల్యాన్ని సొంతంగా ఆలోచించకుండా చేస్తున్నాయి. అయితే చిన్నారి జిజ్ఞాస మాత్రం అనంతం. పిల్లలకు ఏదైనా ఆట బొమ్మ ఇచ్చి చూడండి... అదెలా పనిచేస్తోందో కనుక్కునేందుకు ఏ పార్టుకు ఆ పార్టు ఊడదీస్తారు. రెండు మూడు ప్రయత్నాల్లో అయినా సరే... దాన్ని మళ్లీ ఆటకు సిద్ధం చేసుకుంటారు. చేసుకోకపోయినా కనీసం ప్రయత్నం చేస్తారు. కనీస ప్రొత్సాహం ఇస్తే వీరిలో నుంచే దశ మార్చే ఆవిష్కర్తలు పుట్టుకొస్తారు. ఇలాంటి మాణిక్యాల్ని వెలికి తీసేందుకు అద్భుతమైన ఆలోచన చేశారు కర్ణాటకలోని బెల్గాంకు చెందిన యువ ఇంజినీర్ సందీప్ సెసాన్. దానిపేరే "బిబాక్స్". అంటే బ్రెయిన్ ఇన్ ఏ బాక్స్.

కర్నాటకలోని చిన్న పట్టణమైన బెల్గాంలో పుట్టి పెరిగిన సందీప్.. చిన్నతనం నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులపైనా, వాటి పనితీరుపైనా విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నాడు. ఐదో తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత, సెలవుల్లో తన ఇంటి సమీపంలో ఉన్న టీవీ, రేడియో రిపేర్ షాపులోనే ఎక్కువ సేపు గడిపేవారు. అదే ఆసక్తి రిఫ్రిజిరేటర్స్, టాకింగ్ మెషీన్స్, కాఫీ మేకర్ మేషీన్స్ డిజైనింగ్ వైపు మళ్లించింది. సేమ్ తనలాంటి ఆలోచనే చిన్నపిల్లలందరికీ ఉంటుందని గమనించిన సందీప్.. చిట్టిబుర్రల కోసం ఒక ఐడియా కనుగొన్నాడు. దానిపేరే "బిబాక్స్". బ్రెయిన్ ఇన్ ఏ బాక్స్. ఐదు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు స్మార్ట్స్ ఫోన్లు, రోబోట్స్, ఇతర గాడ్జెట్స్ ను సొంతంగా తయారు చేసేలా ప్రొత్సహించే ప్రోగామబుల్ ఎలక్ట్రానిక్ ఫ్లాట్ ఫామ్"బిబాక్స్".

"బిబాక్స్" ఓ రకంగా ఎలక్ట్రానిక్ బ్రెయిన్ లాంటిది. టాబ్లెట్, స్మార్ట్ ఫోన్, పీసీతో దీన్ని ఆపరేట్ చేయవచ్చు. చిన్నారి ఆలోచనల మేరకు స్మార్ట్ యాక్సెసరీస్ ను దీని ద్వారా తయారుచేయవచ్చు. టాయ్స్... లైట్స్ ..రోబోట్స్ ఇలా అన్నింటికీ బిబోక్స్ ఉపయోగపడుతుంది- సందీప్ సి సెసాన్.

విశ్వేశ్వరయ్య టెక్నలజీకల్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ తో ఇంజినీరింగ్ పూర్తిచేసిన సందీప్ ఎంబెడెడ్ సిస్టమ్స్, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ, హెప్టిక్స్ లో నైపుణ్యం సాధించాడు. ఆస్ట్రేలియాలో ఎంబీఏ పూర్తి చేశాడు. ధింక్ సాఫ్ట్ సొల్యూషన్స్ లో పనిచేస్తున్న సమయంలో ఫ్యూచర్ టెక్నాలజీకి సంబంధించి చిన్నారులకు పాఠాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఆ సమయంలోనే సందీప్... తన ఆలోచనకు పదును పెట్టాడు.

ఇంజినీరింగ్ లో ఉన్నప్పుడు సందీప్ కొత్త క్రియేషన్స్ పై దృష్టి పెట్టాడు. రెండో ఏడాది చదువుతున్నప్పుడే వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్, రోబోటిక్ మెషీన్స్ ని రూపొందించాడు. చివరి ఏడాదిలో సందీప్ చేసిన రెండు ప్రాజెక్టులు డీఆర్డీవో ( డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ) ఎంపిక చేసుకుంది కూడా. అదే సమయంలో వర్క్ షాపులు పెట్టి కాలేజీ జూనియర్లకు సహకరించేవారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనూ సందీప్ స్కూళ్లలో వర్క్ షాపులు పెట్టి... పిల్లల్లో ఆసక్తి పెంపొందించేవారు.

బిబోక్స్ ప్రాథమికంగా పిల్లల ఆలోచనలకు స్టార్టర్ కు టూల్ కిట్ గా పనిచేస్తుంది. తద్వాకా ప్రపంచంలో ఏ రంగంలో అయినా సరే వాస్తవ సమస్యలను పరిష్కరించే సత్తాను "బిబాక్స్" అందిస్తుందని సందీప్ దీమాగా చెబుతున్నారు.

బిబోక్స్ ప్రొటోటైప్ మోడల్ తయారీకి డిపార్ట్ మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ( DISR ) ఆర్థిక సాయం చేసింది. తర్వాత డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సాయం చేసింది.

మొదట ఒంటరిగా ప్రయాణం ప్రారంభించిన సందీప్.. 2013లో మధుసూదన్ నంబూద్రి జత కలిశారు. విద్య, రీటైల్, సేల్స్ రంగాల్లో రెండు దశాబ్దాల అనుభవమున్న మధుసూదన్.. బిబోక్స్ స్కూళ్లదాకా వెళ్లడంలో కీలకపాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి 2013లో స్టార్టప్ లకు పెట్టుబడి సమకూర్చే "ముంబై ఎంజెల్స్" సంస్థ నుంచి ఒకటిన్నర కోట్ల పెట్టుబడి సాధించారు. ఇటీవల షేడ్ ఫ్లెక్స్ సంస్థ యజమాని రవి కృష్ణమూర్తి మూడున్నర కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. మొత్తం ఆరున్నర కోట్ల సేకరణతో బిబోక్స్ కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తోంది. 

"బిబాక్స్" విషయంలో పిల్లలకు పూర్తి అవగాహన కల్పించేందుకు స్కూళ్లలో 80 నిమిషాల క్లాస్ తీసుకుంటున్నారు. ట్రాఫిక్ లైట్లు, ఆటోమేటిక్ లాకింగ్ డోర్లు, రోబోటిక్ ఆర్మ్, స్మార్ట్ కార్స్ ఇలా ... చిన్నారులు తమ ఆలోచనలకు అనుగణంగా ఏదైనా రూపొందిచుకునేలా "బిబాక్స్" అందిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు, కేరళ, కోయంబత్తూరు, ఢిల్లీలలోని స్కూళ్లు బిబోక్స్ ను చిన్నారులకు అందిస్తున్నాయి. బెంగళూరులోని 18, కేరళలో 20, ఘజియాబాద్, నోయిడాల్లో మరికొన్ని స్కూళ్లకు "బిబాక్స్" ను పంపిణి చేస్తోంది. ఇప్పటికే పది వేల మందికిపైగా చిన్నారులు బ్రెయిన్ ఇన్ ఏ బాక్స్ తో తమ ఆలోచనలను పదును పెడుతున్నారు. 

ఈ ఏడాది మరో 120 స్కూళ్లతో టైఅప్ అవ్వాలని సందీప్ టీం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది మూడింతలు పెరిగిన బిబోక్స్"బిబాక్స్" ఆదాయం ఈసారి ఆరింతలు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, కేరళ, తమిళనాడుల్లో "బిబాక్స్" కోసం 75 మంది పనిచేస్తున్నారు.

మ్యాథ్స్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో పెరుగుతున్న ప్రాధాన్యం... ఇంజినీరింగ్ నైపుణ్యాల్లో వెనుకబడుతున్న యువతరం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. భవిష్యత్ లో"బిబాక్స్" లాంటి ఆవిష్కరణలు మరెన్నో రావాల్సిన అవసరముంది.