సోలార్ పవర్ బిజినెస్ లో తిరుగులేని ఫ్రెయర్ ఎనర్జీ

ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వెంచర్ గా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ

సోలార్ పవర్ బిజినెస్ లో తిరుగులేని ఫ్రెయర్ ఎనర్జీ

Thursday December 29, 2016,

3 min Read

మీకు తెలుసా? ఒకనిమిషం సూర్యకాంతి నుంచి యావత్ ప్రపంచానికి ఏడాదికి సరిపడా విద్యుత్ సప్లయ్ చేయొచ్చు. కాలుష్యం అన్న మాటే లేకుండా అపరిమితమైన కరెంట్ ఉత్పత్తి చేయడానికి ప్రకృతి ఇచ్చిన గొప్పవరం- సోలార్ పవర్. కానీ ఎంతమందికి సౌర విద్యుత్ మీద అవగాహన ఉంది? ఒకవేళ ఉన్నా ఎంతమంది ఆ దిశగా వెళ్తున్నారు? సామాన్యులకు సౌరవిద్యుత్ ఎంతమేరకు అందుతోంది? దీనికి సమాధానం లేదనే చెప్పాలి.

వందశాతం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని అందించేందుకు ఎన్నో రకాల సంస్థలు ముందుకొస్తున్నాయి. అయితే టెక్నాలజీ సాయంతో సోలార్ ఎనర్జీని సింప్లిఫై చేసిన ఘనత మాత్రం ఫ్రెయర్ ఎనర్జీదే. మార్కెట్లో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హైదరాబాద్ బేస్డ్ ఫ్రెయర్ ఎనర్జీ. స్థాపించిన ఏడాది రెండేళ్లలోనే ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వెంచర్ గా అవతరించింది.

సోలాస్ ఎనర్జీ. ఈ మాట వినడానికి చాలా సింపుల్‌ గానే అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్ గా అర్ధంకాదు. అలాంటి సిస్టమ్‌ ను సింప్లిఫై చేయడంలో ఫ్రెయర్ ఎనర్జీ సక్సెస్ అయింది. ఫోన్ ఆపరేట్ చేసినంత ఈజీగా సిస్టమ్‌ను మాడిఫై చేసింది. ముఖ్యంగా రైతులకు, మధ్యతరగతి గృహావసరాలకు, విద్యాసంస్థలకు, వ్యాపార సంస్థలకు అతి తక్కువ ఖర్చుతో కరెంట్ అవసరాలను సులభంగా తీర్చగలిగింది.

image


ఫ్రెయర్ ఎనర్జీ స్పెషాలిటీ ఏంటి..?

1. సింపుల్ అండ్ ఫాస్ట్‌

సోలార్ అనగానే మెయింటెనెన్స్.. ఇన్‌ స్టాలేషన్.. దానిమీద అవగాహన.. అది పనిచేసే విధానం..ఇదంతా పెద్ద ప్రాసెస్. అలాంటి టిపికల్ సబ్జెక్టును టెక్నాలజీ ద్వారా సులభతరం చేసింది ఫ్రెయర్ ఎనర్జీ.

2. స్మార్ట్ డిజైన్

ఇంధన అవసరాలు, ఏరియా వెసులుబాటు, బడ్జెట్ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యవస్థను స్మార్ట్ గా డిజైన్ చేశారు.

3. గ్యారెంటీడ్ పెర్ఫామెన్స్

టాప్ క్వాలిటీ కాంపొనెంట్స్ తో ఇన్ స్టాల్ చేయడమే కాకుండా.. 48 గంటల్లోపు ఆఫ్టర్ సేల్స్ రిక్వెస్టులకు స్పందిస్తారు.

4. ఆర్ధిక సహకారం

ఒకవేళ కస్టమర్లకు సోలార్ సిస్టమ్ పెట్టుకునే ఆర్ధిక స్తోమత లేకుంటే బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పించి కూడా ప్రోత్సహిస్తారు.

ఇప్పటిదాకా మొత్తం 700కి పైగా ఇన్‌ స్టాలేష్స్ చేశారు. ఏడాదికి 1300 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ నిరోధించడంలో ఫ్రెయర్ ఎనర్జీ తనవంతు పాత్ర పోషించింది. అంటే ఈ లెక్కన సంవత్సరానికి 14,887 చెట్లను కాపాడిందన్నమాట. ఇండియాలో 10 రాష్ట్రాలతో పాటు ఘనాలోని రెండు స్టేట్స్ లో ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. కేవలం రిఫరల్స్ ద్వారానే 50 శాతం కొత్త ఆర్డర్లను గెయిన్ చేస్తున్నారు.

ప్రస్తుతానికి 1 నుంచి 200 కిలోవాట్ల వరకు సోలార్ సిస్టమ్ ఇన్ స్టాల్ చేస్తున్నారు. రూఫ్ టాప్, బోర్ వెల్స్, పెట్రోల్ పంప్స్, మైక్రోగ్రిడ్ లాంటి నాలుగు సెగ్మెంట్లలో ఫ్రెయిర్ కంపెనీ బిజినెస్ దూసుకుపోతోంది. ఈ సెక్టారులో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా ఎదుగుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పదివేలకు పైగా గిరిజన గ్రామాలకు వెలుగులు అందించడంలో సక్సెస్ అయింది. ఘనాలో 17వేలకు మందికి పైగా మెరుగైన వైద్యం అందేలా చేసింది. రెండువేల మందికి పైగా తాగునీటి కొరతను తీర్చిగలిగింది.

image


ఫ్రెయర్ సన్ ప్రో యాప్

ఫ్రెయర్ ఎనర్జీ ద్వారా సోలార్ బిజినెస్ చేయాలనుకునే వారికి కూడా ఫ్రెయర్ మంచి అవకాశం కల్పించింది. సన్ ప్రో అనే మొబైల్ యాప్ ద్వారా ఛానల్ పార్ట్‌ నర్లకు వ్యాపారానికి ఎంతో దోహదపడుతోంది. ఎలాంటి సోలార్ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా సరే టార్గెట్ కస్టమర్లను రీచ్ అయ్యేలా యాప్ డిజైన్ చేశారు. ఐదుగురితో కూడిన టీం- డిజైన్ నుంచి ఆర్డర్ క్లోజ్ అయ్యేదాకా ఫాలో అప్ చేస్తుంది. అందుకోసం మీటింగుల మీద మీటింగులు అవసరం లేకుండా చాలా సింప్లిఫై చేసింది. రెండే రెండు నిమిషాల్లో కస్టమర్ కు అర్ధమయ్యేలా వివరించొచ్చు. చానల్ పార్ట్ నర్ కు ఒక గంటసేపు ఆన్ లైన్‌ ట్రైనింగ్ ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా సన్ ప్రో యాప్‌ని తీర్చిదిద్ది బిజినెస్‌ను మొదటి రోజు నుంచే లాభాలు ఆర్జించేలా డిజైన్ చేశారు.

ఫ్రెయర్ ఎనర్జీ సంస్థ కో ఫౌండర్లు సౌరభ్, రాధిక చౌదరికి ఈ రంగంలో మంచి అనుభవం ఉంది. ఇండస్ట్రీలో ఎనిమిదేళ్ల ఎక్స్ పీరియెన్స్ ఉన్న సౌరభ్- ఎంబీయే చేశారు. ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరింగ్ అమెరికాలో కంప్లీట్ చేశారు. సన్ ఫ్లవర్, సోలారియా, న్యూవో పవర్ లాంటి కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది అతనికి. ప్రస్తుతం ఫ్రెయర్ ఎనర్జీస్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇక మరో కో ఫౌండర్ రాధిక చౌదరి. న్యూవో పవర్, సన్ ఎడిసన్, ల్యాంకో సోలార్ కంపెనీల్లో ఆమె విశేష అనుభవం గడించారు. ఎమ్మెస్ న్యూక్లియర్ ఇంజినీరింగ్ చదవిన రాధిక ఈ రంగంలో పదేళ్ల నుంచీ ఉన్నారు.

ప్రాఫిటబుల్ గ్రోథ్ సాధిస్తున్న ఫ్రెయర్ ఎనర్జీ గత రెండేళ్లుగా మంచి లాభాల బాటలో నడుస్తోంది. వచ్చే మూడేళ్లలో మరో 20 దేశాల్లో ఆపరేషన్స్ జరపాలని సంస్థ టార్గెట్ గా పెట్టుకుంది.