వైఫై.. హైదరాబాదులో హైఫై !!

వైఫై.. హైదరాబాదులో హైఫై !!

Friday December 25, 2015,

2 min Read

హైదరాబాద్ లో ఇంటర్నెట్ క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ మన సైబరాబాద్ దే. ఇప్పుడు నగరంలో వైఫై కూడా ఇంతే వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే నెక్లెస్ రోడ్ తోపాటు ట్యాంక్ బండ్ లో ఫ్రీ వైఫై సేవలను జనం బాగానే వాడుతున్నారు.

“సికింద్రాబాద్ నుంచి ప్రతి రోజు బంజారాహిల్స్ కు వస్తుంటా. నెక్లెస్ రోడ్ లో ఆగి ఏవైనా మెయిల్స్ ఉంటే పంపుతుంటా.” రాజేష్

ఓ ఎంఎన్సీ కంపెనీ మార్కెటింగ్ హెడ్ గా ఉన్న రాజేష్ రెండు నెలల క్రితమే ఓ స్టార్టప్ ప్రారంభించారు. తన పని ఇంటి దగ్గర పూర్తయిన తర్వాత బంజారాహిల్స్ లో క్లెయింట్స్ తో కలవడానికి వస్తుంటారు. అలా దారిలో నెక్లెస్ రోడ్ దగ్గర కారు ఆపి ఆహ్లాదాన్ని పొందడమే కాదు, ఆఫీసు పని కూడా పూర్తి చేస్తున్నారు.

image


వైఫై వినియోగం

సిటీలో దాదాపు 15 చోట్ల బిఎస్ఎన్ఎల్ హాట్ స్పాట్ కేంద్రాలున్నాయి. వచ్చే రెండు నెలల్లో వీటని 20కి పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జనం వినియోగం కూడా ఎక్కువగా ఉండటంతో వైఫై డిమాండ్ ఉందని అంచనా వేస్తున్నారు.

“20 నిమిషాలు ఫ్రీ వైఫై. ఆ తర్వాత ప్రతి అరగంటకు 30 రూపాయలు చొప్పున్న వసూల చేస్తారు”

స్టార్టప్ లకు మంచి లాభం

స్టార్టప్ కంపెనీలంటే పూర్తి స్థాయి ఆఫీసు లాంటివి ఉండవు. వర్చువల్ ఆఫీసులతో పని కానిస్తుంటారు. అలాంటి వారికి ఈ వైఫై ఎంతగానో ఉపయోగపడుతుంది. నగరంలో అన్ని చోట్ల ఉన్న వారూ స్టార్టప్ లు ప్రారంభిస్తున్నారు. ఏదో ప్రాంతాలకు పరిమితం కాలేదు. ఎంజిబిఎస్, నిమ్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వైఫై అందుబాటులో ఉంది. ఉన్న చోటనే ల్యాప్ ట్యాప్ లేదా మొబైల్ కు వైఫై కనెక్ట్ చేసి పని కానీయొచ్చు. నగరంలో ఉన్న స్టార్టప్ లు ఈ నెట్ వినియోగించుకోడానికి అవకాశం ఉంది. ధర కూడా అనుకూలంగా ఉండటంతో సూపర్ ఫాస్ట్ కాకపోయినా ఓ మోస్తరు స్పీడ్ ఉండటం వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది.

image


మరిన్ని హాట్ స్పాట్ లు

నగర వ్యాపంగా హాట్ స్పాట్ లను ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు కానీ అది అంత తొందగా జరిగే పని కానట్లుకనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉన్న చోట్ల మరింత స్పీడ్ పెంచి, మరిన్ని హాట్ స్పాట్ లను ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ప్రభుత్వం తరుపు నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉంది. బిఎస్ఎన్ఎల్ సంస్థకు నగరంలో 4 వేల కిలోమీటర్లకు పైగా ఆప్టికల్ ఫైబర్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ వినయోగించుకోగలిగితే మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది.

అధిగమించాల్సిన అంశాలు

ఫ్రీ వైఫై అని చెబుతున్నారు కానీ అది కనెక్ట్ కావడమే ఓ మిస్టరీ అంటున్నారు వినయోగదారులు.

“నేను వైఫై కనెక్షన్ కోసం కనీసం 30నుంచి 45నిమషాలు దేవులాడుతా” అనూష

అనూష ఓ ఫ్రీలాన్సర్. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఆమె ఎప్పుడైనా కారులో బయటికెళ్లి వైఫై కోసం ప్రయత్నిస్తే ఎప్పూడు కనెక్షన్ కు టైం పడుతుందని అంటున్నారు. స్పీడ్ చాలా తక్కువగా ఉంటోంది. ఈ రెండు అంశాలను అధిగమించాల్సి ఉంది. కరెంట్ కోతలు కూడా ఫ్రీ వైఫైకి పెద్ద అంతరాలు గా తయారయ్యాయి. దీన్ని అధిగమించాల్సి ఉంది.

image


చివరిగా

ఉచిత వైఫై సెంటర్లను నగరం మొత్తం ఏర్పాటు చేస్తే కోవర్కింగ్ స్పేస్ లను మరిన్ని ఏర్పాటు చేయొచ్చు. దీంతో స్టార్టప్ లేదా ఫ్రీ లాన్సర్స్ టీ హబ్ కో లేదా మాదాపూర్ కో ప్రతిరోజూ రావాల్సిన అవసరం ఉండదు. ఉన్న చోట నుంచే వర్క్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది. నగరంలో ఎయిర్ టెల్ సంస్థకు కూడా బాగానే నెట్ వర్క్ ఉంది. కొన్ని చోట్ల ప్రభుత్వంతో కలసి వైఫై స్పాట్ లను ఏర్పాటు చేసింది. ఇది కూడా వైఫై సిటీగా హైదరాబాద్ మారడానికి దోహద పడే అంశం.