ఆస్ట్రియన్ కంపెనీ ట్రిటెలాతో డీల్ సెట్ చేసుకున్న ప్రముఖ సెర్చింజన్ లైకోస్ !!

ఆస్ట్రియన్ కంపెనీ ట్రిటెలాతో డీల్ సెట్ చేసుకున్న ప్రముఖ సెర్చింజన్ లైకోస్ !!

Friday February 12, 2016,

2 min Read

ప్రముఖ సెర్చింజన్, ఇంటర్నెట్ బ్రాండ్ లైకోస్‌ కంపెనీకి- ఆస్ట్రియాకు చెందిన ట్రిటెలాకు మధ్య భారీ డీల్ కుదరింది. ఈ వ్యాపార ఒప్పందంలో భాగంగా ట్రిటెలాకు చెందిన మై ఎస్‌ఎంఎస్‌ మెసెంజర్‌, ఎస్‌పీహెచ్‌ వీన్‌, కికా సోషల్‌- లైకోస్‌ చేతుల్లోకి రాబోతున్నాయి. వైబ్రెంట్ డిజిటల్ తో కలసి హైదరాబాద్ కేంద్రంగా భారత్ లో లైకోస్ పనిచేస్తోంది. వైబ్రెంట్ డిజిటల్స్ కి సురేష్ రెడ్డి సిఈవోగా ఉన్నారు.

image


100శాతం ఓనర్షిప్ కోసం దాదాపు 2,848 కోట్లతో ట్రిటెలాకు చెందిన అన్ని విభాగాలను కొనుగోలు చేసింది లైకోస్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి అప్రూవల్ రావడంతో డీల్ కంప్లీట్ అయిందని సీఈవో సురేష్ రెడ్డి తెలిపారు. ఈ డీల్ ద్వారా క్లౌడ్ టెక్నాలజీలో లైకోస్ తిరుగు లేని కంపెనీ అవుతుంది. ఇప్పటి వరకూ మిగిలిపోయిన డాట్ లను కలుపుకోవడానికి గ్రౌండ్ క్లియర్ అయిందని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మై ఎస్ఎమ్ఎస్ చేజిక్కడం అతిపెద్ద అడ్వాంటేజ్ అన్నారాయన.

“మైఎస్ఎమ్ఎస్ కొనుగోలుతో మా సంస్థ మరింత విస్తరించినట్లయింది” సీఈవో సురేష్ రెడ్డి.
image


LYCOS గురించి..

ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం ఉన్న ఇంటర్నెట్ బ్రాండ్ లైకోస్. బాగా పేరున్న ఈ సంస్థ డిజిటల్ మీడియా, మార్కెటింగ్ తోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT)లాంటి విషయాల్లో పాపులర్. లైకోస్ మీడియా దాదాపు 177 దేశాల్లో 120 భాషల్లో సామాజిక సైట్ లు ఆపరేట్ చేయడానికి ఉపయోగపడుతోంది. లైకోస్ లో ఉన్న అవార్డ్ విన్నింగ్ ప్రాడక్టులు యూజర్లకు మంచి సర్వీసు అందిస్తోంది. లైకోస్ డాట్ కామ్, ట్రైపాడ్,అంగల్ ఫైర్, గేమ్స్ విల్లే, హూవేర్ తోపాటు లైకోస్ మెయిల్ లాంటి ప్రాడక్టులు ఇందులో కొన్ని. దాదాపు 40 బిలియన్ల మందికి డిజిటల్ ప్లాట్ ఫాంలో ప్రకటనలను చేరవేస్తోంది. బ్లూ చిప్, ఎయిర్ టెల్, బ్రిటీష్ ఎయిర్ వేస్, కోకాకోలా, హ్యుండాయ్ మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసి, ఐఎన్జీ, లినోవో,ఎల్ఐసి, మారుతీ సుజుకీ, ఎంటీవీ, పిఅండ్ జీ, ఖతార్ ఎయిర్ వేస్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సైట్లన్నీ లైకోస్ క్లయింట్ లిస్టలో ఉన్నవే. ఐఓటీ లో లైకోస్ అనేది భవిష్యత్ కస్టమర్ల కోసం ఏర్పాటు చేసిన ప్రాడక్ట్ లను ఇప్పుడే సిద్ధం చేసింది. రోజువారి కార్యక్రమాలు ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయడాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అంటారు. లైకోస్ కి ప్రపంచ వ్యాప్తంగా 24 కార్యాలయాల్లో 450మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా, ఇంజ్రయెల్,ఇండియా, వెస్ట్ యూరప్, లాటిన్ అమెరికా దేశాల్లో లైకోస్ కి ముఖ్య కార్యాలయాలున్నాయి.

TriTeIA GmbH గురిచిం క్లుప్తంగా

మొబైల్ ఈకో సిస్టమ్ లో అనేక రకాలైన సొల్యూషన్ లను కలిగి ఉంది ఈ సంస్థ. వీడియో కంటెంట్ సొల్యూషన్ తో పాటు సోషల్ మీడియా లిజనింగ్, ఎంగేజ్ మెంట్ లాంటి కొన్ని అద్భుత సేవలను ఈ సంస్థ అందిస్తోంది. మైఎస్ఎమ్ఎస్ ట్రిటెల్ ఇచ్చే ప్రాడక్టుల్లో ప్రధానంగా చెప్పుకోదగినది. అన్ని యాప్ స్టోర్ లలో కలిపి మైఎస్ఎమ్ఎస్ కి మూడు మిలియన్ల డౌన్ లోడ్స్ ఉన్నాయి. స్టార్టప్ లకు బిటు బిసొల్యూషన్ చూపించడం ఈ సంస్థ ప్రధాన ఆదాయ మార్గం.