టీసీఎస్ లో ఉద్యోగం వదిలేసి తెలుగు బ్లాగ్ నడుపుతున్న తెనాలి కుర్రాడు

టీసీఎస్ లో ఉద్యోగం వదిలేసి తెలుగు బ్లాగ్ నడుపుతున్న తెనాలి కుర్రాడు

Friday May 20, 2016,

3 min Read

స్టార్టప్ కోసం ఏకంగా టీసిఎస్ ఉద్యోగం వదిలేశాడు తెనాలికి చెందిన రవి. అది కూడా మొదటి తెలుగు బ్లాగిగ్ సైట్. స్మార్ట్ తెలుగు పేరుతో తెలుగులో రన్ అవుతున్న ఆబ్లాగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. మొదటి ఏడాది పెద్దగా రెవెన్యూ రాలేదు కానీ ఇప్పుడిప్పుడే బ్రేకివెన్ దాటేసానని అంటున్నారు రవి.

ఫెయిలైన మొదటి స్టార్టప్

ఏడేళ్లు ఐటి రంగంలో పనిచేశారు. టిసిఎస్ లో ఐటి అనలిస్ట్ ఉద్యోగం. కానీ సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన. దీంతో ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసారు రవి.

”ఐటి ఆధారిత స్టార్టప్ ప్రారంభించా, అయితే అది పూర్తి స్థాయిలో నడవలేదు,” రవి
image


అలా బండి ముందుకు సాగక పోవడంతో మొదటి స్టార్టప్ షట్ డౌన్ చేయాల్సి వచ్చిందని అంటారాయన. అయితే ఈ స్టార్టప్ రన్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ ట్రిప్స్, అనాలసిస్, స్ట్రాటజీలు మాత్రం బాగా నేర్చుకున్నారు. తన స్టార్టప్ ఫెయిల్ కాడానికి కారణాలను తెలుపుతూ రాసిన ఒక పోస్ట్ కు భారీగా లైకులు రావడం తనకే ఆశ్చర్యం కలిగించిదట. అప్పుడే చాలా మంది ఫ్రెండ్స్ తనని డిజిటల్ క్యాంపైన్ పై సలహాలు అడిగేవారట.

స్మార్ట్ తెలుగు ప్రారంభం

తరచూ చాలా మంది స్నేహితులు తన దగ్గరకు వచ్చి చాలా సమస్యలు చెప్పేవారట. వారికి పరిష్కారాలు చూప్పడం అలవాటు చేసుకున్న రవి స్మార్ట్ తెలుగు ప్రారంభించారు.మొదటి స్టార్టప్ ఫెయిలై, రెండోది ఏ రంగంలో ప్రారంభించాలని అనుకుంటుండగా ఈ ఆలోచన వచ్చిందట.అప్పుడొక మ్యాగజైన్ లో వచ్చిన ఆర్టికల్ తనని పూర్తిగా తెలుగు బ్లాగ్ ప్రారంభిచేలా చేసిందట. సౌతిండియాలో ఒక శాతం మాత్రమే బ్లాగులున్నాయనేది ఆ ఆర్టికల్ సారాంశం.

“నాకున్న ఆన్ లైన్ మార్కెటింగ్ , ఆన్ లైన్ బిజినెస్ నాలెడ్జి కొందరికయినా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తెలుగులో బ్లాగ్ రాయటం మొదలుపెట్టాను.” రవి

ఇప్పుడీ బ్లాగ్ తెలుగులో నడుస్తోన్న ఎన్నో బ్లాగులకు స్పూర్తినిచ్చింది. తనని చూసి చాలా మంది బ్లాగులు ప్రారంభించారని అంటారయన.

స్మార్ట్ తెలుగు పనితీరు

నెలకి 12వేల మంది యూజర్లున్నారు. ఫేస్ బుక్ లో ఈ సైట్ కి 25వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెయిల్ ద్వారా రిజిస్ట్రర్ అయిన వారి సంఖ్య 9వేలు. అప్పటికే మార్కెటింగ్ లో గూగుల్ సర్టిఫైడ్ కావటం, ఐటి ఇండస్ట్రీ లో ఉన్నపుడు క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి టెక్నాలజీల పైన పని చేసిన అనుభవం ఉండటంతో బ్లాగ్ చదివే కొంత మంది బిజినెస్ పీపుల్ కి వెబ్ సైట్ , ఆన్ లైన్ మార్కెటింగ్ విషయాలలో గైడ్ చేయటం ప్రారంభించారు రవి.తన బ్లాగ్ చదివే రీడర్స్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ , SEO కోచింగ్ , బ్లాగ్ లో Affiliate Ads ద్వారా మనీ సంపాదించటం మొదలుపెట్టారు.

“నేను Software Job చేస్తునప్పుడు అందుకున్న శాలరీ కంటే ఎక్కువ మనీ నాకు ఇప్పుడు బ్లాగింగు ద్వారా వస్తుంది.” రవి

సాఫ్ట్ వేర్ కంటే స్మార్ట్ తెలుగే లాభదాయంగా ఉందని అంటారాయన.

స్మార్ట్ తెలుగు టీం

ఇక టీం విషయానికొస్తే దీని ఫౌండర్ రవి గురించే చెప్పాలి. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నుంచి 2006 లో ఎంసిఏ పూర్త చేశారు. అనంతరం హెచ్ సిఎల్, టిసిఎస్ లాంటి కంపెనీల్లో దాదాపు ఏడేళ్లు పనిచేశారు. చివరకి రాజీ నామా చేసి ఇప్పుడీ స్టార్టప్ ప్రారంభించారు. మొదటి ఏడాదంటా ఏక్ నిరంజన్ లాగా ఒక్కరే నడిపారట. ఇప్పుడు ఆరుగురు ఫ్రీ లాన్స్ ఉద్యోగులను ఎపాయింట్ చేశారట.

ప్రధాన సవాళ్లు

1. ఒక బ్లాగ్ మెంటేన్ చేయాలంటే భూదేవంత సహనం ఉండాలని అంటారు రవి. పేషెన్సీ లేకపోతే బ్లాగ్ సస్టేన్ కాదని అంటారాయ. ఇది పెద్ద సవాలని దీన్ని అధిగమిస్తున్నా అన్నారు.

2. రీడర్స్ కి ఒరిజినల్ కంటెంట్ అందించడం, సోర్స్ వెతకడం పెద్ద సవాలంటున్నారు.

3. టీసిఎస్ లో ఉద్యోగం మాసేసి ఇంటి దగ్గర పనిచేస్తుంటే తెలిసిన వారంతా గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. వారికి సమాధానం చెప్పడం పెద్ద సవాలని నవ్వుతూ బదులిచ్చారు.

ఫండింగ్,భవిష్యత్ ప్రణాళికలు

గతేడాది ఫ్రెండ్స అండ్ ఫ్యామిలీ నుంచి కొద్దిమొత్తం లో నిధులు సమకూర్చుకున్నారు. మరిన్ని వర్టికల్ లలో మరిన్ని కాన్సప్ట్ లను ఇంప్రుమెంట్ చేయడానికి ఫండింగ్ అవసరం అంటు న్నారు. సస్టేనబుల్ రెవెన్యూ మొడ్ లో తమం కంపెనీ ఉండటంతో ప్రీ సిరీస్ ఏ రౌండ్ ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.

మంచి ఆన్ లైన్ బిజినెస్ ఆలోచన ఉండి కుడా ఆచరణ తెలియక ఆగిపోతున్న తెలుగు వారికి ఈ బ్లాగ్ ద్వారా మంచి పరిజ్ఞానం అందించాలి.గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్ , ఫేస్ బుక్, లింకి డిన్ లాంటి సోషల్ నెట్వర్క్ సైట్స్ ద్వారా బిజినెస్ ని మార్కెట్ చేసుకునే ప్రక్రియ అందరికి తెలియజేయాలని అన్నారు. వచ్చే 6నెలల్లో యాప్ లో కూడా స్మార్ట్ తెలుగు అందుబాటులో ఉంటుందని అన్నారు.

image


“మంచి ఐడియా వేరు,దాన్ని ఆచరణలో పెట్టటం వేరు. ఒక ఐడియాని స్టార్ట్ అప్ గా మార్చే ప్రక్రియ మీద సరైన అనుభవం లేక మొదట ఫెయిల్ అయ్యాను. ఇదే తన విజయ రహస్యమని ముగించారు రవి.”

.