మీకు ఆంట్ర‌ప్రెన్యూర్ కావాల‌నుందా? అయితే మేం ట్రైనింగ్ ఇస్తాం!!

మీకు ఆంట్ర‌ప్రెన్యూర్ కావాల‌నుందా? అయితే మేం ట్రైనింగ్ ఇస్తాం!!

Sunday January 31, 2016,

2 min Read

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ఇప్పుడు ది ఆంట్రప్రెన్యూర్ జోన్ గా మారింది. దీనిలో స్టార్టప్ ప్రారంభించడానికి కావల్సిన తర్ఫీదు ఇస్తుంది. దీంతోపాటు స్టార్టప్ ఐడియాతో వచ్చిన వారిని ఆర్థికంగా, మానసికంగా మద్దితిచ్చి సన్నద్ధం చేస్తుంది.

విద్యార్థి దశనుంచే ఆంట్రప్రెన్యూర్షిప్

సాధారణంగా ఏదైనా సంస్థలో పనిచేసి అక్కడ అనుభవం గడించిన తర్వాత సొంత సంస్థను ప్రారంభించాలంటారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కాలేజీ నుంచి బయటకి వచ్చిన వెంటనే స్టార్టప్ మొదలు పెట్టాలనే ఆటిట్యూడ్ నేటితరంలో కనిపిస్తోంది. కాలేజీ చదువుతున్న రోజుల నుంచే బోల్డన్ని ప్రణాళికలు తయారు చేస్తారు. అందులో కొంతమంది మాత్రమే స్టార్టప్ ప్రారంభిస్తున్నారు. మిగిలిన వారంతా ఉద్యోగులుగా స్థిరపడిపోతున్నారు. దానికి కారణాలనేకం. అలాంటివారికి మా సంస్థ సాయం అందిస్తుందని నందితా సేథి అంటున్నారు.

“విద్యార్థి దశలో ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాలను స్టార్టప్ లుగా మార్చే కార్యక్రమం చేపడుతున్నాం”- నందిత

హైదరాబాద్ కేంద్రంగా TEZ ప్రారంభమైన కొత్త స్టార్టప్ ల ప్రారంభానికి నాంది పలుకుతోంది. నందిత ఈ సంస్థకు ఎండిగా వ్యవహరిస్తున్నారు.

image


ఇంక్యుబేషన్ ఏర్పాటు

ఇప్పటికే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఓ సెంటర్ నడుపుతోన్న టిఈజెడ్ ఓ ఇంక్యుబేషన సెంటర్ గా మార్చాలని చూస్తున్నారు. ఇందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వాటిని మరింత మెరుగుపరుస్తామని అంటున్నారు.

“ఇన్వెస్టర్లు చాలామందే ఉన్నారు. వారికి స్టార్టప్ లను వెతికి పెట్టే బాధ్యత మేం చేపడతాం,” నందిత

స్టార్టప్ లకు ఫండింగ్ ఇవ్వడానికి చాలా మంది ఇన్వెస్టర్లు ఉన్నారని , వారికి సరైన స్టార్టప్ వెతికి పెట్టే బాధ్యత చేపడుతున్నామని అంటున్నారు నందిత. స్టార్టప్ ఫౌండర్లకు సరైన ట్రెయినింగ్ ఇవ్వడం ద్వారా ఇన్వెస్ట్ మెంట్ కు బరోసా కలిగేలా చేస్తామంటున్నారామె.

image


సవాళ్లు

సరైన స్టార్టప్ ను వెతకడం పెద్ద సవాలుగా నందిత చెప్పుకొచ్చారు. స్టార్టప్ ఐడియా బాగున్నప్పటికీ ఒకసారి ఫండింగ్ వచ్చాక అది ఏ స్థాయిలో వినియోగం అవుతుందనే విషయంపై ఫండింగ్ చేసేవారికికు క్లారిటీ ఉండదు. నిధులు పూర్తి స్థాయిలో వినియోగం అయితేనే స్టార్టప్ కు మరిన్ని ఫండ్స్ రాడానికి అవకాశం ఉంటుంది. ప్రాడక్ట్ బ్రాండ్ వేల్యూ పెరిగి లాభాల భాటపడుతుంది. ఇదంతా జరగాలంటే ఫౌండర్ ని బట్టే ఉంటుంది. ఫౌండర్ ని గుర్తించడం కూడా సవాలే. ఈ సవాలుని అధిగమించడానికి స్టార్టప్ ఫౌండర్లకు తాము తర్ఫీదు ఇస్తామని నందిత అంటున్నారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

జెన్ స్కిల్ ప్రోక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాడక్టుగా జనం ముందుకొచ్చిన ది ఆంట్రప్రెన్యూర్ జోన్(టిఈజెడ్) ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ నుంచి స్టార్టప్ ట్రెయినింగ్ సెంటర్ గా మారింది. దీన్ని పూర్తిస్థాయి ఏంజిల్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీగా మార్చాలని చూస్తున్నారు. ఫండింగ్ , మెంటార్షిప్ సర్వీసులు పూర్తిస్థాయిలో తీసుకు రావాలని చూస్తున్నారు. దీంతో పాటు ఇంకొన్ని క్యాంపస్ లలో విస్తరించాలని చూస్తున్నారు.