స్టార్టప్ ఫండింగ్ సమస్యలకు పరిష్కారం చూపే 'టెర్మ్ షీట్'

0

నిధులు సమకూర్చుకోవాలనుకునే ప్రతీ స్టార్టప్ ఫౌండర్‌కీ వ్యవస్థాపక లాంఛనాలు పూర్తిచేయడానికి ఎంత బాధపడాలో తెలుసు. మొదటిసారి ఇందులోకి అడుగుపెట్టేవాళ్లకి ఫండింగ్ డాక్యుమెంట్లలోని నియమ నిబంధనలు తెలీవు. ఒక స్టార్టప్ ఫౌండర్‌గా వ్యాపారాభివృద్ధిపై పెట్టినంత దృష్టిని ఫండింగ్ ప్రాసెస్ సహా ఇతర అంతర్గత విషయాల మీద అంతగా ఉండదు.

ఒక్కసారి మీరు స్టార్టప్ కోసం పెట్టుబడిదారుని కనిపెట్టగానే డీల్-మేకింగ్‌ని సులభతరం చేస్తుంది టెర్మ్ షీట్.ఐఒ(termsheet.io). ప్రస్తుతం సీడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మీద దృష్టి పెట్టిన టెర్మ్ షీట్ బృందం ఈ డీల్స్‌లో ఉండే అవరోధాలను, సమస్యలను తొలగించేందుకు ఏదో ఒక వ్యూహమో, పద్ధతో అనుసరిస్తుంది. ముఖ్యంగా రెండు అంశాల మీద దృష్టి పెడుతున్నారు. మొదటిది పెట్టుబడిదారులు, స్థాపకులు - రెండోది ఫండింగ్‌ను విడతలుగా ఏర్పాటుచెయ్యడం, చివరగా డీల్స్‌ను ముగించడం (నిబద్ధతతో వ్యవహరించడం, చెల్లింపులను నిర్వహించడం, పేపర్ వర్క్ తయారుచెయ్యడం).

టెర్మ్ షీట్ కథ

2014లో కాంట్రాక్ట్ ఆటోమేషన్ స్టార్టప్ అయిన హంబుల్ పేపర్‌ను స్థాపించారు వివేక్ దురై. ఫౌండర్స్, పెట్టుబడిదారుల కోసం నిధుల సమీకరణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఈ సంస్థని ప్రారంభించారు. స్టార్టప్ ప్రారంభంలోనే నిధుల సమీకరణలో ఎవరికైనా....అంటే పెట్టుబడిదారులకు, ఫౌండర్స్ కు, లాయర్లకు కూడా ఉపయోగపడేలా, ఒక క్రియేటివ్ కామన్స్ లైసెన్స్‌కి సంబంధించిన చట్టపరమైన డాక్యుమెంట్లను విడుదల చెయ్యడంతో ప్రారంభించాడు. ఎవరైనా ఇంటర్నెట్ నుంచి పత్రాలను డౌన్ లోడ్ చేసుకుని వాటిని డీల్ ముగించడానికి ఉపయోగించవచ్చు.

మొదట దశలో ఫండింగ్ రౌండ్స్ అన్నీ ప్రామాణికంగా ఉంటాయి. ఇందులో ఎక్కువసేపు చర్చించుకోవడాలు లేదా లాయర్లు ఉండవల్సిన అవసరం ఇటువంటివి ఏమీ ఉండవు. ఈ ఆలోచన వెనుక ఉద్దేశ్యం ఇదే. చాలా వరకూ అటువంటి డీల్స్ నియమనిబంధనల విషయంలో విఫలమవుతూ ఉంటాయి. ఒకవేళ ఫండింగ్ ప్రక్రియ మొదలైనా, సాధారణంగా ఉండే వ్యాపార మనస్తత్వం వల్ల ఇందులో ఇమిడిఉన్న వ్యక్తుల మధ్య ఉండే అపనమ్మకం, చర్చలు విభేధాలకు దారితీయడం వంటివి జరుగుతాయి.

పెట్టుబడిదారులు మొదటి దశలోనే తమ పెట్టుబడికి ఎక్కువ ఫలితం ఆశిస్తే, తర్వాత దశల్లో నిధులు సమకూర్చుకోవడానికి స్టార్టప్ ఫౌండర్ పై ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఇది చాలా సాధారణంగా జరిగేదే. ఎందుకంటే ఒక్కో పెట్టుబడిదారు తాము తొలి దశలో పెట్టుబడిని తదుపరి దశకు ఉపయోగించుకోమని మరింత ఫలితాన్ని ఇవ్వమని కోరతారు.

ఓపెన్ సోర్స్ ప్రయోగం పనిచేసింది, ఒక కొత్త శకానికి పరుగులు పెట్టింది. 2014 నవంబరు, డిసెంబరు సమయానికి హంబుల్ పేపర్‌ని టెర్మ్ షీట్.ఐఒ గా, అంటే స్టార్టప్స్ కోసం నిధులు సమకూర్చే వేదికగా మర్చేసారు వివేక్. ట్యాగ్ లైన్ గా “జీరో-ఫ్రిక్షన్ సీడ్ రౌండ్స్” అని పెట్టారు, అంటే మొదటి రౌండ్లలోనే కష్టనష్టాలకి గురవ్వకుండా అని అర్ధం. స్టార్టప్స్‌ని వెతికి పట్టుకుని సరైన పెట్టుబడిదారులని మిళితం చేస్తూ... ప్రామాణికమైన డాక్యుమెంట్స్, ప్రోటోకాల్స్‌ని ఉపయోగించి రౌండ్స్‌ని ముగించే లక్ష్యంతో 2014 డిసెంబరులో టెర్మ్ షీట్.ఐఒ మొదలైంది. 

“సింపుల్ గా చెప్పాలంటే, తొలి దశ పెట్టుబడిని పెంచడమే టెర్మ్ షీట్ లక్ష్యం, కానీ అది నాణ్యతతో కూడిన అత్యుత్తమ పద్ధతిలో చెయ్యాలని ఉద్దేశ్యం. అధిక సామర్ధ్యమున్న ఫౌండర్‌ని వెతికి, సహాయం అందించే దిశగా ముందుకు సాగుతున్నాం” అంటూ వివరిస్తున్నారు వివేక్.

“అది అంత సులువేమీ కాదు”, అని కూడా అంటారు వివేక్. “ఒక డీల్ కోసం అన్ని ప్రక్రియల్ని పూర్తిచేసేందుకు చాలా సమయం పడుతుంది. ఒక రౌండ్‌లో ఒక్క ప్రవాస పెట్టుబడిదారు భాగస్వామి అయినా ప్రక్రియల్ని పూర్తిచేసేందుకు సమయం పెరిగిపోతుంది. బ్యాంకులు త్వరిత గతిన పనిచేసి మాకు సహకరించాలి…అదే సమయంలో విదేశీ బ్యాంకులు, ముఖ్యంగా అమెరికా బ్యాంకులు చాలా తక్కువ సహకారాన్ని అందిస్తాయి.”

ఆరుగురు బృందంతో చెన్నై ఐఐటి రీసెర్చ్ పార్క్‌లో ప్రారంభమైన టెర్మ్ షీట్, డీల్-మేకింగ్ మరియు సాంకేతికత అంశాల మీద పనిచేస్తోంది, మరింత విస్తరిస్తోంది. “మాకు ఉద్యోగులు కావాలి. కానీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటాం, ఎందుకంటే ఇందులో భాగమవ్వాలంటే ఒక విధమైన ధైర్యంతో అడుగెయ్యాలి. ప్రస్తుతం ప్రారంభ ఆవేశాన్ని దాటి మేము చాలా ప్రయాణం చెయ్యాలి, ఈ వ్యాపారంలోనే కొనసాగాలి. “మా లక్ష్యం ఎక్కువ డీల్స్ ని సాధించడం కానీ ఆరంభ దశల్లో మేం ఎవరితో పనిచెయ్యాలనుకుంటున్నామో జాగ్రత్తగా ఎంచుకోవాలి. స్టార్టప్ ప్రారంభ దశలో, ప్రయోగం చెయ్యడం…నేర్చుకోవడాలే చాలా కీలకం. మేము ఈ విషయానికే సరిపడా సమయం కేటాయించాం.”

కపిక్, ఐజిల్ , లివ్ బ్రైలీ స్టార్టప్స్ కి నిధులు సమకూర్చుకునేందుకు వీరు ఇప్పటికే సహకరించారు. ఏథర్ ఎనర్జీకి కూడా వారి సీడ్ రౌండ్ ముగింపు భాగానికి సహకరించారు.

వీరి వ్యాపార మోడల్ చాలా సింపుల్ గా ఉంటుంది. పెద్ద డీల్స్ కి నిధుల సమీకరణలో ఒక శాతం, చిన్న డీల్స్ కి రెండు శాతం వసూలు చేస్తారు. కేవలం నిధుల సమీకరణే కాకుండా మరింత సహకారం అందిస్తారు. ఇండియాలో వీరికి గట్టి పోటీదారు లెట్స్ వెంచర్. అంతర్జాతీయంగా అయితే ఏంజిల్.కో

ఫౌండర్స్ ఇతర ఫౌండర్స్ కి సహకారం అందించే ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్ ని కూడా ప్రకటించింది టెర్మ్ షీట్. అదే మనీబాల్. టెర్మ్ షీట్ ఉద్యోగుల మధ్యవర్తిత్వంలో జరిగే చర్చల ద్వారా ఎంపిక చేసిన కొద్దిమంది ఫౌండర్స్ నుంచి మంచి పెట్టుబడిదారుల (పరిమిత సంఖ్యలో వెంచర్ క్యాపిటలిస్ట్ లు) వరకూ పరిచయం చేసే ఒక వేడుక.