ఓ స్టార్టప్‌లో ఉద్యోగి ఎలా పనిచేయాలో అమన్‌ను చూసి నేర్చుకోవచ్చు !

ఎంత పెద్ద కంపెనీ అయినా.. ఉద్యోగుల ప‌నితీరుపైనే దాని దాని అభివృద్ధి ఆధార‌ప‌డి ఉంటుంది. ఉద్యోగులు క‌ష్టాన్ని ఎంత ఇష్ట‌ప‌డితే అంత ప్ర‌తిఫ‌లం ఉంటుంది కంపెనీకి. అలాంటి ఉద్యోగే ఇస్మ‌తుల్లా అమ‌న్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విద్యాసంస్థ‌లు ఉప‌యోగిస్తున్న ఫెడెనా సాఫ్ట్‌వేర్‌ను త‌యారుచేసిన ఫోరాడియ‌న్ టెక్నాల‌జీస్ సంస్థ ఉద్యోగి. అంద‌రు ఉద్యోగుల్లా వారానికి ఐదు రోజులు, రోజుకు ఎనిమిది గంట‌లు ప‌నిచేసే మ‌న‌స్త‌త్వం కాదు అమ‌న్‌ది. కంపెనీని త‌న కుటుంబంలా భావిస్తూ దాని అభివృద్ధికి అహ‌ర్నిశ‌లు కృషిచేస్తున్నఉద్యోగి అత‌ను.

ఓ స్టార్టప్‌లో ఉద్యోగి ఎలా పనిచేయాలో అమన్‌ను చూసి నేర్చుకోవచ్చు !

Monday May 04, 2015,

3 min Read

"మ‌న‌సుకు ఇష్టం లేకుండా స్టార్ట‌ప్ కంపెనీలో ప‌నిచేయొద్దు. వారానికి 40 గంట‌ల ప‌ని, నెల చివ‌ర జీతం, ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో ప‌ని, స్థిర‌మైన జీవితాన్ని కోరుకునే వారికి స్టార్ట‌ప్ కంపెనీ సూట్‌ అవ‌దు. త‌మ‌లో ఉన్న పూర్తి జ్ఞానాన్ని ఇచ్చేందుకు ఎవ‌రైతే సిద్ధంగా ఉంటారో, ఎవ‌రైతే ప‌రిమితిలు లేకుండా ప‌నిచేసేందుకు ఇష్ట‌ప‌డ‌తారో, క‌ష్ట‌ప‌డిప‌నిచేసేందుకు సిగ్గుప‌డ‌రో, నేర్చుకోవ‌డాన్ని ఎవ‌రైతే జీవితాంతం కొన‌సాగిస్తారో వారే స్టార్ట‌ప్స్‌ల‌కు సూట‌వుతారు" అని అంటారు ఇస్మ‌తుల్లా అమ‌న్‌.
ఇస్మ‌తుల్లా అమ‌న్‌

ఇస్మ‌తుల్లా అమ‌న్‌


ఫోరాడియ‌న్ టెక్నాల‌జీస్‌.. బెంగ‌ళూరు కేంద్రంగా విద్యా సంస్థ‌ల‌కు ఈఆర్పీ సొల్యూష‌న్స్ సాఫ్ట్‌వేర్ సంస్థ‌. సంస్థ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, డైరెక్ట‌ర్ ఏ విశ్వ‌జిత్.. అమ‌న్‌ను నామినేట్ చేశారు. ప్రాడక్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ కంపెనీ అయిన ఫోరాడియ‌న్ టెక్నాల‌జీస్‌కు ఇంజినీరింగ్ విభాగ‌మే బ్యాక్ బోన్‌. సాంకేతిక అనుభ‌వం, మేనేజ‌రియ‌ల్ స్కిల్స్‌, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలున్న అమ‌న్‌.. ఫోరాడియ‌న్ టెక్నాల‌జీస్ ప్ర‌ధాన ప్రాడ‌క్ట్ అయిన‌ ‘ఫెడెనా’ టీమ్‌కు లీడ‌ర్‌. సంస్థ అభివృద్ధి కోసం ఆరంభం నుంచి అహ‌ర్నిశ‌లు పాటుప‌డుతున్నారు. సంస్థ స్థితిగ‌తుల‌పై మంచి అవ‌గాహ‌న ఉన్న అమ‌న్ ఫోరాడియ‌న్ కంపెనీ సంస్కృతికి అనువైన వ్య‌క్తుల‌ను ఎంపిక‌చేస్తుంటార‌ని విశ్వ‌జిత్ అంటుంటారు. త‌న ప్రాజెక్ట్ వ‌ర్కే కాకుండా హెఆర్ టీమ్‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేయ‌డంలో స‌హ‌క‌రిస్తుంటారు.

ఫోరాడియ‌న్ టెక్నాల‌జీస్‌లో జూలై, 2010లో అమ‌న్‌ వెబ్ డెవ‌ల‌ప‌ర్‌గా చేరారు. ఫ్రెష‌ర్‌గా అమ‌న్‌ చేరిన‌ప్పుడు కంపెనీ వ‌య‌సు ఏడాది మాత్ర‌మే. అప్ప‌టినుంచి సంస్థ క్ర‌మ‌క్ర‌మంగా అభివృద్ధి సాధిస్తున్న‌ది. ఫోరాడియ‌న్ స్టోరీ త‌న‌కు స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తుంద‌ని ఇస్మ‌తుల్లా అమ‌న్ చెప్తున్నారు.

"ఫోరాడియన్‌ను ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి చూస్తున్నాను, దాని గురించి వింటున్నాను. జీవితంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌నుకునే నాలాంటి వారికి ఫోరాడియ‌న్ క‌థ ఎంతో స్ఫూర్తిదాయ‌కం. ఫోరాడియ‌న్ పురుడుపోసుకున్న న‌గ‌రం నుంచే నేను కూడా వ‌చ్చాను. ఇలాంటి స్టార్ట‌ప్స్ బూమింగ్ ఉన్న స‌మ‌యంలో ఈ కంపెనీ కూడా ప్రారంభ‌మైంది. ఇందులో నేను కూడా భాగం కావాల‌ని ఆ కంపెనీలో చేరా"

నాలెడ్జ్‌, ప‌ట్టుదల కార‌ణంగానే ఇస్మ‌తుల్లా అమ‌న్ మంచి స్టార్ట‌ప్ ఎంప్లాయిగా కాగ‌లిగార‌ని అంటారు విశ్వ‌జిత్‌. మేనేజ్‌మెంట్ స్కిల్స్‌, సాంకేతిక ప‌రిజ్ఞానం క‌ల‌గ‌లిసి ఉండ‌టం చాలా అరుద‌ని, ఈ రెండు అరుదైన ల‌క్ష‌ణాలు ఇస్మ‌తుల్లా అమ‌న్‌లో ఉన్నాయ‌ని చెప్పారు.

తన కెరీర్‌లో మొద‌టి సంస్థ అయిన ఫోరాడియ‌న్‌లో గ‌త నాలుగేళ్లుగా అమ‌న్‌ కొన‌సాగుతున్నారు. ఎప్పుడైతే సంస్థ‌కు అవ‌స‌ర‌ముంటుందో అప్పుడు త‌న అస‌లుసిస‌లు ప‌నితీరును ప్ర‌ద‌ర్శిస్తారు. ఆయ‌న చిత్త‌శుద్ధిని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌జాల‌రు. టీమ్ లీడ‌ర్‌గా ఇత‌ర టీమ్‌ల‌కు వార‌ధిగా నిలుస్తారు. ఫెడెనా వృద్ధికి సంబంధించిన స‌మాచారం, విశ్లేష‌ణ‌, వ్యూహం, డిజైన్‌ల‌తోపాటు డెవ‌ల‌పింగ్ అంశాల్లో త‌న టీమ్‌ను గైడ్ చేయ‌డంలో కూడా అమ‌న్‌కు తిరుగులేదు. మేనేజ్ రిలీజెస్‌, రిక్రూట్‌మెంట్స్ వంటి ఆర్ అండ్ డీ వ‌ర్క్‌ల్లోనూ భాగం పంచుకుంటారు.

"స్టార్ట‌ప్స్‌లో ఉద్యోగం అంటే స‌రైన నిర్వ‌చ‌న‌మేదీ ఉండ‌దు. అన్ని విభాగాల్లోనూ ప‌నిచేయాల్సి ఉంటుంది. మ‌ల్టీ టాస్క్‌ను మెరుగుప‌ర్చుకోవాలి" అంటారు అమ‌న్‌.

సంస్థ‌లోఅన్ని బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించేందుకు తాను ఇష్ట‌ప‌డుతానంటారు అమ‌న్‌. కోడింగ్ చేయ‌డాన్ని ఇష్ట‌ప‌డ‌తారు. కానీ టీమ్ లీడ‌ర్‌గా ఆ బాధ్య‌త‌లు ఎక్కువ‌గా తీసుకునే అవ‌కాశ‌ముండ‌దు. సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చ‌ర్ డిజైనింగ్‌ను ఎంతో ఎంజాయ్‌చేస్తారు. అలాగే అన్ని అంశాల్లోనూ త‌న టీమ్‌కు స‌హాయ స‌హకారాలు అందిస్తారు. ఇక కొత్త ఉద్యోగిని ఎంపిక‌చేయ‌డం చాలా శ్ర‌మ‌తో కూడుకున్న‌దైనా, దాన్ని ఎంతో ఇష్టంగా చేస్తారు. సంస్థ‌లోకి కొత్త ఉద్యోగి రావ‌డ‌మంటే, సంస్థ ఎదుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డాలి. అందువ‌ల్ల సంస్థ‌కు ఉప‌యోగ‌ప‌డే, సంస్థ సంస్కృతికి అడ్జ‌స్ట‌య్యే వ్య‌క్తుల‌ను ఎంపిక‌చేస్తారీయ‌న‌. టీమ్ లీడ‌ర్‌గా జ‌ట్టు అభివృద్ధి గురించి త‌న‌తోపాటు ప‌నిచేసే ఉద్యోగుల‌కు వివ‌రిస్తారు. త‌న‌లాగే ఎంతో మంది ఫ్రెష‌ర్ల‌కు ఆయ‌న త‌న జ‌ట్టులో చోటు క‌ల్పించారు. విజేత‌లకంటే విజేత‌ల‌వ్వాల‌నుకునే వ్యక్తుల‌కే అవ‌కాశం క‌ల్పిస్తారు. ఆ త‌ర్వాత త‌మ టీమ్‌కు త‌గ్గ‌ట్టుగా వారిని మ‌ల్చుకుంటారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫెడెనా సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగిస్తున్న నేప‌థ్యంలో ఆ విభాగంలో ప‌నిచేయ‌డం స‌వాలుతో కూడుకున్న‌ది. ఈ స‌వాలును అమ‌న్‌ టీమ్ స‌మ‌ర్థంగా నిర్వహించాలంటే, ఒక్క కోడింగ్‌తో స‌రిపెట్టుకుంటే స‌రిపోదు. కింది స్థాయి నుంచి అన్ని రంగాల్లోనూ వృద్ధి చెందుకుంటూ రావాల్సి ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి అందులో ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. ఈ స్థాయిలో టీమ్‌ను సిద్ధం చేయ‌డం స‌వాలుతో కూడాకున్న‌దే కాకుండా.. చాలా ఆస‌క్తిదాయ‌క‌మైన‌ది కూడా. ఈ బాధ్య‌త‌ల‌ను అమ‌న్ నేతృత్వంలోని టీమ్ స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్న‌ది. ఫెడెనా టీమ్‌లో 11 మంది ప‌నిచేస్తున్నారు.

ఫోరాడియ‌న్‌తో క‌లిసి ప‌య‌నిస్తున్న కాలంలో సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు, గురువుల నుంచే కాకుండా ఇత‌రుల నుంచి కూడా తాను ఎంతో నేర్చుకున్నానంటారు అమ‌న్‌. నిరంత‌రం నేర్చుకోవాల‌న్న త‌న మార్గంలో న‌డ‌వ‌డం త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని చెప్తారు.

image


ఫెడెనా టీమ్‌తో అమ‌న్ నిరంతరం ప‌నిచేస్తున్నా.. వృత్తి బ‌య‌ట త‌న‌కిష్ట‌మైన హాబీల‌ను కూడా వ‌దిలిపెట్ట‌రు. కిక్ బాక్సింగ్, డ్యాన్స్.. ఈ యువ ఐటీ ప్రొఫెష‌న‌ల్‌కు ఎంతో ఇష్టం. ప్ర‌తిరోజూ ఇంట్లో డ్యాన్స్ చేయ‌డ‌మే అమ‌న్‌కు ఉత్ప్రేర‌కంగా పనిచేస్తుంద‌ని విశ్వ‌జిత్ అస‌లు ర‌హస్యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఫోరాడియ‌న్ సంసృతి, విలువ‌ల‌ను ప్ర‌తిబింబించేలా ప‌నిచేయ‌డం వ‌ల్లే ఇస్మ‌తుల్లా త‌న కెరీర్‌లో స‌క్సెస్ కాగ‌లిగారు.

"నీటిలాగే ఏ ఆకారంలోనైనా మ‌న‌గ‌లిగే సామ‌ర్థ్యం ఫోరాడియ‌న్ సొంతం. మ‌న‌మెట్లా చూస్తే ప్ర‌పంచం అలాగే క‌నిపిస్తుంది. ఏదైనా ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకొని అందులో ఉన్న‌త స్థితిలో ఫిట్ అయ్యేందుకు ప్ర‌య‌త్నించాలి. అనువుగా లేని ప‌రిస్థితుల గురించి ఫిర్యాదు చేయ‌డం కంటే.. ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ను సంతోషంగా అనుభ‌వించ‌డ‌మే మంచిది. ప్ర‌తి ఒక్క‌రూ నేర్చుకోవ‌డం ఆపొద్దు. నేర్వ‌డం ఆగిపోతే.. జీవితం ఆగిన‌ట్టే" అని అంటారు ఇస్మ‌తుల్లా అమ‌న్‌.