చౌకలో ఇంటిని స్మార్ట్‌గా మార్చి.. కరెంట్ ఆదా చేస్తున్న ఐఐటి విద్యార్ధులు

చౌకలో ఇంటిని స్మార్ట్‌గా మార్చి.. కరెంట్ ఆదా చేస్తున్న ఐఐటి విద్యార్ధులు

Wednesday November 04, 2015,

3 min Read

"టెక్నాలజీతో జీవితాన్ని సులభంగా గడిపేయండి" అంటున్నారీ ఐఐటి విద్యార్దులు. ఎలాంటి ఖర్చూ లేకుండా, సురక్షితమైన, కరెంటును ఆదా చేసే తమ వైర్‌లెస్ హోం ఆటోమేషన్‌ను ఉపయోగించుకోమని కోరుతున్నారు. రిమోట్ కంట్రోల్ ఆపరేటింగ్ టెక్నాలజీతో, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇంటిని ఆపరేట్ చేసుకోవచ్చనేది వీళ్ల మాట. శారీరక శ్రమను తగ్గించేలా తమ డెవలపింగ్ ప్రొడక్ట్ 'క్యూబికల్ ల్యాబ్' ఉంటుందని చెప్తున్నారు.

image


మీ మొబైల్ ఫోన్తో మీ ఇంటిని కంట్రోల్ చేసుకోండంటూ క్యూబికల్ ల్యాబ్‌ను డెవలప్ చేశారు ముగ్గురూ ఐఐటి గువహాటి విద్యార్ధులు. ధృవ్ రాత్ర, స్వాతి వ్యాస్, రాహుల్ భట్నాగర్ అనే ముగ్గురి ఆలోచనల్లోంచి వచ్చిందే క్యూబికల్ ల్యాబ్. కాలేజ్ రోజుల్లో వచ్చిన ఆలోచనకు, ఫ్యాకల్టీలు స్ఫూర్తిగా నిలిచారు. 2013లో ఐఐటి గువహాటిలో ఈ ముగ్గురు వ్యవస్థాపకులకూ ఆలోచన పురుడు పోసుకుంది. చాలా కాలం ఈ ప్రోడక్ట్‌పై దృష్టి కేంద్రీకరించిన వీరు, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్‌ను టెస్ట్ చేశారు.

"స్మార్ట్ డివైజ్‌లైన మొబైల్, లాప్ టాప్, టాబ్లెట్లను ఉపయోగించి మీ ఇంటిని కంట్రోల్ చేయవచ్చు. లైట్‌ని డిం చేయొచ్చు, ఎక్స్‌ట్రా వైరింగ్ లేకుండా మీ మ్యూజిక్ సిస్టంను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఐపి కెమెరాతో అనుసంధానం చేసుకుంటే ప్రపంచంలోని ఏ మూల నుంచైనా మీ ఇంట్లో ఏం జరుగుతోందో చూడొచ్చు. మా హోం ఆటోమేషన్ టెక్నాలజి మీకు ఆ సౌలభ్యాన్ని కలిగిస్తుంది. కరెంటును ఆదా చేయడంతో పాటు, సురక్షితమైనది కూడా'' అంటున్నారు ధృవ్.

కొన్నేళ్ల క్రితం క్యూబికల్ తన ఆపరేషన్స్‌ను Delhi-NCR, ముంబైలో ప్రారంబించింది. ముగ్గురితో స్టార్ట్ అయిన ఈ టీం తన సంఖ్యను ఆరు నెలల కాలం లోనే 65కు పెంచుకుంది. ఈ టీం మొత్తంలో 20%కి పైగా ఐఐటి/ఐఐఎం గ్రాడ్యుయేట్లే ఉన్నారు.

కొంతమంది రియల్ ఎస్టేట్ బిల్డర్లతో డీల్స్ కుదుర్చుకున్న టీం, గత రెండు నెలలుగా తమ ప్రోడక్ట్‌ను విజయవంతంగా అమ్ముతోంది. ఇపుడీ టీం తన సర్వీసుల్ని దేశ వ్యాప్తంగా విస్తరించాలని, అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది.

కాంపిటీషన్

హోం ఆటోమేషన్ రంగంలో అతి పెద్ద గ్లోబల్ కంపెనీలైన ష్నైడర్, లెగ్రాండ్, హనీవెల్, ఫిబరొ లాంటి కంపెనీలతో క్యూబికల్ ల్యాబ్ తలపడుతోంది. 'క్యూబ్-R అనే తన స్వంత టెక్నాలజీ పైనే విశ్వాసం ఉంచింది క్యూబికల్ టీం. రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా నడిచే హై లెవల్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్, పర్సనల్ ఏరియా నెట్ వర్క్స్‌ను తయారు చేసింది టీం. టీం మెంబర్ల అబిప్రాయం ప్రకారం క్యూబ్-R నాన్-బల్కీ ప్రోటోకాల్. ఇది ఇతర సర్వీసులకంటే కూడా, త్వరితగతిన డాటా ప్రాసెస్/కమాండ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. 128bit AES ఎంక్రిప్షన్‌ను ఇది ఉపయోగించుకుంటుంది. ఇదే ఎంక్రిప్షన్‌ను క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్‌లో సెక్యూరిటి కోసం ఉపయోగిస్తారు.

image


ఆన్/ఆఫ్, మూడ్ లైటింగ్, అప్ప్లయన్సెస్ షెడ్యూలింగ్ తో పాటుగా, డివైజ్ ద్వారా రెగ్యులరైజ్ చేసే ఇతర ఫీచర్లకు పేటెంట్ తీసుకుందీ టీం. తమ డివైజుల ద్వారా, ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయడంతో పాటు, షాండ్లియర్, బల్బ్స్, లైట్స్ ను మల్టిపుల్ కంట్రోల్ డివైజ్‌లు, ఎక్స్టర్నల్ డిమ్మర్లు లేకుండానే డిం చేయొచ్చంటున్నారు. ఐపి బేస్డ్ వైర్ లెస్ కెమెరా, కర్టైన్ మోటర్స్‌ను కూడా దీంతొ ఆపరేట్ చేయొచ్చు. సర్వీసు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, క్యూబికల్ టీం ఇన్‌స్టలేషన్ సర్వీసుల భాద్యతలు తీసుకుంటుంది. క్లైంట్ల దగ్గర నుంచి ఒక్క ప్రశ్న కూడా రాకుండా, రిప్లేస్‌మెంట్ గ్యారంటితో పాటుగా, మొదటి సంవత్సరానికి ఎలాంటి చార్జ్ చేయకుండా, ఫ్రీ గా అందిస్తున్నారు.

స్మార్ట్ ఎనర్జి మానిటరింగ్, మేనేజ్‌మెంట్ వ్యవస్థను ఈ క్యూబికల్ స్మార్ట్ హోంస్ కలిగి ఉన్నాయి. రియల్ టైం బేసిస్ మీద ఎనర్జీని సేవ్ చేస్తున్నారు. దీంతో యూజర్లు కరెంటుని ఆదా చేయడంతో పాటు, సహజ వనరులను కూడా కాపాడిన వారవుతున్నారు. ఈ కొత్త తరహా ఆప్ ద్వారా ఎంత కరెంటుని ఆదా చేసింది రోజువారి/వీక్లీ/మంత్లీ/ఇయర్లీ బేసిస్ మీద గ్రాఫ్స్ ద్వారా చూడొచ్చు. అలాగే లోపాలున్న ఫాల్టీ డివైజ్‌లను కూడా కనిపెట్టొచ్చు.

భారత హోం ఆటోమేషన్ మార్కెట్

భారత్‌లో హోం ఆటోమేషన్ రంగం ఇప్పుడిపుడే వెళ్లూనుకుంటున్నా, తప్పకుండా వృద్ధి చెందుతుంది. స్మార్ట్ ఫోన్లే స్మార్ట్ హోంస్ కు ద్వారాలుగా మారుతాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం 130 మిలియన్లకు చేరి, భారత్‌లో ఈ రంగం అతి పెద్దదిగా అవతరిస్తుంది. రియల్ ఎస్టేత్ రంగంలో 7 మిలియన్ల కంటే ఎక్కువగా వీటి డిమాండ్ వచ్చే అయిదేళ్లలో పెరుగుతుంది. హోం ఆటోమేషన్ మార్కెట్లో ఇంతకుముందు కంటే కూడా, ఉన్నత ప్రమాణాలు కల నగరాల్లోని అధికాదాయ వర్గాలు దీని పైనే ఆధార పడ్తారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాలన్నింటి కంటే కూడా భారత్ ఈ రంగంలో వృద్ధి చెందగలుగుతుంది.

image


లక్ష్యాలు

భారీ వైరింగ్, ఇన్‌స్టలేషన్, తీవ్రమైన ఖర్చు చేసే ఇతర సంప్రదాయ హోం ఆటొమేషన్ సిస్టమ్స్ మీద ఉన్న అవగాహన ఇలాంటి వాటిపై లేకపోవడమే పెద్ద అవరోధంగా మారిందని క్యూబికల్ వ్యవస్థాపకులు చెబ్తున్నారు.

డు-ఇట్-యువర్సెల్ఫ్ లాంటి ప్రోడక్ట్ భారత మార్కెట్లో బలపడినపుడె తమ బిజినెస్ మోడల్ అందరికీ చేరువవుతుందని టీం భావిస్తుంది. ఎలక్ట్రికల్ ఇన్‌స్టలేషన్ ఎంత సులభం అయినా, ఎలక్ట్రికల్ వైరింగ్‌కు ఎక్కువగా పెట్టాల్సి రావడంతో, ఈ-కామర్స్ వైపు మొగ్గు చూపుతున్నారని, అయితే అది తప్పని అంటున్నారు టీం వెంబర్లు.

ఇక హోం ఆటోమేషన్ అనేది సరికొత్త ప్రొడక్ట్ కావడంతో ఎంత స్థితిమంతులైనా, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కొనలేకపోతున్నారు. దీంతో భవిష్యత్తులో క్యూబికల్ టీం, హోం ఆటోమేషన్ సర్వీసెస్, టెక్నాలజీ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది.