వ్యవసాయంలో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకబోతోన్న ఐహబ్

0

వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలకబోతోంది ఐహబ్. నూతన ఆవిష్కరణలద్వారా వ్యవసాయరంగాన్ని అభివృద్ధిపథంలో నడిపించాలనే ఉద్దేశంతో పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో ఐ హబ్‌ను ప్రారంభించారు.

వాస్తవానికి వ్యవసాయరంగానికి ప్రోత్సాహకాలు అందిస్తున్నా రైతుల ఆదాయం మెరుగుపడటం లేదు. అందుకే సాంకేతిక పురోగతిని సామాన్యుడికి సైతం చేరువ చేయాలనే కాన్సెప్టుతోనే ఇక్రిశాట్ లో ఐ హబ్ ని ఏర్పాటు చేశారు. తద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు కొత్త ఆవిష్కరణలు తీసుకువస్తారు. ఐహబ్ ఏర్పాటుతో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలలో ఉన్న సమస్యలు, మార్కెటింగ్, విత్తనాల సమస్యలు, పర్యావరణ సంబంధిత విషయాలను ఎప్పటికప్పుడు ప్రాంతాలకు అనుగుణంగా రైతులకు అవగాహన కల్పిస్తారు.

రాష్ట్రంలో చాలామందికి వ్యవసాయమే జీవనాధారం. ఈ రంగంలో టెక్నాలజీ వాడకం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో వ్యవసాయరంగంపై ప్రత్యక్షంగా సుమారు 60 శాతం, పరోక్షంగా మరో 10శాతం ప్రజలు ఆధారపడి ఉన్నారు. కానీ జీడీపీలో వ్యవసాయరంగం నుంచి ఇప్పటికీ 15-17శాతం మాత్రమే వాటా ఉంది. ఇది ఆలోచించదగ్గ విషయం. అమెరికాలో కేవలం 1శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడినా జీడీపీలో వారి వాటా 15శాతం ఉంది.

వ్యవసాయ రంగంలో పెట్టుబడులు తగ్గి, ఉత్పాదకత పెరగి, మంచి ధర లభిస్తేనే రైతులు ఆర్థికంగా ప్రగతి సాధిస్తారు. ఆ దిశగా శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేయాలి. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లయినా రైతులు రుణాలకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుండటం బాధాకరం. రుణాలతో కాకుండా సొంత పెట్టుబడితో రైతులు వ్యవసాయం చేసే విధంగా అభివృద్ధి చెందాలి. వ్యవసాయంలో లాభాలు రావాలంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు భారీ ఎత్తున రావాలి. 

Related Stories

Stories by team ys telugu