ఒకప్పటి లాస్ట్ ర్యాంకర్.. ఇప్పుడు ఎంఐటి మీడియా ల్యాబ్ హెడ్

ఒకప్పటి లాస్ట్ ర్యాంకర్.. ఇప్పుడు ఎంఐటి మీడియా ల్యాబ్ హెడ్

Sunday September 27, 2015,

4 min Read

ఐఐటి ఢిల్లీ నుండి పట్టభద్రుడైన ఒక సగటు విద్యార్ధి క్షితిజ్ మార్వా . ఇంకా చెప్పాలంటే చదువులో అతను దిగువ నుంచి మూడవ ర్యాంకర్. అతని మనస్సు సాధారణ విషయాల అధ్యయనం పై ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించదు. అందుకే ఫైనలియర్లో వున్నప్పుడు అతనికున్న కంప్యూటర్ నాలెడ్జ్‌తో Harvard Medical Schoolకు అప్లై చేశాడు. అక్కడ అతనికి డాక్టర్స్‌తో కలిసి థీసిస్ చేసే అవకాశం వచ్చింది . ఈ వర్క్‌ను మార్వా “ఫండూ”గా అభివర్ణిస్తాడు .


IIT- ఢిల్లీలో భిన్నమైన సంస్కృతి

తను HMS (హార్వర్డ్ మెడికల్ స్కూల్) వెళ్తున్నాననే ఉద్దేశ్యాన్ని యాజమాన్యానికి చెప్పినప్పుడు వాళ్ల నుంచి ఘాటైన స్పందనే వచ్చింది. ఇక్కడి విధివిధానాలు తూచా తప్ప కుండా పాటించాలని ఆదేశించారు . కానీ తను మాత్రం హార్డర్డ్ వెళ్ళడానికే సిద్ధపడ్డారు. అప్పుడే తనలో ఏదో తెలియని అద్భుతం జరుగుతోందని తెలుసుకున్నారు. ఊహలు రెక్కలు కట్టుకుని ఎక్కడెక్కడో ఎగిరాయి. కానీ ఆ ఆనందం అతనికి ఎక్కువ రోజులు నిలవలేదు. సస్పెండ్ చేస్తున్నట్టు అతనికి ఐఐటి డిల్లీ నుండి మెయిల్ వచ్చింది. చేసేది లేక మళ్లీ ఐఐటి ఢిల్లీ బాటపట్టాడు. ఐఐటిలు గొప్పవే కానీ , హార్వర్డ్‌లో నేర్చుకోవడానికి భారత యూనివర్సిటీల్లో ఉన్న సంస్కృతిలో పెద్ద తేడా వుందని అప్పుడే గుర్తించాడు.

image


స్టాన్ఫర్డ్ అనుభవ౦

పట్టభద్రుడు కావడానికి సెమిస్టరు ముందు Stanford Univeristy లో 7,8 నెలల ఫెలోషిప్ లభించింది . అక్కడ నైపుణ్యం కలవారితో కలిసి నూతన ఆవిష్కరణలు చేపట్టాడు. అయితే ఇవేమీ అతనికి సబ్జెక్టులో మంచి మార్కులు సంపాదించడానికి ఉపయోగపడలేదు . ఉత్తీర్ణత ఆధారంగా విద్యార్ధులను కూర్చోబెట్టినపుడు అతను చివరి నుండి మూడో స్థానంలో వున్నాడు. కానీ స్టూడెంట్స్‌ను అక్షర క్రమంలో కూర్చోబెట్టారని తన తండ్రికి అబద్ధం చెప్పి అప్పుడు తప్పించుకొన్నాడు. ఆ తర్వాత అతనికి ఆరునెలల పాటు యూరప్‌లో ప్రయాణించి ఫోటోగ్రాఫ్స్ తీసే అవకాశం వచ్చింది. బదులుగా అతనికి మంచి జీతంతో కూడిన ఉద్యోగం లభించింది.

యం.ఐ.టి. మీడియా ల్యాబ్ అనుభవం

అదే సమయమంలో మార్వా... మీడియా ల్యాబ్ గురించి విన్నారు. ముందుగా అది ఏదో మానవాతీతులకు సంబంధించిందని అని అనుకొన్నారు . ఒక స్నేహితుని సలహా మేరకు అప్లై చేశారు. ఉత్తర భారతదేశంలో పర్యటిస్తున్నప్పుడు.. అతనికి ఒక ఎం.ఐ.టి.ప్రొఫెసర్ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. తను ఏమి సమాధానాలు ఇచ్చాడో స్పష్టంగా గుర్తులేదు కానీ ఎం.ఐ.టి. మాత్రం మర్వాను అంగీకరించింది.

'' మొదటి సారి నేను ల్యాబ్‌లోనికి వెళ్లినప్పుడు అదొక అందమైన అనుభవం. నేను కలిసిన మొదటి ఐదుగురు వ్యక్తులు ... ఒక డిజైనర్, డాక్టర్, ఫోటోగ్రాఫర్, మెటీరియల్ సైంటిస్ట్ మరియు ఒక ఇంజనీర్. ఫోటోగ్రఫి అనేది కళా లేక శాస్త్రమా... అనేది అప్పటివరకు నా జీవితంలో పెద్ద ప్రశ్న. కానీ ఇక్కడ అవన్నీ కలగాపులగమైనట్టుగా అనిపించింది. అప్పుడు నా మెదడు లోని ప్రశ్న...? ఇటువంటిది ఇండియాలో ఎందుకు ఉండకూడదు??? అని. ఇటువంటి వ్యక్తులను కలుసుకోవడానికి నేను పాశ్చాత్య దేశాలకు ఎందుకు రావాలి ?? ” అంటూ తన అనుభవాన్ని మర్వా జ్ఞాపకం చేసుకున్నారు. ప్రస్తుతం యం.ఐ.టి. మీడియా ల్యాబ్... విద్యా సంబంధమైన మార్కులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంలేదని అర్థమైంది. అందుకే తనలాంటి వ్యక్తులతో అది నిండిపోయింది . చివరకు కాలేజి చదువును మధ్యలో ఆపేసినా .... ప్రస్తుతం సంస్థ అధిపతి స్థానానికి చేరుకున్న జొచ్చిఇటో తో సహా...ఇక్కడ అందరికి ఒకటే వ్యాపకం , ఆసక్తి. క్రొత్త వాటిని సృష్టించడం...!

ప్రస్తుతం మర్వా లక్ష్యం... తనకు 50 ఏళ్ల వయసు వచ్చేంతవరకు పనిచేసి , చాలా డబ్బు సంపాదించి భారతదేశానికి వచ్చి దాతృత్వ సేవలను అందించడం కాదు. ఇప్పుడే...ఇక్కడే..తనలాంటి మరొక మర్వాను తయారు చేయడం.

image


యం.ఐ.టి మీడియా ల్యాబ్ ఇండియా కార్యక్రమం

యం.ఐ.టి మీడియా ల్యాబ్ విభాగానికి అధిపతిగా పనిచేయడానికి తిరిగి మర్వా తన మాతృభూమికి చేరుకున్నారు. ఇప్పుడు అతని లక్ష్యం యం.ఐ.టి మీడియా ల్యాబ్ అనే ఒక గొప్ప సంస్థను ఇండియాలో ప్రారంభించడం కాదు. అట్టడుగు స్థాయి నుండి సంస్థను నిర్మించడం. దానికి అనుగుణంగానే వారు ముంబైలో నిర్వహించిన మొదటి వర్క్ షాప్ ఆహ్వానానికి మూడు నుండి నాలుగు వేల మంది అభ్యర్ధులు ప్రతిస్పందించారు. వారిలో 200 మందిని గుర్తించి చేర్చుకున్నారు. '' ఈ అభ్యర్ధులందరికీ తమను తాము తీర్చిదిద్దుకునే వేదికను ఇవ్వడం, యం.ఐ.టి మీడియా ల్యాబ్ స్ఫూర్తిని అభ్యర్ధులందరూ అర్థం చేసుకోవడం ఈ కార్యక్రమ ఉద్దేశం. యం.ఐ.టి మీడియా ల్యాబ్ గురించి ఒక నానుడి ఉంది. అదేంటంటే ప్రపంచంలో ఎక్కడా పనికి రానివాడైనా ఇక్కడ పనికివస్తాడు ” అని నవ్వుతూ అంటారు మర్వా. 

ఇక్కడ సుమారు ఇదు రోజుల పాటు ఇంజనీర్లు , కళాకారులూ మరియు డిజైనర్లతో కూడిన అభ్యర్ధుల సమూహం 30 ప్రాజెక్టుల మీద పనిచేసింది. వారిలో ఒకరైన అర్జున్ శర్మ మరింత పురోగతి సాధించారు. 2011లో Ducere అనే పేరుతో తన సొంత సంస్థను స్థాపించారు. అంధులకు ఇంద్రియ జ్ఞాన ఆధారిత పరికరాలను తయారు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం అర్జున్ శర్మ యం.ఐ.టి మీడియా ల్యాబ్‌లోని ‘ఫ్లూయిడ్ ఇంటర్‌ఫేసెస్ గ్రూప్ ‘ లో విద్యను అభ్యసిస్తున్నారు. నైపుణ్యం కలిగిన విద్యార్ధులను వెదికి పట్టుకోవడం ఈ కార్యక్రమం లక్ష్యం కాకపోయినప్పటికీ ఈ వర్క్ షాపుల నుండి లబ్ధి పొందినవారిలో అర్జున్ శర్మ లాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. 

ముంబై తరువాత డిల్లీ మరియు బెంగుళూరు లోనూ మార్వా తన వర్క్ షాపులను నిర్వహించారు. భారతదేశంలో కోకొల్లలుగా జరిగే ఇటువంటి కార్యక్రమాలకు యం.ఐ.టి.మీడియా ల్యాబ్ నిర్వహించే వర్క్ షాప్స్‌కు మధ్య ప్రధానమైన తేడా ఉంది. అక్కడ డిజైనర్లు ,సాంకేతిక నిపుణులు, అంతిమ లబ్దిదారులంతా అంతా కలిసి సమస్యలను గుర్తిస్తారు. వాటికి పరిష్కార మార్గాలు కనుక్కోవడానికి రాత్రింబవళ్లు ఆలోచిస్తారు... అంటారు మార్వా.

image


మొబైల్‌ను డిఎస్ఎల్ఆర్‌లా మార్చేసే టెక్నాలజీ

MIT ల్యాబ్‌లో కెమెరా కళలో ప్రావీణ్యమున్న అసోసియేట్ ప్రొఫెసర్ రమేష్ రాస్కర్‌తో కలిసి మర్వా పనిచేశారు. దీంతో ఈ రంగంపై అతనికి ఉన్న ప్రేమ మరింత పెరిగింది. సాంకేతికత, కళ కలిసినపుడు కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది . Light Field Camera technology ని డిజైన్ చేసినపుడు మార్వాకు అన్నిటికన్నా మంచి గుర్తింపు వచ్చింది. దానిని మొబైల్‌లో అమరిస్తే వినియోగదారులు మంచి రెజల్యూషన్ గల సింగల్ షాట్ 3D ఫొటోలను తీసుకోగలరు. అంతేకాదు.. ఫోటో తీసిన తర్వాత దాన్ని మళ్ళీ రీ ఫోకస్ తీసుకొనే టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. అవి ఇప్పటికే మార్కెట్లో ఉన్నప్పటికీ ఖరీదు ఎక్కువగా ఉన్నాయి. ఒక DSLR కెమెరా చేసే పనిని ఈ మొబైల్ కెమెరా కూడా చేయగలిగేలా రూపొందించదలిచాడు మర్వా. ఇది ఎలా అంటే పెయింటింగ్‌లా వున్న ఛాయాచిత్రం అనుకోవచ్చు. అతను ఎలా ఏర్పాటు చేశారంటే.. మనం ఫోటో తీసే వరకే మన పని. మిగతా పనంతా మొబైల్ కెమెరాలో వున్న టెక్నాలజీ చూసుకొంటుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీని భారతీయ తయారీదారులతో పాటు htc,samsung ,apple సంస్థలకు ఇవ్వడానికి ప్రాసెస్ ప్రారంభించాడు . అంతే కాకుండా తన సొంత సంస్థను ప్రారంభించి తద్వారా మార్కెట్లోకి టెక్నాలజీని తీసుకెళ్లేలా ప్రయత్నిస్తున్నాడు.

ఈ విషయమై మార్వా భారతదేశంలో ఉండటానికే ఎక్కువగా మొగ్గుచూపారు. ఎంఐటి ల్యాబ్ నిర్వాహకులకూ ఇదే విషయాన్ని తెలియజేశారు. 

'' మేము భారత్‌లో కొత్త ఆవిష్కరణలు చేయకుండా ఎంతసేపూ యాక్సిలరేటర్స్.. ఇంక్యుబేటర్స్‌లా ఉండలేం. నేను రూపొందించిన 3d లాంటి టెక్నాలజీని సిలికాన్ వ్యాలీలో అభివృద్ధి చేయవచ్చు. అందుకు నాకు పెద్ద మొత్తంలో డబ్బును కూడా ఇస్తామన్నారు. కానీ నన్నో ఉదాహరణగా చూపించేందుకు మన దేశంలోనే ప్రారంభించాలనుకున్నా. దీని వల్ల అధిక శ్రమ, డబ్బు ఖర్చైనా ఫర్వాలేదని '' ముగిస్తారు మర్వా.