కొత్తదనానికి వేదికైన 'ఇన్నోఫెస్ట్'

0

టీ హబ్‌లో జరిగిన ఇన్నోఫెస్ట్‌కు స్థానిక స్టార్టప్ లతో పాటు దేశంలో అన్ని మెట్రోల నుంచి ఎంతోమంది ఔత్సాహికులు తమ ప్రాడక్టులను ప్రదర్శనకు పెట్టారు. ఆగస్ట్ ఫెస్ట్ అంత అట్టహాసంగా లేకపోయినప్పటికీ ఇన్నోవేషన్ ఐడియాలతో తయారైన ఎన్నో రకాల ప్రాడక్టులు కనువిందు చేశాయి.

ప్రత్యేకంగా నిలిచిన ఆగ్రో స్టార్టప్‌లు

వ్యవసాయ ఆధారిత ప్రాడక్టులు, పరికరాలు ఇన్నో ఫెస్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అగ్రో ఫీల్డ్‌లో వస్తోన్న మార్పులను చూపిస్తూ ఈ ప్రదర్శన సాగింది. ఆంధ్రా, తెలంగాణతో పాటు దేశంలో చాలా ప్రాంతాలకు చెందిన వినూత్న ఐడియాలకు ఇదొక ప్లాట్‌ఫాంగా నిలిచింది.

“వ్యవసాయ రంగంలో మేము చేస్తోన్న ఇన్నోవేషన్ కు గుర్తింపు వచ్చేలా ఈ వేదికపై అవకాశం ఇచ్చారు.” జైరాం రెడ్డి

గుంటూరు జిల్లానుంచి ఇక్కడకు వచ్చిన జైరాం రెడ్డి వరి (గడ్డి)తో తయారు చేసిన ప్రోడక్టులను ప్రదర్శనకు ఉంచారు. దీంతో పాటు పాడి పరిశ్రమలకు చెందిన ప్రాడక్టులు సరికొత్త అనుభూతిని మిగిల్చాయని విజిటర్స్ చెబ్తున్నారు.

రోబోటిక్స్ ఇన్నోవేషన్

విద్యార్థులు చేసి రోబోటిక్స్ ప్రదర్శనకు ఇన్నోఫెస్ట్ కేరాఫ్‌గా మారింది. సాధారణంగా ఇన్నో ఫెస్ట్ ఉద్దేశం కూడా ఇదే. స్టార్టప్ ఎకో సిస్టంలో భాగమైన ఇన్నో ఫెస్ట్ కొత్త తరహా ప్రాడక్టులను ఇండస్ట్రీకి అందిస్తుంది. సరికొత్త ఇన్నోవేషన్‌ని పరిచయం చేస్తుంది. ఐడియాలతో పాటు ప్రాడక్టులను తీసుకురావడమే ఇన్నోఫెస్ట్ వేదికగా ఉపయోగపడుతుంది. ట్రిపుల్ ఐటి విద్యార్థులు చేసిన చాలా రోబోటిక్స్ , వాటితో ప్రారంభమైన టెక్ స్టార్టప్‌లను ప్రదర్శనకు ఉంచారు.

దాదాపు 5వేల మందికి పైగా ఈ ఫెస్ట్‌లో పాల్గొన్నారు. మరిన్ని ఇన్నో వేషన్ లకు హైదరాబాద్ వేదిక కానుందనే సంకేతాలను ఇన్నో ఫెస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Stories by ashok patnaik