మొబైల్‌లో యాడ్స్ చూసినందుకు డబ్బులిచ్చే అన్‌లాకర్

మనం చూసే కంటెంట్‌కి పేమెంట్ చేస్తామంటున్న అన్‌లాకర్..స్మార్ట్‌ఫోన్ యూజర్లకు పేమెంట్స్ చేస్తున్న అన్‌లాకర్ యాప్ ..ఫోన్ అన్‌లాక్ చేసినప్పుడల్లా రివార్డులు, పాయింట్లు..రీఛార్జులు, ఆక్షన్లలో పాల్గొనేందుకు రియల్ క్యాష్, యు కాయిన్లు..

మొబైల్‌లో యాడ్స్ చూసినందుకు డబ్బులిచ్చే అన్‌లాకర్

Tuesday June 09, 2015,

3 min Read

మనం ప్రతీ రోజూ చాలాసార్లు మన ఫోన్ లాక్, అన్‌లాక్ చేస్తుంటాం. అన్‌లాక్ చేసిన ప్రతీసారీ రివార్డ్ పాయింట్స్, క్యాష్ క్రెడిట్స్ వస్తే ఎలా ఉంటుంది ?

ఒక్క నిమిషం.. ఇదేం జోక్ కాదు... ఇదో ఆండ్రాయిడ్ యాప్. దీని పేరు అన్‌లాకర్(unlockar). మన ఫోన్ లాక్ ఓపెన్ చేసిన ప్రతీసారీ యు కాయిన్స్, క్యాష్ రూపంలో క్రెడిట్స్ ఇస్తుంది ఈ అప్లికేషన్. వీటిని డీల్స్, డిస్కౌంట్స్, షాపింగ్ ఓచర్స్, యు యాప్‌లో ఆక్షన్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. అన్‌లాకర్‌కే చెందిన ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ యుషాప్.

image


పియూష్ పాల్, పుల్‌కిత్ అహూజా, గోపాల్ యాదవ్, మనీష్ గార్గ్... అన్‌లాకర్ వ్యవస్థాపకులు వీరే. యూజర్లలకు సోషల్, లోకల్ సమాచారంపై లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చేలా అన్‌లాకర్ పేరుతో ఓ ప్లాట్‌ఫాం డిజైన్ చేశారు ఈ టీం. స్టాండర్ & పూర్ కేపిటల్ ఐక్యూలో టీంమేట్స్ అయిన పుల్‌కిత్, పియూష్‌లు... సొంత వెంచర్‌ ప్రారంభించాలనే నిర్ణయానికొచ్చారు.

ఈ ఇద్దరూ కలిసి మొబైల్‌లో ఎలాంటి యాప్ రూపకల్పనపై రెండు నెలలపాటు సమయం వెచ్చించి... చివరకు అన్‌లాకర్ దగ్గర ఆగిపోయారు. మొదట్లో పుల్‌కిత్, పియూష్‌లే అన్ని కార్యకలాపాలు నిర్వహించినా... తర్వాత బాధ్యతలు పెరగడంతో గోపాల్, మనీష్‌లను సహ వ్యవస్థాపకులుగా చేర్చుకున్నారు. ఫాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో విద్యాభ్యాసం చేశారు. లాల్‌ బహదూర్ శాస్త్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్‌లో ఇంజినీరింగ్-మేనేజ్మెంట్ విభాగాల్లో పట్టా పొందారు పుల్‌కిత్. గోపాల్, మనీష్‌లు బిట్స్ పిలాని(దుబాయ్ కేంపస్)లో విద్యాభ్యాసం చేశారు.

“ఇప్పుడున్న వాటిలో అనేక యాప్స్... మనకు సంబంధంలేని కమర్షియల్ కంటెంట్‌ను స్పామ్ రూపంలో అందిస్తున్నాయి. దాని ద్వారా వారు కొంత మొత్తాలను గడిస్తున్నారు. మన మార్కెట్లో ఇలాంటి యాడ్స్ బేస్డ్ యాప్స్‌కు అంతగా ఆదరణ లేదని తెలిసినా... దీన్ని సక్సెస్ చేసేందుకు ఈ టీం చాలా పరిశోధన చేసింది. హై వాల్యూ యూజర్లు దీనిలో భాగం కాకపోతే... సక్సెస్ కాలేమని తెలిసినా మార్కెట్లోకి ఎంటరయ్యారు అన‌లాకర్ టీం.

“ఇప్పుడున్న ఇండస్ట్రీ మోడల్‌ని కొంత మార్పులు చేసి... యాడ్ బేస్డ్ కంటెంట్ ద్వారా వచ్చే మొత్తాల్లో కొంత యూజర్లకు అందించేలా ప్లాన్ చేశాం. కంటెంట్ లభించడమే కాకుండా.... దీని ద్వారా యూజర్లు కూడా లాభం పొందుతార”ని చెప్పారు పియూష్.

కరెంట్ టాపిక్స్, గాల్స్ చిట్ చాట్స్, బాయ్స్ కోడ్ లాంగ్వేజ్ వంటి టాపిక్స్‌ను ఇంట్రడ్యూస్ చేసి, కంటెంట్‌లో కొత్తదనాన్ని అందిస్తున్నారు. లోకల్ డీల్స్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే ప్లేసెస్ వరకూ... అన్ని రకాల యాడ్స్‌నూ లాక్ స్క్రీన్ మీదకు తెస్తోంది అన్‌లాకర్. మనకు కావలసిన, నచ్చిన, అవసరమైన ఛానల్స్‌కు సబ్‌స్క్రయిబ్ అయితే చాలు... అన్‌లాకింగ్‌తో పేమెంట్స్ మొదలైపోయినట్లే.

యాప్ లాంఛ్ సమయంలో... అంటే కంపెనీ ప్రారంభంలో బీటా స్టేజ్‌లో ఉన్నపుడు వాండరర్స్ ఫర్ లైఫ్ వంటి తక్కువ టాపిక్స్, ఛానల్స్‌కే పరిమితమైనా... తర్వాత వీటిని గణనీయంగా పెంచారు అన్‌లాకర్ టీం.

యు కాయిన్స్ రెడీమ్ చేసుకోవడం ఎలా ?

రివార్డ్ పాయింట్ల రూపంలో అన్‌లాకర్ యు కాయిన్స్(వర్చువల్ కరెన్సీ), రియల్ కేష్ ఆఫర్ చేస్తుంది. దీన్ని డీల్స్ కొనుగోలు చేసేందుకు మొబైల్ ఫోన్ల రీఛార్జ్, యుటిలిటీ బిల్ పేమెంట్స్, మూవీ వోచర్స్, డొనేషన్స్ వంటివాటికి ఉపయోగించుకోవచ్చు.

యు కాయిన్స్, రియల్ క్యాష్‌ను రిడీమ్ చేసుకునేందుకు ఫ్రీఛార్జ్, పేటీఎం, బుక్‌మైషో, టీసార్ట్.కాం, ఖుగలిడీల్స్, పీటా, క్రై, అక్షయపాత్ర సంస్థలతోపాటు పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది అన్‌లాకర్. “కస్టమర్లు తమ ఫోన్లతో సాధారణంగా రోజు చేసే కార్యకలాపాలనే.. మార్కెటింగ్ సాధనాలుగా మార్చి, వాటితో రివార్డ్ పాయింట్లను అందించేలా వినూత్నమైన ప్రణాళిక ఇది. కొన్ని టైం స్లాట్స్ ప్రకారం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు... ఈ రివార్డు పాయింట్లు ఉపయోగపడతాయి” అంటున్నారు పుల్‌కిత్.

యాప్‌ను లాంఛ్ చేసిన రెండువారాల్లోనే 4వేలకుగా డౌన్‌లోడ్స్ అయ్యాయి. ఇప్పుడీ అన్‌లాకర్ డౌన్‌లోడ్స్ లక్షను దాటేసింది. గూగల్ ప్లే స్టోర్ నిర్వహించిన కాంటెస్ట్‌లో లైఫ్‌స్టైల్ కేటగిరీలో 'న్యూ ఫ్రీ యాప్స్' కేటగిరిలో మూడో ర్యాంక్ లభించింది అన్‌లాకర్‌కు.

అన్‌లాకర్‌కి ఆదాయ మార్గాలు

ప్రీమియం కంటెంట్‌ను మొబైల్స్‌కు పంపుతుండడంతో అడ్వర్‌టైజింగ్, డీల్ ప్రొవైడర్ల నుంచి కమీషన్ల రూపంలో ఆదాయం సమకూరుతోంది.

“ప్రీమియం కంటెంట్‌ను పబ్లిష్ చేసే ప్లాట్‌ఫాం ఇది. ఈ ఛానల్స్‌ను కమర్షియల్ చేయడం తేలికే. దీంతోపాటు మరిన్ని ఆదాయ వనరులను దీర్ఘకాలంలో తెచ్చిపెట్టేలా దీన్ని డిజైన్ చేశాం” అంటున్నారు గోపాల్.

అన్‌లాకింగ్ ద అన్‌లాకర్

తామందించే కంటెంట్‌ను మరింత లోకలైజ్ చేయాలని చూస్తున్నారు. అలాగే సోషల్ మీడియా, మొబైల్ యూజర్ అనలైటిక్స్ ఉపయోగించి తామిచ్చే పుష్ కంటెంట్‌లో క్వాలిటీ పెంచనున్నారు.

“ ఇన్ఫర్మేషియల్(ఇన్ఫర్మేషన్+కమర్షియల్) రంగంపై ఉన్న అన్‌లాకర్ యాప్‌కు... మార్కెట్లో చాలా స్కోప్ ఉంది. ఎంటర్టెయిన్మెంట్ నుంచి లోకల్ కంటెంట్ పంపేవరకూ చేరుకోగలిగితే... వ్యాపారుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. కస్టమర్లకు కూడా వారికి కావలసిన కంటెంట్ చూస్తూనే... రివార్డులు దక్కించుకోవచ్చు” అంటున్నారు మనీష్.

Website: http://www.Unlockar.com