పాల వ్యాపారానికి టెక్నాలజీతో పరిష్కారం. విప్రో మాజీ ఇంజనీర్ల ఘనతతో పాడి రైతులకు లాభాలే లాభాలు

పాల వ్యాపారానికి టెక్నాలజీతో పరిష్కారం. విప్రో మాజీ ఇంజనీర్ల ఘనతతో పాడి రైతులకు లాభాలే లాభాలు

Saturday June 06, 2015,

6 min Read

image


విప్రో, అల్కాటెల్, ఏటి అండ్ టి, ఎయిర్‌సెల్, భారతి ఎయిర్టెల్ వంటి ప్రముఖ సంస్థల్లో అత్యున్నత పదవుల్లో పనిచేసిన ఐదుగురు ఇంజనీర్లు ఒక్కటయ్యారు. వీళ్లంతా ఐఐటిల్లో చదువుకున్నవారే. ఒకొక్కరికీ కనీసం 15 సంవత్సరాల అనుభవం ఉంది. టెక్నాలజీ రంగంలో ఆరితేరిపోయారు. సాఫ్ట్‌వేర్, హార్ట్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాలు కొట్టిన పిండి. అందరూ కలిశారు. డైరీ రంగానికి టెక్నాలజీతో పరిష్కారాన్ని సూచించారు. పాల దిగుబడి పెంచడం, ఖర్చులను తగ్గించడం, పశువుల ఆరోగ్య రక్షణ, బీమా ప్రీమియం తగ్గింపు, ప్రీమియం పాల ఉత్పత్తిలో వీళ్ల సాంకేతిక పరిజ్ఞానం రైతులకు ఎంతగానో ఉపయోగపడ్తోంది. డైరీ ఫార్మ్ సొల్యూషన్‌లో ఒన్ స్టాప్ సంస్థగా.. స్టెల్ యాప్స్ ఎదిగింది. గోద్రెజ్ ఆగ్రోవెట్‌కు చెందిన ఆమ్నిఓర్ క్యాపిటల్ నుంచి ఫండింగ్ అందుకున్న ఈ సంస్థ.. వినూత్న పరిష్కారాలతో రైతులకు.. చేరువవుతోంది. డైరీ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది.

image


ఈ ఐదుగరు ఎప్పటికప్పుడు కొత్తగా చర్చలు జరుపుతూ... 'జీవితంలో అభివృద్ధి వైపు పయనించే పని' చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. అప్పటి వరకు ఉన్న టెక్నికల్ అనుభవాన్ని పక్కన పెట్టి, చివరికి వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో పని చేయాలనే నిశ్చయించుకున్నారు. చివరికి ఏప్రిల్ 2011 లో వాళ్ల ఆలోచన కార్యారూపం దాల్చి స్టెల్ యాప్స్‌ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్ కంపెనీకి శ్రీకారం చుట్టారు. దీంతో భారత్‌లోనే మొదటి డెయిరీ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీగా ఖ్యాతిగడించింది. ఈ రంగంలో టెక్నాలజీ ఉపయోగించి క్లౌడ్ సాయంతో ఆటోమెషిన్ పరికరాలు రూపొందించారు. కో ఆపరేటివ్, ప్రైవేట్ డైరీ ఫామ్స్‌లో డేటా సేకరించడంతో విశ్లేషణలకు అవకాశం ఏర్పడింది. 

అంతే కాదు ఐఐటి మద్రాస్ 'రూరల్ టెక్నాలజీ' బిజినెస్ ఇంకుబేటర్‌గా ఉంది. స్టెల్ యాప్స్‌ ఒక ప్రత్యేకమైన సంస్థ, కొత్త ఆలోచనలతో వచ్చినప్పటికి మార్కెట్లో నిలదొక్కుకోవడానికి దాదాపు మూడు సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పుడు సంస్థకు పెద్ద సంఖ్యలో ఉన్న క్లయింట్స్ అవసరమైతే ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

మార్కెట్ పై దృష్టి

ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం 16% వాటా. అయితే అధిక శాతం మంది రైతులకు 2-3 మాత్రమే పాలిచ్చే ఆవులు/గేదెలు ఉండేవి. చాలా మంది రైతులు చిన్న, మధ్య తరగతులకు చెందిన వారే. వాస్తవానికి పాడి పరిశ్రమ చాలా పెద్దది. దీనిపై స్టెల్ యాప్స్‌ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. ముందుగా ఐదు నుంచి 25 ఆవులు ఉన్న చిన్న, మధ్య తరగతి రైతులను సంప్రదించారు. వారి అధ్యయనంలో కనీస టెక్నాలజీ పై అవగాహన లేని రైతులే ఉన్నారని తేలింది. పాల ఉత్పత్తి దశలో పరిష్కారాలను అందించడం, ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. డైరీ ఫార్మింగ్‌లో పనిచేసే వారు మిగిలిన వృత్తుల్లా కాకుండా, రోజుకు ఎనిమిది గంటల పైనే కష్టపడుతున్నా, లాభాలు సంపపాదించుకోవడంలో మాత్రం..అనుకున్నది సాధించలేకపోతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు Stellapps ఆటోమేషన్ పరిష్కారాలను సూచించింది. అంతే కాదు పాల ఉత్పత్తి లో టెక్నాలజీ సాయం, పశువులకు అవసరమైన హెల్త్ చెకప్ సూచించడం, పశువుల పాల ఉత్పత్తి కి కేంద్రం కావడంతో, వాటికి ఎప్పటికప్పుడు ముఖ్యమైన మూడు ముఖ్య అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు.

image


అ) ఆరోగ్యం

బి) ఉత్పాదకతను భారీగా పెంచడం

సి) పశువులకు అవసరమైన పశుగ్రాసం, నీరు ఆరోగ్యకరమైన పరిసరాలు..

వరుసగా వీళ్లు చేసిన ఈ ప్రయత్నాలతో డైరీ ఫార్మింగ్ లాభాదాయకంగా మారింది. సాంప్రదాయకంగా పాడి పరిశ్రమకు పెద్ద సంఖ్యలో కార్మికులు కావాలి. పశువులు ఉండే శాలలను శుభ్రంగా ఉంచడం, వాటికి బలమైన దాణా ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి పెరగడానికి దోహదపడ్తుంది. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా పశుశాలలను శీతలీకరణ చేయడంతో పాటు ఆవు పేడతో విద్యుదుత్పత్తినీ ప్రారంభించారు. మొత్తానికి స్టెల్ యాప్స్‌ చేస్తున్న కృషితో పాలదిగుబడి అనుకున్న స్థాయి కంటే ఎక్కువ ఉత్పత్తే కనిపించింది. బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు ద్వారా విద్యుత్ అవసరాలు కూడా తీర్చారు. పశు శాలలకు అవసరమైన వెంటిలేషన్ అందిస్తూ...మౌలిక సౌకర్యాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. 

SmartMoo

శుభ్రమైన పాలు ఉత్పత్తిని అందించడమే కాకుండా ఎండ్ టూ ఎండ్ సర్వీసెస్ ఇస్తూ ఖర్చు తగ్గించుకోవడం, పాల దిగుబడి పెంచుకోవడానికి డేటాను సేకరించింది.

  • ఆటోమేటెడ్ పాల వ్యవస్థ (SmartAMS)
  • బల్క్ మిల్క్ చిల్లింగ్ వ్యవస్థ (SmartBMC)

ఎండ్ టూ ఎండ్ ఫార్మ్ సేవల ద్వారా (ఆవులకు సౌకర్యాల కల్పన, పశు శాలల నిర్మాణం, ఆవుల ఎంపిక, గడ్డి, ఆవు పేడలతో వర్మీ కంపోస్ట్ తయారీ, పశువుల ఆరోగ్యానికి సంబంధించి వెటర్నరీ & పారా వెటర్నరీ సేవలు) అందిస్తోంది. డైరీ లే ఔట్ డిజైన్ & మోడల్ (పశుశాలలు, మిల్క్ పార్లర్స్, పనిచేసే కార్మికులకు తగిన షెడ్లు) ఉత్పాదకత అభివృద్ధి, ఖర్చు తగ్గించుకోవడం, ఆఫ్-గ్రిడ్ వ్యవసాయ విద్యుత్ కోసం బయో గ్యాస్ సెటప్ డైరీ ఫార్మ్ నిర్వహణకు అవసరమైన పరికరాలు (గిట్ట త్రిమ్మర్లు, డి-horners, చీపుళ్లు, యాంటీ-కిక్ బార్, లోపల శుభ్రంగా ఉంచేందుకు వాడే ) సొల్యూషన్స్ అందిస్తున్నారు.

స్మార్ట్ మూ

స్మార్ట్ మూ


స్మార్ట్ ఫార్మ్స్

స్టెల్ యాప్స్‌ సాయంతో రైతులు పశుశాలలను స్మార్ట్ ఫార్మ్స్‌గా మార్చేశారు. జంతువులు ఎన్ని ఉన్నాయి, వాటి ఉత్పాదకత, రాబడి,నిర్వహణ, బ్రీడింగ్, ఆరోగ్య సంరక్షణ, పశుగ్రాసం, పశువైద్య సంరక్షణ కోసం క్లౌడ్ ఆధారిత సేవలు అందించారు.

smartBMC: ఇది ఇంటర్నెట్, మొబైల్ సాయంతో పాలను శీతలీకరణ చేసే పరికరం.

smartAMS: మిల్క్ లైన్ ఆటోమెటిడ్ మిల్కింగ్ సిస్టమ్. ఇది పాలు పితికే వ్యవస్థను తయారు చేసింది. మూడు దశల్లో ఆవులను గుర్తించడం దగ్గర నుంచి పార్లర్లకు పంపిణీ చేసే వరకు ఎఎంఎస్ సేవలు అందిస్తుంది.

ConTrak: ఇది బల్క్ మిల్క్ కూలర్స్ (BMC) ఇంటర్నెట్ బేస్ ఆధారంగా పనిచేసే వ్యవస్థ. పాల ఉత్పత్తి పెంచడానికి మెరుగైన సమాచారం అందిస్తుంటుంది.

స్టెల్ యాప్స్‌ టెక్నాలజీ ప్రొవైడర్స్

విదేశాల్లోని టెక్నాలజీతో పోలిస్తే వీళ్ల ధర చాలా తక్కువుగా ఉంటుంది. పాలు పితికే యంత్రం, స్టోరేజీ, మౌలిక సదుపాయాలకు కలిపి ధర నిర్ణయిస్తారు. దీనిపై పూర్తి విశ్లేషణను క్లౌడ్ చేస్తుంది. కాబట్టి, రైతులకు పూర్తి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ డేటా ఆధారంగా పశువులకు వచ్చే వ్యాధులపై, పశువైద్య నిపుణుల సలహాలు తీసుకొని సమాచారం అందిస్తుంది. సర్వర్లకు వైర్లెస్ నెట్వర్క్ ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఆప్స్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. రైతులతో కలిసి పనిచేస్తే.. వారికి ఎక్కడ లాభం చేకూరుతుందో, అక్కడ తమకూ లాభం వస్తుందని నమ్ముతారు. వాళ్లకు లీటర్ పాలకు ఇంత లాభం వస్తుందని పక్కాగా చెప్పగలుగుతున్నాము అంటారు సంస్థ వ్యవస్థాపకులు. ఇలా స్టెల్ యాప్స్‌ సంస్థ రైతులకు ఉపయుక్తంగా మారిపోయింది.

image


వ్యవస్థాపకులు

స్టెల్ యాప్స్ వ్యవస్థాపకుల చరిత్రను గమనిస్తే, ప్రవీణ్ నాలే, రంజిత్ ముకుందన్, రామకృష్ణ అడుకూరి, వెంకటేష్ శేషసాయిలు, రవిశంకర్‌లు ఉన్నారు. 

రంజిత్ Mukundan CEO & మేనేజింగ్ డైరెక్టర్. అతను విప్రో టెలికంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. టెలికం అప్లికేషన్ ప్రాక్టీస్ విభాగంలో పనిచేశారు. దాదాపు 250 మందికి హెడ్‌గా ఉన్న ఆయనకు పరిశ్రమలో17 సంవత్సరాల అనుభవం ఉంది. 

రవిశంకర్.. డైరెక్టర్, బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్‌. ఐఐటి-మద్రాస్ పూర్వ విద్యార్థి. ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్, టెలికాం ఇండస్ట్రీలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఆయన AT & T, టెలస్ట్రా, నోర్టెల్, ఎరిక్సన్, అల్కాటెల్- లుసెంట్ సంస్థల్లో సలహాదారుడిగా ఉన్నారు. 

ప్రవీణ్ నాలే డైరెక్టర్ అండ్ చీఫ్ టెక్నాలజీ అధికారి. హార్డ్‌వేర్ ఇంజనీర్ అయిన ప్రవీణ్. ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్, టెలికాం రంగాల్లో 15 సంవత్సరాల అనుభవం. IIT- మద్రాస్ పూర్వ విద్యార్థి. హార్డ్‌వేర్‌తో పాటు సాఫ్ట్‌వేర్ రంగంలోనూ అనుభవం అతనికి ప్లస్ పాయింట్. 

రామకృష్ణ అడకూరి సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్‌కు అధిపతిగా కొనసాగుతున్నారు. టెలికాం, ఎంటర్‌ప్రైజెస్ ఆర్కిటెక్చర్ పరిశ్రమలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం. ఐఐటి ఖరగ్‌పూర్ పూర్వవిద్యార్థి. యూనిఫైడ్ కమ్యూనికేషన్స్ & క్లౌడ్ సంస్థకు చీఫ్ ఆర్కిటెక్ట్‌గా ఉన్నారు.

వెంకటేష్ శేషసాయి.. డొమైన్ సొల్యూషన్స్ ఛీఫ్. అనేక టెలికం సర్వీసు ప్రొవైడర్లు 'నెట్ వర్క్‌లతో కలిసి పనిచేశారు. సర్వీస్ డెలివరీ ప్లాట్ ఫాం (SDP) చీఫ్ ఆర్కిటెక్ట్ . ఇండస్ట్రీలో 15 సంవత్సరాల అనుభవం ఉంది.

విలువ ప్రతిపాదన

ప్రపంచ స్థాయి ఆటోమేషన్‌తో పాటు ఎండ్ టు ఎండ్ ఫార్మింగ్‌కు పేటెంట్ పెండింగ్ టెక్నాలజీస్‌కు తగిన సాంకేతికను అందిస్తోంది. రైతులకు అవసరమైన పరిష్కారాలకు, సూచనలు చేస్తోంది.

ఖర్చులు తగ్గుతాయి

డైరీ ఫార్మింగ్‌లో ఆటోమేషన్ చేయడం, పాలు పితికే విధానాలకు మిషనరీ వాడడంతో కార్మికులపై ఆధారపడడం తగ్గుతుంది. ఇన్‌పుట్ ఖర్చులు తగ్గడం కూడా ఆదాయం పెరగడానికి కారణమవుతుంది.

ప్రివెంటివ్ హెల్త్ కేర్

అధునాతన క్లౌడ్ సేవల ద్వారా పశువులు అనారోగ్యం బారిన పడినా.. లేక పాలు ఉత్పత్తి తగ్గినా, వెంటనే తగు చికిత్సలు చేసి పాల దిగుబడి తగ్గకుండా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. అడ్వాన్స్ యాక్టివిటీ మీటర్స్ , క్లౌడ్ బేస్డ్ విశ్లేషణల ఆధారంగా పశువుల చనుబాలను ఏపుతారు. అండోత్సర్గము తగ్గించడం వల్ల ఉత్పత్తి పెరగడానికి కారణమవుతోంది. ఆవులకు సంబంధించిన నిర్దిష్టమైన సమాచారంతో వాటికి కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా తగ్గేందుకు దోహదపడుతోంది.

ప్రీమియం పాల ఉత్పత్తి

నియంత్రిత, ప్రూఫ్ కోల్డ్-చైన్ మేనేజ్‌మెంట్ సాయంతో (ఉదా - రిమోట్ నియంత్రిత అధిక పాల కూలర్లు) బ్యాక్టీరియా ప్రభావం తగ్గుతోంది. దీని వల్ల ప్రీమియం పాల అమ్మకాలు పెరుగుతున్నాయి.

డైరీ ఫార్మింగ్‌లోనూ దూకుడు

సంస్థకు ఉన్న అద్భుతమైన టీమ్... మార్కెట్లో నిలదొక్కుకోవడానికి కారణమైంది. వ్యవస్థాపకులు చేసిన కృషితో వ్యవసాయం, పాల సేద్యం రంగాల్లోకి వెంచర్ క్యాప్టలిస్టులు రావడానికి కారణమౌతోంది. ఫార్మింగ్ దండగ కాదు పండగ అని నిరూపించారు వీళ్లంతా. పెట్టుబడిదారులకు, వ్యవస్థాపకులకు వెంటనే ఆదాయం రాకపోయినప్పటికి, ఇండస్ట్రీలో సహనంతో వేచి ఉండడం కూడా సక్సెస్‌కు కారణమైంది.

సంస్థ కో ఫౌండర్స్ దాదాపు ఏడాది (Nov 2010 నుండి అక్టోబర్ 2011 వరకు) కి పైగా తమకు వచ్చే జీతాల్లో 20-30% ఇవ్వడంతో మూలధనం స్థిరపడడానికి కారణమైంది. కంపెనీ ఫౌండర్స్‌కు కుటుంబాల నుంచి లభించిన మద్దతుతో పాటు ఐఐటి మద్రాస్ ఇంకుబేటర్‌గా ఉపయోగపడింది. పాడి పరిశ్రమను సాంకేతిక పరంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. మనదేశం చాలా వెనుకబడే ఉంది. అందుకే తమకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయనేది వీళ్ల ధీమా.

అనూహ్య స్పందన

స్టెల్ యాప్స్ సూచించిన పరిష్కారాల ద్వారా ఇప్పుడు రైతులు మెరుగైన ఉత్పత్తి సాధించి, ఉత్తమ విక్రయాలను అందిస్తున్నారు. యాప్స్ ద్వారా దీర్ఘకాలిక పరిష్కారాలను సూచిస్తూ.. కష్టాలను అధిగమిస్తూ అడుగులు వేస్తున్నారు. దీంతో రైతుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. అటు ప్రభుత్వం కూడా నాణ్యమైన పాలు ఉత్పత్తిదారులకు సబ్సిడి ఇస్తోంది.

చింతామణిలో పార్లర్

చింతామణిలో పార్లర్


కమ్యూనిటీ పార్లర్

మూడు సంవత్సరాల కాలంలోనే , కర్ణాటకలోని (చిక్కబల్లాపూర్ జిల్లా) చింతామణి తాలుకాలోని స్టెల్ యాప్స్‌ 200 ఆవులతో కమ్యూనిటీ పార్లర్ ప్రారంభించింది. కంపెనీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది చాలు అంటూ సింపుల్‌గా వివరిస్తారు ఫౌండర్స్. ఈ సంస్థ అందరి కంటే భిన్నంగా అసాధారణ ఆవిష్కరణలతో కొత్త ప్రపంచానికి నాంది పలుకుతోంది.

website