ఆటలతో ఇంగ్లిష్ నేర్పిస్తూ సూపర్ హిట్ అయిన 'ఇంగురు'

ఆటలతో ఇంగ్లిష్ నేర్పిస్తూ సూపర్ హిట్ అయిన 'ఇంగురు'

Thursday August 06, 2015,

3 min Read

కింగ్స్ లెర్నింగ్ బెంగళూరులో మొదలైన ఓ స్టార్టప్ కంపెనీ. ఆంగ్ల భాషలో ప్రొఫెషనల్స్‌ను తయారు చెయ్యడమే వీళ్ల ముఖ్యోద్దేశం. గతేడాది ఏప్రిల్ నెలాఖరున లాంచ్ అయ్యింది. రెండు నెలల్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి 70 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్న ఏకైక లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లిష్ అప్లికేషన్ ఇదే. రోజు రోజుకీ ఇంగురు (EnGuru - ఇంగ్లిష్ గురు) ను డౌన్ లోడ్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం రోజూ కనీసం వెయ్యి మంది డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. యూకే కింగ్స్ కాలేజీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం పోటీ పడే విద్యార్థులకు కోచింగ్ అందివ్వడంతోపాటు ఆంగ్లభాషలో కూడా శిక్షణ ఇస్తున్న ఓ చిన్న సంస్థ ఇంగురు.

image


ఆటలతోనే ఇంగ్లిష్ భాషను నేర్పుతూ ఉద్యోగార్థులకు భాషా మెళుకువలు నేర్పించడం ఇంగురు అప్లికేషన్ ప్రత్యేకత. షాప్ కీపర్ తో సంభాషణ దగ్గర నుంచి కార్పొరేట్ కార్యాలయాల్లో రోజూ వారీ వ్యవహారాల వరకు అవసరమయ్యే అన్ని మెళుకువలూ ఈ యాప్‌లో ఉంటాయి. కేవలం పాఠాలు మాత్రమే కాదు ఎంత వరకు నేర్చుకున్నామో తెలుసుకునేందుకు అవసరమైన అభ్యాసాలు కూడా ఉండటం విశేషం.

ఈ గేమ్‌లో క్యారెక్టర్... అప్లికేషన్ ఉపయోగించేవాళ్లే అవుతారు. కస్టమర్లతోనూ, తోటి ఉద్యోగులతోనూ, మేనేజర్లతోనూ మాట్లాడే సమయంలో అవసరమయ్యే భాషా సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇంగురు ఇంటరాక్టివ్ లెర్నింగ్ తోడ్పడుతుంది. ఆంగ్ల భాషలో నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా రిటైల్ రంగంలో మీ కెరీర్ ను అద్భుతంగా నిర్మించుకోవచ్చు.

ఆఫీసుల్లో ఆంగ్లంలోనే రోజూ వారీ వ్యవహారాలు కొనసాగించే వాళ్లకు తగిన సాయమందించడమే ఇంగురు ముఖ్య ఉద్ధేశం. విద్యార్థులకు, యువతకు, ఉద్యోగులకు, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంగ్లీష్ భాష అవసరమున్న ప్రతి ఒక్కరికి ఈ అప్లికేషన్ సహాయపడుతుంది.

" ఇప్పటి వరకూ వచ్చిన అప్లికేషన్లన్నీ ఆంగ్ల భాషను మూలాల నుంచి నేర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఏ ఒక్కరూ రోజూవారి అవసరాలకు తగినట్టు సంభాషణలపై దృష్టి పెట్టలేదంటారు కింగ్స్ లెర్నింగ్ కో ఫౌండర్ అర్షన్ వకీల్.

అంతే కాదు ఇంగురు పూర్తిగా సంస్థాగతంగా అభివృద్ధి చేసిన అప్లికేషన్. దీని కోసం పని చేసిన టీచర్లు, ప్రోగ్రామ్ డైరక్టర్లు, స్పోకెన్ ఇంగ్లీష్ అధ్యాపకులు అందరూ కలసి.. చర్చించి బోధనలో వాళ్లు నేర్చుకున్న పాఠాలను, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త అప్లికేషన్ తయారు చేశారు. అందుకే నిత్య వ్యహారాల్లో అవసరమయ్యే ఆంగ్ల భాషా నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఇంతకన్నా బెస్ట్ అప్లికేషన్ ఇంకొకటి లేదన్నది అర్షన్ అభిప్రాయం.

లాంగ్వేజ్ అప్లికేషన్‌గా మార్గెట్లోకి అడుగుపెట్టిన ఇంగురు... ప్రత్యర్థులెవ్వరూ ఊహించని పంథాను ఎంచుకుంది. ఈ లెర్నింగ్ అప్లికేష్ పూర్తిగా ఆట లాగే ఉంటుంది. దీంతో ఒకసారి ఆట మొదలుపెట్టిన ఏ మొబైల్ యూజర్ అంత వేగంగా బయటకు రారు. అదే సమయంలో యూజర్స్ లో ఉన్న ఆంగ్ల భాషా లోపాలను తెలియజేసి వాటిని సంభాషణల ద్వారా సరి చేసి భాషలో నైపుణ్యాన్ని పెంచుతుంది.

ఇంగురు టీం

ఇంగురు టీం


ఉద్యోగ అవకాశాల్ని పెంచుతుంది

కేవలం ఆంగ్ల భాషా నైపుణ్యాలు , కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్లే ఉద్యోగాలు సంపాదించలేకపోతున్న వారిపైనా దృష్టి పెట్టింది ఇంగురు. 2014 ఫిబ్రవరిలో లాంచ్ అయిన కింగ్స్ లెర్నింగ్ ఇప్పటి వరకు దేశంలోని వివిధ నగరాల్లో సుమారు 7000 మందికి ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చింది. ఆన్ లైన్లో శిక్షణకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

కాలేజీలు, కార్పొరేట్ సంస్థలు, లాంగ్వేజ్ స్కూల్స్ ను భాగస్వాములుగా చేసుకొని దేశం మొత్తం మీద వివిధ వర్గాలకు నిపుణులతో నేరుగా తరగతులు నిర్వహించాం. ఇంగురు అప్లికేషన్ మా సేవలకు కొనసాగింపు మాత్రమే. స్మార్ట్ ఫోన్ ఉన్న ఎవ్వరైనా ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు. విద్యార్థులు, యువకులు సంభాషణల నుంచి, అనుభవాల నుంచి మొబైల్ గేమ్స్ ద్వారా ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను పెంచుకొని ఇంటా,బయటా,కార్యాలయాల్లో ఇబ్బందులు పడకుండా చెయ్యాలన్నదే ఇంగుర్ ప్రధాన లక్ష్యం అంటారు అర్షన్.

ఇంగురు 2.0

ఇంగురు యాప్ పూర్తిగా ఉచితం. ఎలాంటి ప్రకటనలు కూడా కనిపించవు. ప్రస్తుతానికి జనం నుంచి వస్తున్న స్పందన పట్ల సంతృప్తిగానే ఉన్నప్పటికీ మార్కెట్లో పూర్తి స్థాయిలో నిలదొక్కుకోవాలంటే మరింత మంది ఈ అప్లికేషన్ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అయితే ఇందులో విశేషం ఏంటంటే.. డౌన్ లోడ్ చేసుకున్న వాళ్లు కేవలం అలా వదిలేయడం లేదు. వీలైనంతగా ఉపయోగించుకుంటున్నారు. అంతేకాదు అన్ ఇనిస్టాల్ చేసే వారి సంఖ్య కూడా చాలా తక్కువ. గూగుల్ ప్లే స్టోర్ లో రివ్యూలు కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి.

"ప్రస్తుతం మేం ఇంగురు 2.0 వెర్షన్ పై దృష్టి పెట్టాం. సెప్టెంబర్ నుంచి తెలుగు, మలయాళం, తమిళం, హింది, కన్నడ, అరబిక్ భాషల్లో ఈ అప్లికేషన్ లభ్యమవుతోంది. మా అప్లికేషన్‌ను ఫాలో అయ్యే వారెవ్వరైనా ఇంగ్లిష్ భాషను ప్రాధమిక స్థాయి నుంచే నేర్చుకోవచ్చు. పారిశ్రామిక అవసరాలకు ,ఆతిథ్య పరిశ్రమకు, బీపీఓలకు అవసరమైన ఆంగ్లాన్ని చిన్న చిన్న కథలద్వారా అర్థమయ్యేలా వివరిస్తాం." --- అర్షన్

సవాళ్లను స్వీకరించడం

లాంగ్వేజ్ అప్లికేషన్లు ఎదుర్కొనే అతి పెద్ద సవాల్ యూజర్లను మళ్లీ మళ్లీ అప్లికేషన్‌ను ఉపయోగించుకునేలా చెయ్యడం. ఈ సమస్యను అధిగమించడానికి ఇంగురు టీం శాయశక్తులా ప్రయత్నిస్తోంది.ఈ లాంగ్వేజ్ యాప్ విభాగంలో ఇప్పటికే స్థిరపడ్డ ప్రత్యర్థులను తట్టుకోవడం సవాలుతో కూడుకున్నదే. ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రత్యర్థులు ఉన్నారు. అలాగే స్థానికులు ఉన్నారు.

" ఓ విధంగా మా బిజినెస్ మోడల్ గురించి చెప్పాలంటే అటు సంప్రదాయ క్లాస్ రూం బోధన , ఇటు మొబైల్ అప్లికేషన్ రెండూ ప్రత్యర్థులతో పోల్చితే భిన్నమైనవే. సమష్టి కృషిలో లోపం లేదు. అంతే కాదు ఆఫ్‌లైన్ తరగతుల వల్ల నిధులకు లోటు లేకపోవడం మాకు ఉన్న అదనపు ప్రయోజనం. విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే అవకాశం కూడా ఉంది. బోధనలో మాకు ఉన్న అనుభవంతో పాటు ఈ ఫీడ్ బ్యాక్ భాషార్థులకు అనుకూలమైన లెర్నింగ్ ఇంగ్లిష్ అప్లికేషన్‌ను సాధ్యం చేసేందుకు మాకు ఉపయోగపడింది " - అర్షన్

website